ఇంకో పిచ్చి డ్రామా అనుకున్నారు అందరూ…? ఎవడురా ఈసారి సీజన్ లీడ్ చేస్తున్న క్రియేటివ్ టీమ్ అని అడగాలి అనేట్టుగా… రొటీన్ లెంతీ ఎలిమినేషన్ ప్రొసీజర్ లేకుండా, హఠాత్తుగా నువ్వు ఎవిక్టెడ్ పో అనేయడం ఏమిటి…? నాగార్జున వద్దకు వెళ్లి జర్నీ చూసేయడం… ప్రతిసారీ రొటీన్‌గా అమలు చేసే సీక్రెట్ రూం తతంగమా ఇది అనుకున్నారు… కానీ బాలాదిత్యను అందరి అభిప్రాయాలు అడిగి, నిజంగానే పంపించేసినట్టున్నారు…
సీజన్ బిగి పెరగడం కోసం తప్పదు… కానీ కొందరు బలమైన కంటెస్టెంట్లను పంపించేస్తున్నారు, అదే అర్థం కాని విషయం… పబ్లిక్ ఒపీనియన్ అంటారు గానీ ఆచరణలో అదేమీ పట్టించుకోరు తెలుసు కదా… గీతూ మీద ఎన్ని విమర్శలు ఉన్నా సరే, బలమైన contestant… అనూహ్యంగా వెళ్లగొట్టారు… Public opinion ప్రకారం కాదు… మోసీ మోసీ బిగ్ బాస్ టీమ్ తనే అకస్మాత్తుగా కింద పడేసింది… మధ్యలో ఆర్జే సూర్యను అలాటే పంపించేశారు… ఇప్పుడు మరో బలమైన contestant బాలాదిత్యను అలాగే బయటికి పంపించారు… రీఎంట్రీ కోసం ఒక డ్రామా ఆడుతున్నారా అనేది గనుక వదిలేస్తే… నిజంగా వెళ్లిపోతే మాత్రం గేమ్ కు ఇంకో నష్టం…
అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న షో… ఈరోజుకూ బిచ్చపు రేటింగ్సే ఉన్నయ్ దానికి… పైకి లేపాల్సింది పోయి, ఇంకా టీమే తొక్కేస్తున్నట్టుంది చూడబోతే… బాలాదిత్యతోపాటు డబుల్ ఎలిమినేషన్ స్కీంలో వాసంతిని పంపించేశారని మరో టాక్… సరే, అదీ చూద్దాం, కాకపోతే ఆమె బలమైన కంటెస్టెంట్ కాదు, పోయినా పెద్దగా ఎవరికీ ఆ ఎలిమినేషన్లో ఆసక్తి ఉండదు… కాకపోతే శ్రీహాన్ కాస్త బాధపడతాడు… పదే పదే చూస్తుండిపోయే అందం దూరమవుతున్నందుకు…
Ads
బలమైన కంటెస్టెంట్లను పంపిస్తే ఆటలో మజా ఏం పెరుగుతుంది..? మరింత దిగజారి, ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి చచ్చిపోతుంది… చూడబోతే ఈ సీజన్ ఏమాత్రం ఇంట్రస్టింగుగా నడవకుండా టీంలోనే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా..? రేవంత్ ఎన్ని తప్పులు చేస్తున్నా మోస్తున్నారు కదా… సేఫ్‌గా తనను ఫైనలిస్టు వైపు నడిపించబోతున్నారా..? ఫైమా, ఇనయ, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డిలను టాప్ ఫైవ్‌లో ఉంచబోతున్నారా..?
పైగా బిగ్‌బాస్ టీం నాగార్జున ఇజ్జత్ తీసేస్తోంది… హౌజులో జరిగేది ఒకటి, తనతో అనిపించేది మరొకటి… దాంతో ప్రేక్షకుల్లో నాగార్జున పరువు పోతోంది గానీ టీంను సగటు ప్రేక్షకుడు తిట్టుకోలేడు కదా… నిజానికి నాగార్జున మొత్తం ఫీడ్ చూడడు… అసలు గేమ్ చూస్తాడా అనేదే డౌటు… చివరలో టీం రాసిచ్చేది చదువుకుని, దాన్ని బట్టి వీకెండ్ షో రన్ చేస్తాడు… అంతే… కానీ టీం అబద్ధాలు రాసిస్తే, తనేం చేస్తాడు…? ఇదుగో ఇప్పటిలాగే పరువు పోగొట్టుకుంటాడు…
రేవంత్‌ను ఎందుకు అంతగా మోస్తున్నదో బిగ్ బాస్ టీం అర్థం కాదు… కంటెస్టెంట్ల మీద ఎడాపెడా వ్యాఖ్యలు, చిల్లర వ్యాఖ్యలు కూడా చేసేస్తుంటాడు… మళ్లీ వీకెండ్ షోలో బుద్దిగా ‘‘సారీ చెప్పాను సార్’’ అని సంజాయిషీలు ఇస్తుంటాడు… మరీ ఇనయని రెండు మూడు వారాలుగా పర్సనల్‌గా టార్గెట్ చేసి మరీ కేరక్టర్‌ను దిగజారుస్తున్నాడు… నాగార్జున కిమ్మనడు… పైగా ఇనయనే ఉల్టా ‘‘నీకు కోపం వస్తే ఇష్టారాజ్యంగా మాటలు వదిలేస్తున్నావ్… ఆటలో ఓడిపోతే ఫ వర్డ్స్ వాడేస్తావా..? పైగా నామినేషన్స్‌లో ఫైమాను పట్టుకుని అడల్ట్ కామెడీ స్టార్ అంటావా..? నిన్ను ఏమనాలి మరి..?’’ అని క్లాస్ పీకాడు…
అంటే రేవంత్ చేస్తే తప్పు కాదు, ఇనయ చేస్తే తప్పా..? ఇనయ మీద శ్రీసత్య కూడా పిచ్చి బూతులకు దిగింది… సత్యను ఎవరూ ఏమీ అనరు… చివరకు ఆదిరెడ్డి కూడా ఇనయను టార్గెట్ చేసి ఏదో బూతు మాట అన్నాడు… నీ జర్నీలో ఎవడో ఒకడిని గోకుతూనే ఉంటావ్ అన్నట్టుగా ఏదో అన్నాడు… చివరకు ఇదే ఫైమా ‘నువ్వూ, సూర్య ఏం చేసుకున్నారో చూశాంలే, థూ’ అని తిట్టింది… ఇవేమీ నాగార్జునకు కనిపించవు… ఇవి పర్సనల్ అటాక్స్ కావట… ఫాఫం నాగార్జున… ఏం టీం దొరికిందయ్యా నీకు..!?
Share this Article