ప్రస్తుతం తెలుగులో టాప్ వన్, టూ మ్యూజిక్ కంపోజర్లు థమన్, డీఎస్పీ… సంగీతానికి తోడు ఇద్దరూ కొన్ని వేషాలు వేస్తుంటారు… ఇప్పుడు బలంగా పోటీపడబోయే రెండు సినిమాలకు వాళ్లే ప్రధానంగా తలపడబోతున్నారు… ఒకటి చిరంజీవి వాల్తేరు వీరయ్య… దానికి డీఎస్పీ కంపోజర్… రెండోది వీరసింహారెడ్డి… దానికి కంపోజర్ థమన్…
మొన్న వాల్తేరు వీరయ్య సాంగ్ రిలీజ్ చేశాడు డీఎస్పీ… మెగాస్టార్ ఫ్యాన్స్‌కే అది పెద్దగా నచ్చలేదు… సాదాసీదా ట్యూన్ చిరంజీవికి ఎలా సూట్ అవుతుంది… అసలు చిరంజీవి బలమే స్టెప్పులు, ట్యూన్లు… అవి లేకపోతే చిరంజీవి సినిమా ఉండదు… అలాంటిది తనే పాట రాసి, తనే పాడి, తనే కంపోజ్ చేసిన ఆ పాట అంత జోష్‌లో లేదు…
పైగా రిలీజ్ చేసిన ఆడియోలో తనే డప్పందుకో హెయ్, బూరందుకో హెయ్ అని డీఎస్పీ చేసే హడావుడి కనిపిస్తుంది గానీ ట్యూన్‌లో పెద్దగా సరుకు లేదు… ఒకవైపు పరమ మాస్ లుక్కులో చిరంజీవి స్టెప్పులు కనిపిస్తుంటే దానికి తగ్గట్టు ట్యూన్ మోగిపోవాలి కదా… లేదు… మరి థమన్ ఏమైనా ఉద్దరించాడా అంటే అదీ లేదు…
Ads
అసలే తను కాపీ మాస్టర్… అప్పటికప్పుడు తన పాత ట్యూన్లు గానీ, మంది ట్యూన్లు గానీ ఎత్తుకొచ్చి పెట్టేస్తుంటాడు… ఈసారి ఏకంగా తెలుగునాట మస్తు పాపులరైన పాత పాట ఒసే రాములమ్మా స్టయిల్‌లో ఓ పాట కంపోజ్ చేశాడు… ఇది మరీ తెలుగు ప్రేక్షకుల్ని హౌలా గాళ్లను చేయడమే…
జై బాలయ్యా, జైజై బాలయ్యా అనే ఫ్యాన్స్ మంత్రానికి ఆ ట్యూన్ సెట్ కాలేదు… థమన్ కూడా బాలయ్య ఫ్యానే… ఐనాసరే ట్యూన్ మీద శ్రద్ధ చూపించలేదు సరికదా, ఓ వైట్ డ్రెస్ వేసి, బంగారం దట్టించి, అద్దాలు పెట్టి నాలుగు స్టెప్పులు వేస్తూ కనిపించాడు…
ఈ కొత్త ట్రెండ్ మిగతావాళ్లు పాటించాలంటే కష్టం కాదా స్వామీ… డీఎస్పీ ఎగురగలడు… తననే హీరోగా పెట్టినా దున్నేయగలడు… కాస్త బరువు తగ్గితే నువ్వూ హీరో సరుకే… మీరే పాడి, మీరే రాసి, మీరే తెరపై ఎగురుతుంటే… మరి మిగతా సంగీతదర్శకులు ఏమైపోవాలి..? పాడటం, రాయడం వరకూ కీరవాణి చేయగలడు… పోనీ, డీఎస్పీ, థమన్ ఈ వేషాలు వేస్తున్నా సరే, ఆ ట్యూన్లు యూట్యూబులో మారుమోగిపోతున్నాయా అంటే అదీ లేదు…
సినిమాలు హిట్టవుతుంటాయి, ఫ్లావపతుంటాయి… బాలయ్య వాటిని పెద్దగా పట్టించుకోడు… కానీ అఖండ భారీ విజయం తరువాత వస్తున్న సినిమా ఇది… కథేంటి, దర్శకుడేంటి అనే వివరాల్లోకి మనం పోవడం లేదు గానీ… ఇప్పుడు రిలీజ్ చేసిన పాట ట్యూన్‌పరంగానే కాదు, కథాపరంగా కూడా ఓ సోది రొటీన్ సాంగ్… ప్రత్యేకించి తమిళ ధోరణి… హీరోను ఊరంతా, జనమంతా నువ్వు తప్ప మాకు వేరే దిక్కులేదు, నువ్వు తోపు, నువ్వు తురుము అనే పాట… థియేటర్లలో వస్తుంటే గతంలోనైతే సిగరెట్ ఊదడానికి జనం బయటికి వెళ్లేవాళ్లు… మరిప్పుడేం చేయాలి థమన్..?!
Share this Article