అనేకానేక వివాదాలు, లీకుల తలనొప్పులు, సుదీర్ఘ కాలయాపన తరువాత ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించింది… అనేక మంది నిరుద్యోగుల కల గ్రూప్- వన్… మరి ఈ పరీక్షపత్రం ఎలా ఉంది..? కాషాయ బ్యాచ్ ఆల్‌రెడీ దీన్ని తిట్టిపోసింది… కృత్రిమ సెక్యులర్ ప్రశ్నపత్రం అంటూ ఆడిపోసుకుంది… నిజానికి ఈ పరీక్షపత్రం ఎలా ఉంది..? నిజంగా నాణ్యమైన పరీక్షపత్రమేనా..? అభ్యర్థుల తెలివితేటల్ని నిగ్గుతేల్చే సత్తా ఉన్నదేనా..? సోషల్ మీడియాలో మిత్రుడు Sampath Rao Pulluri …. రాసిన విశ్లేషణ ఒకటి బాగుందనిపించింది… అది యథాతథంగా…
గ్రూప్ వన్ ఎగ్జామ్… నిన్న తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. గతంలో జరిగిన అర్హత పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయిన దరిమిలా మళ్ళీ నిన్న పరీక్ష పెట్టారు. అంతకు ముందు పరీక్ష పత్రం బాగా కఠినంగా ఉందని చెప్పారు. అంతకు ముందు అర్హత సాధించని వాళ్ళలో కొందరు ఈ సారి ఆశావాదంతో పరీక్షకు సిద్ధం అయ్యారు. అయితే నిన్నటి పేపర్ అంతకు మించి కఠినంగా ఉందని, ఇంతకు ముందు అర్హత సాధించిన వాళ్ళలో కొందరు ఇప్పుడు గట్టెక్కలేరని, విద్యార్థుల మీద కక్ష సాధింపుగా పేపర్ ఉందని చెప్తున్నారు. కోచింగ్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కటాఫ్ 70 కి మించి ఉండదని అంచనా వేస్తున్నారు. అంటే 150 ప్రశ్నలలో సగానికి మించి ప్రశ్నలు విద్యార్థులకు తెలియనివి రూపొందించారని అర్థం.
Ads
Share this Article