Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జెనిబెన్..! బీజేపీ అడ్డాలో ప్రజలే డబ్బులిచ్చి గెలిపించిన కాంగ్రెస్ స్త్రీ…

June 16, 2024 by M S R

జెనిబెన్ ఠాకూర్… గుజరాత్‌లోనే కాదు, ఇండి కూటమిలో కూడా ఈ పేరు ఇప్పుడు బడా పాపులర్ పేరు… అసలు ఎవరీమె… జెయింట్ కిల్లర్… గుజరాత్‌లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక సీటులో విజేత ఈమే… 2014లో 2019లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు రాష్ట్రంలో… కానీ ఈసారి జెనిబెన్ గెలిచింది…

49 ఏళ్ల మహిళ గెలవడం ఒక్కటే కాదు విశేషం… సొంతంగా ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు… దాంతో ప్రతి ఊరి నుంచీ క్రౌడ్ ఫండింగ్ చేసుకుని, వాటినే జాగ్రత్తగా ప్రచారానికి ప్లాన్ చేసుకుని, బీజేపీ ఎత్తుగడలన్నీ చిత్తు చేసి, గెలిచింది బీజేపీకి బలమైన అడ్డా వంటి బనస్కాంత సీటు నుంచి…

ఇది రాజస్థాన్ బోర్డర్‌లో ఉండే నియోజకవర్గం… ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ ఫార్మింగ్‌కు ఫేమస్… ది బానస్ దెయిరీ ఇక్కడిదే… 2014లో హరిభాయ్ పార్థీభాయ్ చౌధరి ఇక్కడ నుంచి 2 లక్షల వోట్ల మెజారిటీతో గెలవగా, 2019లో బీజేపీకే చెందిన పర్భాత్ భాయ్ సవభాయ్ పటేల్ ఏకంగా 3.68 లక్షల వోట్ల మెజారిటీతో గెలిచారు…

Ads

అలాంటి బలమైన బీజేపీ సీటులో జెనిబెన్ ఈసారి 30 వేల చిల్లర వోట్ల మెజారిటీతో గెలిచింది… అసలు గెలవడమే పెద్ద విశేషం కదా… రాష్ట్రంలో ఈమె గాకుండా మరో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి నిలబడింది… అదీ గాంధీనగర్‌లో… అక్కడ అమిత్ షా 7 లక్షల పైచిలుకు వోట్ల తేడాతో గెలిచాడు… ఈ కోణంలో కూడా జెనిబెన్ గెలుపు విశేషమే…

జెనిబెన్ గెలిచింది కూడా ఓ మహిళా ప్రత్యర్థి మీదే… ఆమె పేరు రేఖా చౌధరి… ఆమెకు శంకర్ భాయ్ చౌధరి అనే లీడర్ బలమైన అండ… అంతకుముందు ఎన్నికల్లో ఇదే శంకర్ భాయ్‌ను ఇదే జెనిబెన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది… ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది… అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవచ్చుగాక, కానీ బానస్ డెయిరీ చైర్మన్‌గా బలమైన ప్రభావం చూపించగల వ్యక్తే ఆయన…

మీడియాతో మాట్లాడుతూ ఆమె షేర్ చేసుకున్న ఇతర వివరాలు… ‘‘ఇప్పుడు జెయింట్ కిల్లర్ అని పిలుస్తున్నారేమో గానీ నేను 28 ఏళ్లుగా పార్టీకి వర్క్ చేస్తున్నాను, మా నాన్న కూడా పంచాయతీ ఎన్నికల్లో నిలబడేవాడు… నేను కూడా నా పొలిటికల్ కెరీర్ పంచాయతీ ఎన్నికల నుంచే మొదలుపెట్టాను… నిజానికి ఇది ప్రజాక్షేత్రంలో నా తొమ్మిదో ఎన్నిక…

బనస్కాంత నియోజకవర్గంలోని అబాసన అనే చిన్న ఊరు మాది… తండ్రి రైతు… నేను రాజకీయాల్లో, సోషల్ వర్క్‌లో కొనసాగడానికి తనే స్పూర్తి… కానీ నిజానికి మా అమ్మను మెచ్చుకోవాలి, చదువు లేదు, కానీ మా అయిదుగురు పిల్లలు బాగా చదువుకోవాలని బాగా కష్టపడేది… వేరేవాళ్ల పొలాల్లో కూలీకి వెళ్లేది కూడా…

కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు… డబ్బులు అందే సౌకర్యం లేదు, అందుకని ఈసారి క్రౌడ్ ఫండిగ్ మీదే ఆధారపడ్డాను… అంటే, ఏ ఊరి ఎన్నికల ఖర్చు ఆ ఊరే భరించేలా… ఎవరికైనా తక్కువ పడితే ఇరుగుపొరుగు ఊళ్ల నుంచి అడ్జస్ట్ చేసేవాళ్లం… మేం ఎక్కువ ఖర్చు చేసింది ఏజెంట్లకే… 2000 బూతులకు 5 వేల చొప్పున అదే పెద్ద ఖర్చు… 10 రూపాయల నుంచి 25 వేల వరకు విరాళాలు వచ్చాయి…

28 ఏళ్లుగా తిరుగుతున్నాను కదా, నేను అందరికీ తెలుసు… ఎప్పుడూ జనంలోనే ఉంటాను, అందుకే నా ఎన్నికల ఖర్చును స్వచ్ఛందంగా జనమే భరించారు… 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పార్టీలోనే కొందరు నన్ను వ్యతిరేకించారు… కానీ మాధవ్ సిన్హ్ సోలంకి (మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రి) బలంగా మద్దతునిచ్చారు… ఓడిపోయినా పర్లేదు, అనుభవం వస్తుంది, ఓ పాఠం నేర్చుకుంటాం అనేవాడు…

కుటుంబం, పిల్లలు బాధ్యతల కారణంగా స్త్రీలకు విస్తృతంగా జనంలోకి వెళ్లి వర్క్ చేయడానికి కొంత కష్టం… మా అబ్బాయి గ్రాడ్యుయేట్, జాబ్ చేసుకుంటున్నాడు… సో, నాకు రాజకీయాల్లో తిరగడం పెద్ద కష్టం కాలేదు… అబ్బాయి చిన్నవాడిగా ఉన్నప్పుడు మా కుటుంబం, నా భర్త కొంత వర్క్ షేర్ చేసుకునేవాళ్లు… అనవసరమైన విషయాలపై టైమ్, మన ఆలోచనలు వేస్ట్ చేసుకోకుండా మన టార్గెట్ మీదే కాన్సంట్రేట్ చేసి వర్క్ చేస్తే ఎప్పుడో మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతాను నేను…

ఓ చిన్న వ్యాపాారం ఉంది… సోషల్ వర్క్ చేస్తాను… కానీ బీజేపీ నాలాంటోళ్లను కూడా పార్టీ విడిచిపెట్టిపోయేలా చేస్తుంది… 30 ఏళ్లుగా మేమిక్కడ అధికారంలో లేం… కాంగ్రెస్‌లో కాస్త ఆస్తులుండి, ఖర్చు పెట్టడానికి సిద్ధపడేవాళ్లను బీజేపీ విడిచిపెట్టదు… ముందుకు రానివ్వదు… అదే మాకు నిధులు లేకపోవడానికి కారణం… ఐతేనేం, ప్రజలే స్వచ్చందంగా నిధులిచ్చి మరీ గెలిపించారు కదా… అదీ ఆనందం..’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!
  • మోడీ నిర్మించిన ఆ సర్దార్ విగ్రహంకన్నా మూడడుగులు ఎక్కువే..!!
  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…
  • శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions