Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మి ఫస్ట్ టైమ్… సుధీర్ కూడా అంతే… జంప్ అయిపోయినట్టేనా జంట..?!

March 12, 2022 by M S R

నిజంగానే టీవీ ప్రేక్షకులకు ఇది విశేషమే… తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ మొదటిసారి ఈటీవీ గాకుండా వేరే టీవీలో కనిపించనున్నాడు… అంతేనా..? తనకు జోడీగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన రష్మి కూడా అంతే… ఇద్దరూ తొలిసారి మాటీవీ నిర్మించిన హోలీ స్పెషల్ షోలో కనిపించారు…

రష్మి ఓ దశలో ఎమోషన్‌కు గురై, కంటి కాటుక తీసి, సుధీర్ బుగ్గపై చుక్క పెట్టి దిష్టి తీసింది… అఫ్‌కోర్స్, వాళ్ల స్నేహం సుదీర్ఘకాలంగా గాఢమైంది… అందులో వెకిలి లేదు, మంచిగుంది ఆ సీన్..! అంతకుముందు అవినాష్ ‘‘అన్నా, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’’ అంటూ స్వాగతం పలికాడు… అయితే ఇందులో విశేషం ఏమిటి అంటారా..?

ప్రదీప్ వంటి యాంకర్లు వేర్వేరు టీవీల్లో, వేర్వేరు షోలలో కనిపిస్తారు… శ్రీముఖి, అనసూయ కూడా అంతే… అఫ్‌కోర్స్, సుమ… ఐనా ఏ ఆంక్షలూ ఆమెను కట్టిపడేయలేవు, లెజెండ్… మిగతా యాంకర్లలో కొందరు అంతే… గతంలో ఈ టీవీ కాకి ఆ టీవీ మీద వాలొద్దు అన్నంతగా నిర్బంధాన్ని అమలు చేసేది ఈటీవీ… కంట్రాక్టు లేబర్‌లాగా, ఆర్టిస్టులతో కంట్రాక్టులు రాయించేది… ఉల్లంఘించి వేరే టీవీలకు వెళ్తే 10 లక్షలు కక్కి వెళ్లు అనేది…

Ads

sudheer

ఈమధ్య కాస్త సడలింపు కనిపిస్తోంది… అయితే సుధీర్ గానీ, రష్మి గానీ ఈటీవీ షోలలో తప్ప వేరే టీవీల్లో కనిపించేవాళ్లు కాదు… ప్రత్యేకించి సుధీర్..! ఓంకార్ వంటి సీనియర్ యాంకర్లు నిర్వహించే షోలలో ఒకటీఅరా సందర్భాల్లో కనిపించి ఉండొచ్చు గానీ… ఈటీవీకి పోటీగా ఉండే ప్రోగ్రాముల జోలికి పోడు… ఈటీవీకి కమిటెడ్…

కానీ కొంతకాలంగా తనకు పొగపెడుతున్నట్టు కనిపిస్తోంది… పండుగ స్పెషల్ షోల నుంచి కత్తిరించారు… చాలా పాపులారిటీ ఇచ్చిన ఢీ నుంచి సుధీర్‌ను, రష్మిని తప్పించారు… రష్మి ప్రస్తుతం కేవలం జబర్దస్త్‌ షో మాత్రమే చేస్తోంది… సుధీర్ దానికితోడుగా శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాడు… గత నెలతోనే సుధీర్ కంట్రాక్టు పిరియడ్ అయిపోయిందనీ, ఇక సుధీర్ ఎటు వెళ్లాలన్నీ ఏ లీగల్ ఆబ్లిగేషన్స్ లేవని అంటున్నారు… ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా సుధీర్ హోలీ స్పెషల్ షోలో కనిపించడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది…

సుధీర్, రష్మి ఈటీవీ నుంచి జంపై పోయినట్టేనా..? ఎలాగూ నాగబాబు మాటీవీకి వచ్చి చేరాడు కాబట్టి, తన ద్వారా ఈ జంట మాటీవీ తీరం చేరిందా అనేది తాజా డౌట్… ఒకవేళ అదే జరిగితే ఈటీవీకి దెబ్బే… ఒక్క హైపర్ ఆదితో ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నెట్టుకొస్తారా..? అసాధ్యం..! ఇప్పటికే వినోద చానెళ్ల జాబితాలో మూడో స్థానానికి దిగజారింది ఈటీవీ… ఈటీవీ న్యూస్ బులెటిన్ల తరువాత రేటింగ్స్ వచ్చేది జబర్దస్త్ వంటి షోలకే… ఇక వాటినీ దెబ్బ తీసుకుంటుందా ఈటీవీ..? సుధీర్‌ను మల్లెమాల మేనేజ్‌మెంట్ వదిలేసుకుంటుందా..? చూడాలిక…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions