Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ డ్రై రియాలిటీ షోను కూడా జనరంజకం చేశాడు ఈ గాలోడు..!!

May 13, 2024 by M S R

ఈమధ్య ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షో ప్రోమోలు, ఆ ఓటీటీ సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టే వీడియో బిట్స్ చూస్తుంటే… ఆశ్చర్యం ఏమీ వేయలేదు, పైగా సుడిగాలి సుధీర్‌ను అభినందించాలని అనిపించింది…

నిజానికి సర్కార్ షో అంటే ఏవేవో చిన్న చిన్న ప్రశ్నలు, సెలబ్రిటీలు, డబ్బు బెట్ కాస్తూ సమాధానాలు ఇవ్వడం, నడుమ నడుమ సరదా ముచ్చట్లు… టీవీ రియాలిటీ షోలలోనే ఇది కాస్త డ్రై సబ్జెక్టు… ఇక ఓటీటీలో ఎవరు చూస్తారు అనుకున్నారు అందరూ…

sudigali

Ads

సుమ అడ్డా వంటి షోలలోలాగే ఇలాంటివి యాంకర్ స్పాంటేనిటీ, చెణుకులు గట్రా షోను లైవ్‌గా ఉంచుతాయి… ఆహా సర్కారు రియాలిటీ షోకు కూడా యాంకర్ ప్రదీప్ అసెట్… నో డౌట్, తను తెలుగు టీవీ యాంకర్లలో నంబర్ వన్ మేల్ యాంకర్… వెకిలితనం, పిచ్చి జోకులు, వెగటు సెటైర్లు లేకుండా కంటెస్టెంట్లతో హాయిగా కలిసిపోయి షో రక్తికట్టిస్తాడు… మరి తను వెళ్లిపోయాక సుధీర్ ఆ షో హోస్టింగు తీసుకున్నాక, ప్రదీప్ వంటి అత్యంత సీనియర్ యాంకర్‌ను మరిపిస్తాడా అనే డౌట్ ఉండేది…

sudigali

కానీ సుధీర్ ప్రదీప్‌ను మించి రక్తికట్టిస్తున్నాడు ఆ షోను, అఫ్ కోర్స్, ఆ షో డైరెక్టర్ల మెరిట్ కూడా ముఖ్యమే… కానీ సుధీర్ దానికి ఇప్పుడు ప్లస్ పాయింట్… ఇంతకుముందు అదే ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ చేశాడు తను… శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఒకటీరెండు టీవీ ప్రోగ్రాముల్లో కూడా హోస్టింగ్ చేశాడు… కానీ ఈ సర్కారు షో (సీజన్4..?) తనను ‘బుల్లితెర సూపర్ స్టార్’ అని ఎందుకు పిలుస్తారో మళ్లీ నిరూపించుకున్నాడు…

sudheer

అప్పుడెప్పుడో మెజీషియన్ షోలతో బతుకు వేట మొదలుపెట్టి, కమెడియన్‌గా, సినిమా నటుడిగా, హీరోగా, ఇప్పుడు యాంకర్‌గా… తను గొప్ప, సూపర్, బంపర్, తోపు అనలేను గానీ ఏ షో అప్పగించినా రక్తికట్టించడానికి తన శక్తియుక్తులన్నీ వెచ్చిస్తాడు… వెరీ గుడ్ పర్‌ఫార్మర్… ప్రస్తుతం బుల్లితెర మీద కనిపించే కమెడియన్లు, యాంకర్లు, నటులు, ప్రజెంటర్లు ఎవరితో పోల్చినా సుధీర్ పది ఆమడల ముందు ఉంటాడు… అది పక్కా…

rashmi sudheer

తనలో నచ్చే సుగుణం ఏమిటంటే… బతుకు వేట నేర్పించిందేమో ఆ అణకువను… తనపై జోకులేసినా, సెటైర్లు పేలినా, కొన్నిసార్లు అవి తనకు అవమానకరమే అయినా నవ్వుతూ స్వీకరించడం ప్లస్ పాయింట్… రష్మితో తన షో ప్రేమాయణం, డాన్సుల్లో మెరిట్, కామెడీ టైమింగ్ ఎట్సెట్రా తనను పెంచాయి… ఆమధ్య గాలోడు సినిమా కూడా డబ్బులు తెచ్చి పెట్టింది…

sudheer

అన్నింటికీ మించి తనకు టీవీ షోలన్నీ కలిపి ఓ ప్లేబాయ్ ముద్ర వేశాయి… ఐనా సరే, అదీ తనకు ప్లస్సే అయ్యింది… అశ్లీలం జోలికి వెళ్లకుండా ఆ ప్లేబాయ్‌తనాన్ని కూడా తనకు ప్లస్సుగా మార్చుకున్నాడు… ఈ సర్కారు రియాలిటీ షోకు కూడా ఆ వాసన కాస్త అద్దాడు… పర్లేదు, అసభ్యంగా ఏమీ ఉండదు… మొన్న ఓ టీవీ నటి అంటోంది… ‘‘సుధీర్ ఫ్యామిలీ మ్యాన్, అంటే ప్రపంచంలోని ప్రతి ఫ్యామిలీలోకి మ్యాన్‌లా వెళ్లి వచ్చేవాడు’’ అట…

sudheer

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… తను చేస్తున్న ఈ సర్కారు షో ఆహా ఓటీటీలో టాప్ ప్రోగ్రామ్ అట ఇప్పుడు… అందుకే ఆశ్చర్యం అనిపించలేదు, ఆ డ్రై కాన్సెప్టును జనరంజకం చేస్తున్న తీరు పట్ల సుధీర్‌కు అభినందనలు… ప్రతి ఓటీటీ ప్లాట్‌ఫామ్ తమ ఓటీటీలో ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్న సినిమాలు/ వెబ్ సిరీస్ల గురించి ప్రకటిస్తూ ఉంటుంది… నిజానికి ఓటీటీలోనే టాప్ 10 అనే కేటగిరీ ఉంటుంది… అందులో ఎవరు ఎక్కువగా ఏ మూవీ చూస్తున్నారో దాంట్లో ఉంటుంది…

sudigali

ఈ కేటగిరీలో ఆహా ప్లాట్‌ఫామ్‌లో టాప్ ప్లేస్‌లో సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 4 ఎపిసోడ్ 3 ట్రెండ్ అవుతోంది… ఆహాలో ఉన్న ఎన్నో మూవీ, వెబ్ సిరీస్లను వెనక్కి నెట్టేసి ఒక గేమ్ షో ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు… అసలు తెలుగులో ఉన్నదే ఒక్క ఓటీటీ… (ఈటీవీ వాళ్లది ఉన్నా అది పాపులర్ కాదు)… అందులో అన్‌స్టాపబుల్, ఇండియన్ ఐడల్ వంటి సూపర్ హిట్ రియాలిటీ షోలు…

Sudigali-Sudheer-3

ఐనా సరే, సరైన రెవిన్యూ లేదు ఆ ఓటీటీకి… అందుకని బూతు కంటెంట్‌కు గేట్లు తెరిచారు… ఐనా సరే, ఎవరికైనా అమ్మేసి వదిలించుకుందామని అనుకున్నారు, అదీ వర్కవుట్ కాలేదు… ఈ స్థితిలో ఓ డ్రై రియాలిటీ షోకు తనదైన మార్కుతో మంచి పాపులారిటీ తీసుకురావడం విశేషమే.,. నువ్వు బుల్లితెర మెగా స్టార్‌వేనోయ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions