అడ్డదిడ్డంగా సాగే అనేకానేక తెలుగు టీవీ రియాలిటీ షోలలోని స్కిట్లలో ఇదొక చిన్న పార్ట్… అంతకుమించి దీనికి ఏ ప్రాధాన్యమూ లేదు… కానీ కాస్త భిన్నంగా ఆలోచించి చూస్తే మటుకు… ఓ సన్నని పాజిటివ్ తెమ్మెర చెంపల్ని తాకి పెదాలపైకి ఓ చిరునవ్వును మొలిపిస్తుంది…
ఈటీవీ… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో తాలూకు ప్రోమో… దసరా స్పెషల్… ఏవేవో ఎపిసోడ్ల నడుమ ఓ చిన్న ప్రాంక్ కాల్స్ ఎపిసోడ్… తమకు సన్నిహితులకు ఫోన్ చేసి అర్జెంటుగా ఓ పదివేలు షేర్ చేయాలని అడగాలి టీవీ సెలబ్రిటీలు… హైపర్ ఆది వంతు రాగానే తను ఎవరో లేడీకి ఫోన్ చేయాలని అంటుంది రష్మి… (మహతి..?) (ఆమెకే ఎందుకు..? ఆదికి ఎలా సన్నిహితురాలు..?)
అక్కడొక దిక్కుమాలిన చెణుకు… ఆమె ఆకారానికీ ఫోన్‌లో వినిపించే కాలర్ ట్యూన్‌కూ ఏమైనా సంబంధం ఉందా అని ఓ బాడీ షేమింగ్ బాపతు జోకు… ఆమెను పదివేలు అడిగితే నంబర్ చెప్పండి ఫోన్ పే చేస్తానంది ఆమె… ఎందుకు, ఏమిటి అనేమీ అడగలేదు… నిజానికి మంచి రెస్పాన్స్… ఇస్తావు, పంపిస్తావు, నీదేం పోయింది అని కాల్ కట్ చేస్తాడు ఆది… విచిత్రమైన రియాక్షన్, అడిగిందే తను, ఆమె సానుకూల స్పందనకు ఓ తిక్క ప్రతిస్పందన…
Ads
అదే సుడిగాలి సుధీర్‌ది పూర్తి భిన్నమైన స్పందన… రష్మిని సుధీర్‌కు కాల్ చేయమంటారు… ఆమె చేస్తుంది… వెంటనే ఓ పదివేలు పంపించు అని అభ్యర్థన కాదు, ఆర్డర్ వేసింది ఆమె… సుధీర్‌తో ఆమెకున్న చనువు అది… సుధీర్ కూడా ఎందుకు అని కూడా ఒక్క మాట అడక్కుండా ఈ నంబర్‌కు గూగుల్ పే ఉంది కదాని కన్‌ఫరమ్ చేసుకుని వెంటనే పంపించేశాడు…
అవసరం లేకపోతే అడగదు అని రష్మి మీద సుధీర్‌కు ఉన్న నమ్మకం అది… మొన్న ఓ ప్రాంక్ కాల్‌లో బిగ్‌బాస్ బేబక్క అడిగితేనే (ఏదో యాక్సిడెంట్, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే ప్రాంక్) అవసరమైతే నేను డబ్బు సర్దుబాటు చేస్తాను అని రెడీ అయిపోయాడు… మరి తొమ్మిదేళ్ల అనుబాంధవి రష్మి అడిగితే కాదంటాడా..?
తెలుగు టీవీల్లో సూపర్ స్టార్లు సుధీర్, ఆది… ఇద్దరూ ఒకే విషయంలో స్పందించిన తీరు ఎంత భిన్నం..? ఆది నెగెటివ్‌గా పోట్రే అయ్యాడు… సుధీర్ పాజిటివ్‌గా పోట్రే అయ్యాడు… సరే, నిజంగా ఆ ఎపిసోడ్‌లో ఏం జరిగింది, ప్రోమో ఎలా కట్ చేశారనేది పక్కన పెడితే… జనంలోకి వెళ్లింది మాత్రం ఇద్దరూ పరస్పరం పూర్తి భిన్నంగా… (దీన్నలాగే ప్రసారం చేయడానికి ఆది ఎలా అంగీకరించినట్టు..?)
మేమిద్దరమూ పరస్పరం గౌరవించుకుంటూ, అభిమానించుకుంటూ… ఒకరి కెరీర్‌కు ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటామనీ, అంతకుమించి తమ నడుమ ఏ బంధమూ లేదని ఎన్నిసార్లు చెప్పినా సరే… తొమ్మిదేళ్లయినా సరే, ప్రేక్షకులకు రష్మి- సుధీర్ కాంబో ఓ అట్రాక్షన్ ఈరోజుకూ… టీవీ షోలలో ఇప్పటికీ వాళ్లు కలిసి ఉన్నా, ఎక్కడెక్కడో ఉన్నా సరే కనెక్ట్ కాబడతారు… ఇలాగే..!
Share this Article