అనుకోకుండా యూట్యూబ్‌లో ఓ ప్రోమో కనిపించింది… సుడిగాలి సుధీర్ ఈటీవీలో హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ రియాలిటీ షో… పెద్దగా రేటింగ్స్ ఏమీ రావడం లేదు… కానీ సుధీరే ఆ షోకు ప్రధాన ఆకర్షణ…
ఈ ప్రోమోలో పొట్టి రియాజ్ బెలూన్లు తీసుకుని, మెడలో ఎర్ర తువ్వాల వేసుకుని వస్తాడు… ఇంకెవరో కమెడియన్ వచ్చి ఆ మెడలో తువ్వాల తీసుకుని, తన మెడలో వేసుకుని నువ్వు మోయలేవురా అంటాడు… అంతేకాదు, సుధీర్ దగ్గరకు వచ్చి ‘నా క్లాస్‌మేటే, ఏడో తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 175కి 175 మార్కులు తెచ్చుకుంటాను అన్నాడు… రియాజ్ సిగ్గుతో నవ్వుతూ వెనక్కి తిరుగుతాడు… ఇదీ సీన్…
175 కు 175 అనగానే మీకేం అర్థమైంది…? ఎస్, జగన్ గత ఎన్నికల ముందు నినాదం అది… వైనాట్ 175… ఎర్ర తువ్వాల పవన్ కల్యాణ్ మార్క్… సో, ఇక్కడ జగన్ మీద ఓ సెటైర్ వేయడానికి విఫలయత్నం చేశారు… వెటకారం… స్పూఫ్, పేరడీ, సెటైర్ వేరు… ఇది వెక్కిరింత కిందకు వస్తుంది… ఇది చూడగానే… ఇదే రియాజ్ నాలుగేళ్ల క్రితం చేసిన ఓ కామెడీ స్కిట్ గుర్తొచ్చింది… అందులో జగన్‌ను ఇలాగే వెకిలి చేస్తే వైసీపీ, జగన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు, బెదిరించారు…
Ads
దాంతో రియాజ్ ప్రత్యేకంగా ఓ వీడియో చేసి, జగన్ అభిమానులందరూ నన్ను క్షమించాలని వేడుకున్నాడు… కానీ అప్పటికీ ఇప్పటికీ సిట్యుయేషన్ ఛేంజ్… జగన్ సోషల్ ఫ్యాన్స్ బాగా డిమోరల్ అయి ఉన్నారు… సో, రియాజ్ ఇలా పాతవి మరిచిపోయి జగన్‌పై పేరడీకి సరేనన్నాడు… నిజానికి సుధీర్ ఈమధ్య అచ్చు హైపర్ ఆదిలా మారిపోయి పవన్ భజన ఎత్తుకుంటున్నాడు… సరే, వాళ్ల ఇష్టం…
ఆహాలో తను హోస్ట్ చేసిన సర్కార్‌లో ఏకంగా ఓ ప్రశ్నే పవన్ కల్యాణ్ 100 శాతం సక్సెస్ రిజల్ట్ మీద వేశాడు… ఈటీవీకి సంబంధించిన షోలలోనూ పవన్ కల్యాణ్ మోత ఎక్కువైంది… అది తప్పులేదని అనుకుందాం… ఎలాగూ ఈటీవీ అంటేనే కూటమి ప్రభుత్వానికి మహా మద్దతుదారు కదా… పైగా ఆది మార్క్ కమెడియన్లంతా పవన్ కల్యాణ్ నిలబడిన స్థానంలో ప్రచారం కూడా చేసి వచ్చారు… కానీ..?
వీలైనంతవరకూ ఇలాంటి షోలను ఇలాంటి కోతలు, మోతలకు దూరంగా ఉంచితేనే బెటర్… సుధీర్‌ను ఓ పర్‌ఫార్మర్‌గా అందరూ రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా అభిమానిస్తారు… మరి అలాంటప్పుడు ఇలా బయాస్డ్‌గా మారిపోవడం దేనికి…? గతంలోలాగా జగన్ ఫ్యాన్స్ అదే దూకుడుతో ఉండి ఉంటే… సెగ తగిలేదేమో… రియాజ్ కూడా దానికి ఒప్పుకునేవాడు కాదేమో… ఇప్పుడు పర్లేదులే ఏమీ కాదు అనుకున్నట్టున్నాడు…
Share this Article