సుమ క్షమాపణ చెప్పింది… ఎవరికి..? మీడియాకు…! ఎందుకు..? అంత తప్పేం చేసింది..? ఏమీలేదు… మీడియా ఓవరాక్షన్… మరీ ఈమధ్య సినిమా జర్నలిస్టుల తిక్క ప్రశ్నలు గట్రా చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ల కవర్ల గోల వాళ్లు చూసుకోక ఇదుగో ఇలాంటి అనవసర కంట్రవర్సీల్లోకి సెలబ్రిటీలను నెట్టేసే ప్రయత్నాలు…
పెద్ద హీరోల జోలికి వెళ్లరు… వాళ్లకు భజనలు… ఇదుగో సుమ వంటి ఆర్టిస్టులపై పెత్తనాలు… ఎస్, సుమ నిజంగానే మంచి యాంకర్… ఏళ్లుగా ఫీల్డులో ఉంది… ఎవరినీ మాట అననివ్వదు, తను అనదు… ఇన్ని వేల ప్రోగ్రాములు చేసింది కదా, ఎక్కడా ఒక్క అసభ్యపు మాట తూలదు… పైగా స్పాంటేనియస్‌గా జోక్స్ వేయగలదు… ఎవరినీ తక్కువ చేయదు… అది ఆమె వ్యక్తిత్వం… అందుకే ఇన్నేళ్లు ఫీల్డులో వివాదరహితంగా నిలబడింది…
మొన్న ఓ వీడియో చూశాం కదా… తెల్లారిలేస్తే వివాదాల్లోనే ఉండే అనసూయ ఏదో ప్రెస్‌మీట్‌లో ము- కిందికి అనబోయి, తమాయించుకుని ఏదో కవర్ చేసింది… అలాంటి తొట్రుపాట్లు, అగచాట్లు కూడా సుమలో కనిపించవు… అఫ్‌కోర్స్, అనసూయతో సుమను పోల్చడం సరికాదు… జస్ట్, ఒక ఉదాహరణ, ఒక చిన్న పోలిక… అంతే…
Ads
అసలు విషయమేంటయ్యా అంటే… ఏదో ఫంక్షన్ లేదా ఏదో ప్రెస్ మీట్… ఆమే హోస్ట్… మీడియాను లోపలకు ఆహ్వానించే క్రమంలో ‘స్నాక్స్‌ను భోజనంలా చేస్తున్నవాళ్లు త్వరగా లోపలకు రావాలి’ అన్నది… ఇంకేం..? ఇంత ఘోరమైన తప్పా..? అనుకుని ఓ మీడియా పర్సన్‌కు తెగ కోపం వచ్చేసిందట… వాటీజ్ దిస్, నీ యాంకరింగ్ అంటే మాకూ ఇష్టమే, కానీ ఇలా మీడియాను అవమానిస్తావా, జాగ్రత్త అని సుమను హెచ్చరించాడట…
కాజువల్‌గా, సరదాగా అనడం తప్ప ఆమె మాటల్లో మీడియాను కించపరచడం ఏముంది..? భుజాలు తడుముకోవడం దేనికి..? వివాదాలకు దూరంగా ఉండే తత్వం, పైగా కొడుకు ఫీల్డులోకి వస్తున్నాడు, మీడియాతో గోక్కోవడం ఎందుకని అనుకుంది, అందుకే సారీ చెప్పింది… అది అక్కడితో సమసిపోయింది… అసలు సుమను ఈ సంఘటనలో తప్పుపట్టడమే తప్పు, కానీ సోషల్ మీడియా ఊరుకోలేదు…
ఏవేవో రాసేసింది… కామెంట్లలో చాలామంది సుమకే మద్దతు పలికారు… ఐనా మనస్సు నొచ్చుకున్నట్టుంది, ఆమె మరో వీడియో విడుదల చేస్తూ మళ్లీ సారీ చెప్పింది… సరే, ఆమె హుందాగానే స్పందించింది… ఏదీ, ఇలా ఎవరైనా స్టార్ హీరో సరదాగా ఏమైనా కామెంట్ చేస్తే ఇలాగే స్పందిస్తారా ఫిలిమ్ జర్నలిస్టులు..? కనీసం పెద్ద దర్శకులను కూడా ఏమీ అనలేరు… సుమ వంటి నాన్ కంట్రవర్సీ కేరక్టర్లే దొరుకుతారా..? వాటీజ్ దిస్..?!
Share this Article