.
నేను ఫస్ట్ నుంచీ ఓ వాదనకు కట్టుబడి ఉన్నాను… ఈ సోకాల్డ్ ఎన్నికల వ్యూహకర్తలు, వాళ్ల విజయాలు ఉత్త బోగస్…
ఈరోజుకు కూడా నాది అదే స్టాండ్… జస్ట్, స్థూలంగా చెప్పుకుంటూ పోదాం… లోతుల్లోకి అక్కర్లేదు… ఎందుకంటే, ఎన్నికల వ్యూహాలు అనేదే పెద్ద స్కామ్, ఫేక్, అబ్సర్డ్…
Ads
ఏపీలో మొన్న పీకే లేడు… అసలు పీకే తన ఐప్యాక్‌తోనే డీలింక్ అయిపోయాడు.,.. కానీ పెంచి పోషించిన తన ఒడిశా రిషి టీం అదే తరహాలో పనిచేసింది… కానీ ఏమైంది… 11 స్థానాలతో అవమానకరమైన ఓటమి… అది నైతిక బాధ్యత వహించిందో లేదో నాకు తెలియదు…
అలాగని చంద్రబాబు పెట్టుకున్న రాబిన్ టీమ్ సక్సెసైంది అనీ చెప్పలేం… ప్రబలంగా వీచిన జగన్ వ్యతిరేక గాలులు అవి… రాబిన్ క్రెడిట్ కానే కాదు… అసలు ఎన్డీయే కూటమే ఆశ్చర్యపోయింది ఆ రిజల్ట్స్ చూసి… చంద్రబాబు కూడా, వామ్మో నన్ను ఈ జనం అంత నమ్ముతున్నారా అని మ్రాన్పడిపోయినట్టున్నాడు… పవన్ కల్యాణ్ సరేసరి… వ్యతిరేక వోటు చెప్పే ఫలితాలు అవి…
ఐనా సరే, జగన్ తన తప్పుల్ని, తన కోవర్టుల్ని, తన వ్యూహరాహిత్యాల్ని, తన పాలన వైఫల్యాన్ని సమీక్షించుకోకుండా ఈవీఎంల మీద ఏడుస్తున్నాడు… సరే, ఆ టీమ్ కేరక్టర్ అదే…
ప్రశాంత్ కిషోర్… ఒకప్పుడు ఆహా ఓహో… స్టాలిన్, ఠాక్రే, జగన్, మమత… పేరొందిన అందరు నాయకులకూ తను వ్యూహకర్త… అలాంటిది తనే ఓ పార్టీ పెట్టాడు… పేరు జనసూరజ్… బీహార్ సొంత రాష్ట్రం కదా… నిన్నటి బైపోల్స్‌లో నిలబడ్డాడు… నాలుగు స్థానాల్లో పోటీచేస్తే మూడింట్లో మూడో స్థానం, మరొక దాంట్లో నాలుగో స్థానం… శకునం చెప్పే కుడితి తొట్లో పడ్డట్టు…
తన వ్యూహాలు ఓ నాన్సెన్స్… ఎన్నికల్ని ప్రభావితం చేసేవి బోలెడు అంశాలుంటాయి… కేసీయార్ మొన్నటి ఎన్నికల్లో బోలెడు సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్ క్రియేటర్లు, సొంత సోషల్ మీడియా వింగ్స్ మీద కోట్లకుకోట్లు తగలేశాడు… ఏం జరిగింది..? తన మీద వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకతను 0.5 శాతం కూడా తగ్గించలేకపోయాయి…
కాంగ్రెస్ విషయానికొద్దాం… సునీల్ కనుగోలు… తనకు ఎవరు ఫండ్ చేస్తున్నారో తెలియదు… తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులతో ఎవరితోనూ తనకు లింక్ లేదు, ఎవరినీ ఖాతరు చేయడు… కర్నాటకలో గెలిచారంటే అది సునీల్ గొప్పతనం కాదు… బీజేపీ మీద వ్యతిరేకత… తెలంగాణలో కూడా గెలిచాక ఇక తను ఆకాశంలో నిలబడ్డాడు…
నథింగ్… తను ప్రిపేర్ చేసిన సిక్స్ గ్యారంటీలు అనే స్కీమే పెద్ద బోగస్… తెలంగాణలో కూడా గెలిచేసరికి అందరూ ఆహా ఓహో అన్నారు… ఏమైంది..? ఇదే స్కీమ్ ప్రచారం చేస్తే హర్యానాలో బొక్కబోర్లా పడింది కాంగ్రెస్… జార్ఖండ్‌లో వేలు పెట్టనివ్వలేదు ఎందుకో గానీ… మహారాష్ట్రలో నేలకరిచింది కాంగ్రెస్…
అబ్బే, జార్ఖండ్‌లో భట్టి గెలిచాడు, మహారాష్ట్రలో రేవంత్ ఓడిపోయాడు అనే సూత్రీకరణ మరో నాన్సెన్స్… వీళ్లు వెళ్లి ప్రచారం చేస్తే ఫలితాల్లో 0.00001 శాతం ప్రభావం ఉండదు… అనేక కారణాలు గెలుపోటముల్ని ప్రభావితం చేస్తాయి… డియర్, సునీల్ కనుగోలు టీమ్… అర్థమైందా..? ఇంకా వివరంగా చెప్పాలా..?! అన్నట్టు… చంద్రబాబు వ్యూహకర్త రాబిన్ శర్మ షిండే పార్టీకి పనిచేశాడు… ఇటు ఏపీ, అటు మహారాష్ట్ర, రెండు రాష్ట్రాలు తన ఖాతాలో…!! ( మిత్రుడు కోవెల సంతోష్‌కుమార్ ఇచ్చిన ఇన్‌పుట్స్ కు ధన్యవాదాలు )
Share this Article