సునీతా విలియమ్స్… సాహసులకు, ప్రత్యేకించి మహిళలకు ఓ స్పూర్తి… నారీ శక్తి… మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తోంది… అది అందరూ చదివారు వార్తల్లో… ఆమె అంతరిక్షంలోకి గీతను తీసుకుపోయింది, సమోసాను పట్టుకెళ్లింది వంటివే ప్రధానంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… కొన్ని చాలామందికి తెలియని ఇంట్రస్టింగ్ అంశాలు ఏమిటంటే..? (మూడోసారి ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే యాత్ర సాంకేతిక కారణాలతో వాయిదాపడిందని తాజా వార్త…)
ఆమె ఇండియాలో పుట్టలేదు… గుజరాత్‌కు చెందిన ఓ న్యూరోఅంటామిస్ట్ దీపక్ పాండ్యా అమెరికాకు పోయాడు అప్పుడెప్పుడో… ఆయన అక్కడ స్లొవేనియా మూలాలున్న ఉర్సులిన్ బోనీని పెళ్లి చేసుకున్నాడు… అదుగో వాళ్లకు 59 ఏళ్ల క్రితం పుట్టింది సునీత… అంటు సునీతకు ఇండియాతోపాటు స్లొవేనియా రూట్స్ కూడా ఉన్నాయి… దీపక్ హిందూ మతాచరణ కలిగినవాడు… సునీత అని పేరు పెట్టుకున్నాడు, తల్లి లైన్ అని (Lyn) జతపరిచింది…
ఆమె ఫెడరల్ పోలీస్ అధికారి విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది… అమెరికా, స్లొవేనియా సంస్కృతుల నడుమ కూడా సునీత తండ్రి తాలూకు హిందూ మతాన్ని ఆచరిస్తుంది… నిజం, మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు భగవద్గతను, రెండోసారి వెళ్లినప్పుడు ఉపనిషత్తుల ప్రతులను పట్టుకెళ్లింది… అవి తనకు నైతిక భరోసా అంటుంది ఆమె… మరి ఇప్పుడు..? ఆమే చెప్పాలి… (2006లో తొలిసారి, 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రలు…)
Ads
నిజానికి ఈ వయస్సులో మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లడానికి సంసిద్ధురాలు కావడమే ఓ గ్రేట్… 7 సార్లు స్పేస్ వాక్, 50 గంటలపాటు… భూమికి వందల కిలోమీటర్ల దూరంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి నెలలకొద్దీ (322 రోజులు) గడిపింది… ఈసారి విశేషం ఏమిటంటే, బోయింగ్ వాళ్ల ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్‌లో నాసా నుంచే వెళ్తోంది… పేరు స్టార్ లైనర్… ఆల్రెడీ ఎలన్ మస్క్ కంపెనీ కూడా ఉంది తెలుసు కదా, స్పేస్ ఎక్స్… రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్పేస్ ఫ్లయిట్స్, డబ్బున్నమారాజులు అలా అలా అంతరిక్షంలో టూరిస్టులుగా వెళ్లొస్తారు, ఆల్రెడీ ఒకరిద్దరు వెళ్లొచ్చారు కూడా… ఇంతకుముందులా ఎక్కడో సముద్రంలో గాకుండా ఈసారి తిరిగి వచ్చాక భూమిపైనే దిగే చాన్సుంది…
తన ఇండియా, స్లొవేనియా మూలాలకు ప్రతీకలుగా ఆమె ఇండియన్ సమోసాను, స్లొవేనియా ఫ్లాగ్‌ను, కార్నియోలాన్ సాసేజ్ కూడా తీసుకుపోయింది అంతరిక్షంలోకి… మరోసారి గణనాథుడి ప్రతిమను తీసుకుపోయింది… తనకు స్పూర్తి దివంగత కల్పనా చావ్లా… ఆమె తరచూ ఇండియాకు వెళ్లిరావాలని చెప్పేది, అందుకే ఆమె మెమొరీగా సునీత కూడా ఇండియాకు వచ్చింది… వేలాదిమందిని ఉద్దేశించి ప్రసంగాలు చేసింది…
నిజానికి ఆమె డైవర్ అమెరికన్ నేవీలో… తరువాత పైలట్… ఆ తరువాత స్పేస్ జర్నీకి ఎంపిక… అంటే, సాగర జలాల్లో ఈదాల్సిన ఆమె దారి మళ్లి ఏకంగా అంతరిక్షంలో ఈదుతోంది… అనగా స్పేస్ వాక్.., అదంత ఈజీ టాస్క్ కాదు… స్పేస్‌కు ఆమె ఎంపికకు ప్రధాన కారణం ఆమె అనుభవం… దాదాపు 30 రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ నడిపింది… మామూలు సమయాల్లో ఏం చేస్తుందీ అంటారా..? ఈదడమే ప్రధాన వ్యాపకం… బైక్ రైడింగ్, విండ్ సర్ఫ్, బో హంటింగ్… నిజానికి మన స్కూల్ సిలబస్‌లో చేర్చాల్సిన పాఠం ఆమె… లక్షల మందికి స్పూర్తిదాత..!!
Share this Article