Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమంత అందాలు కలవనీ… తళుకు, కులుకు.., ఏవమ్మా నీకు…

June 6, 2022 by M S R

ఏమంత అందాలు కలవనీ
వస్తాడు నిన్ను వలచీ..
ఏమంత సిరి ఉంది నీకనీ
మురిసేను నిన్ను తలచీ..
చదువా.. పదవా.. ఏముంది నీకు
తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా….

………… అని అప్పుడెప్పుడో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో హీరోయిన్‌కు గడ్డిపెడుతుంటుంది తన అంతరాత్మ… నిన్న కర్నూలులో సాయిపల్లవి పట్ల అభిమానులు ప్రదర్శించిన అభిమానం గమనిస్తే టక్కున గుర్తొచ్చేది ఈ పాటే… ఒకవైపు మెరుపులు, ఉరుములు, వర్షం… ట్రెయిలర్ ప్రదర్శించే పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ కూలిపోయింది… జనం, సినిమా టీం ఎక్కడివాళ్లక్కడే బాగో బాగో…

ఆ తరువాత కాసేపటికి వరుణుడు నిమ్మళించాక రానా, సాయిపల్లవి, దర్శకుడు వేణు తదితరులు వచ్చారు… ఆ వాతావరణంలోనే ప్రోగ్రాం నడిపించారు… సాయిపల్లవి మాట్లాడటానికి ఉపక్రమించాక జనంలో ఒకటే కేకలు… అసలు మాట్లాడనిస్తే కదా… ఒక్క ముక్కలో చెప్పాలంటే అభిమానులు ప్రేమవర్షంలో సాయిపల్లవి నిలువునా తడిసిపోయింది… అది ఏ స్థాయి దాకా అంటే…

Ads

వేదిక మీద ఉన్న సినిమా టీం జనం స్పందనను అలా చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయారు… చినుకులు పడుతూ ఉంటే స్వయంగా రానా ఆమెకు గొడుగు పట్టాడు… హీరోల ఇగోలతో, హీరోయిన్ల పట్ల చిల్లర వివక్ష చేష్టలతో కంపు వాసన కొట్టే సినిమా ఇండస్ట్రీలో ఇదొక అపురూపమైన దృశ్యమే… ఈ ఫోటో చాన్నాళ్లపాటు సినిమా ప్రేమికులకు గుర్తుంటుంది… ఖాయం… (అందుకే ఈ విషయంలో రానాను అభినందించాలి అని నిన్న ముచ్చట ఓ కథనం రాసుకొచ్చింది…)

sai

ఇప్పుడే కాదు, ఆమధ్య రెండుమూడు సినిమా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా సాయిపల్లవికి ఇదే అభిమానుల హోరు… నెవ్వర్, ఈ రేంజ్ అభిమానాన్ని తెలుగులో ఏ సినిమా నటి పొంది ఉండదు… (బహుశా సావిత్రి పట్ల జనంలో ఇంతే అభిమానం ఉండేదేమో, కానీ పెద్దగా భారీ గ్యాదరింగులు, సినిమా ఫంక్షన్లు ఉండేవి కావుగా అప్పట్లో…) స్టార్ హీరోలతో సమానమైన స్టార్‌డం, పాపులారిటీని ఎంజాయ్ చేస్తోంది ఆమె ఇప్పుడు…

ఆమధ్య ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రిరిలీజ్ ఫంక్షన్ సమయంలో… సాయిపల్లవి పట్ల జనం ఇమేజీ చూసి కీర్తిసురేష్, రష్మిక విస్తుపోయారు… ఒక్క నిమిషం మాట్లాడతాను ప్లీజ్ అని సాయిపల్లవి బతిమిలాడుకోవాల్సి వచ్చింది జనాన్ని… సుకుమార్ అయితే ఏకంగా ఆమెను ‘లేడీ పవన్ కల్యాణ్’ అని మెచ్చేసుకున్నాడు… అంటే చరిష్మా విషయంలో… శ్యామ్ సింగరాయ్ ఫంక్షన్‌లో కూడా అంతే… నాని కూడా ఇప్పుడు రానాలాగే ఆమె పాపులారిటీని పాజిటివ్ ధోరణిలో గుర్తించాడు… ఆమోదించాడు…

https://www.youtube.com/watch?v=xuprQ2qMIqQ

మళ్లీ మొదటికొద్దాం… నిజంగానే పెద్ద అందగత్తె కాదు, మొహంలో ఇంకా మొటిమల ఛాయలు… ఎండుకుపోయినట్టున్న ఫిజిక్… ఐనా సరే, గ్లామర్ మాత్రమే ప్రధానమైన ఈ సినిమా ఫీల్డ్‌లో తెలుగుజనం ఎందుకింతగా ఆమె పట్ల వెర్రి అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు..? సింపుల్… ఆమె నడత… ఆమె డాన్స్… ఆమె ఎంచుకునే పాత్రలు… వేరే హీరోయిన్లతో పోలిస్తే చిల్లర వేషాలు లేవు… డబ్బు కక్కుర్తి లేదు… తప్పుడు బ్రాండ్ల ప్రమోషన్లు చేయదు… ఎక్స్‌పోజింగ్‌కు దూరం… నమ్రతతో కూడిన మాటలు… నిజానికి ఇవేనా..? ఇవి కూడా కారణాలు కావచ్చుగాక… కానీ మరేదో బలమైన ఆకర్షణ ఆమెను వర్తమానంలో లేడీ సూపర్ స్టార్‌ను చేసింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions