పెద్ద హీరో… ‘‘రూపాయికే విమానయానం’’ అనే భిన్నమైన కథాంశం, ఓ బయోపిక్… ఓటీటీలో విడుదల చేసినప్పుడు మంచి హిట్ టాక్ వచ్చింది… హీరో సూర్యకే గాకుండా డైరెక్టర్‌కు కూడా మంచి ప్రశంసలు లభించాయి… రివ్యూలు కూడా అధికశాతం పాజిటివ్‌గా వచ్చాయి… ఓ కొత్త మొహం హీరోయిన్… గుడ్… అన్నీ సానుకూలతలే… మరి అది టీవీలో ప్రసారం చేసినప్పుడు మంచి రేటింగ్స్ రావాలి కదా… వస్తాయని అనుకుంటాం కదా… ఫాఫం, బోలెడు రేటు పెట్టి టీవీ రైట్స్ కొనుగోలు చేసిన చానెల్ కూడా అలాగే ఆశపడుతుంది కదా… కానీ అదేదీ జరగలేదు… రివర్స్ రిజల్ట్… అవును, ఇదంతా ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా గురించే… సన్ నెట్వర్క్ తెలుగు, తమిళ, మళయాళ టీవీ రైట్స్ అన్నీ గంపగుత్తాగా కొని ఉంటుంది… జెమిని టీవీకి ఇప్పుడు సినిమాలు తప్ప వేరే ఇంట్రస్టే లేదు కదా, సీరియళ్లు, రియాలిటీ షోలు గట్రా మానేసింది కదా… ఈ సినిమా రేటింగ్స్ మీద కూడా ఎక్కువ ఆశలే పెట్టుకున్నట్టుంది… కానీ…?
మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రసారం చేసింది… అదీ ప్రైమ్ టైమ్‌లోనే… కానీ వచ్చిన రేటింగ్స్ కేవలం 6.13 మాత్రమే… హైదరాబాద్ మార్కెటింగ్ బిజినెస్, టీవీ, సినిమా సర్కిళ్లు విస్తుపోయాయి… మరీ హీరో సినిమాకు, అదీ హిట్ టాక్ వచ్చిన సినిమాకు ఏమిటీ దురవస్థ అని..! వాస్తవానికి ఓటీటీ వ్యూయర్ షిప్ తక్కువ కాబట్టి, థియేటర్లలో రాలేదు కాబట్టి, హీరో సూర్యకు తెలుగులోనూ స్టార్డం ఎక్కువే కాబట్టి, టీవీ రేటింగ్స్ ఎక్కువే రావాలి… కానీ టీవీ ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు ఎందుకో… మరీ విశేషం ఏమిటంటే..? పదో తారీఖున నితిన్ నటించిన భీష్మ పునఃప్రసారం చేస్తే… దానికి ఈ సూర్య సినిమాకన్నా ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి… 7.15… అదీ తక్కువే కానీ అది రిపీట్ ప్రసారం…
Ads
వాస్తవంగా సినిమా మార్కెటింగ్ ఇప్పుడు వొలటైల్‌గా మారుతోంది… ఇదుగో, ఇలా మంచి రేట్లు పెట్టి కొన్న పెద్ద హిట్ సినిమాలూ రేటింగుల్లో ఢమాల్ అంటే… రేప్పొద్దున టీవీ రైట్స్ కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు చానెళ్లు ఆలోచించాల్సిన స్థితిలో పడిపోతున్నయ్… ఇంకోవైపు ఓటీటీ రైట్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి… ఆహా వంటి ఓటీటీలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది… అమెజాన్, జీ వంటి ఓటీటీలే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నయ్ రేట్ల విషయంలో… ఓటీటీ, టీవీ ప్లాట్‌ఫారాలపై ఏ సినిమా హిట్టవుతుందో, ఏది ఫ్లాపవుతుందో ఎవరూ అంచనా వేయలేని సిట్యుయేషన్… ఇదుగో, ఈ సినిమాయే పెద్ద ఉదాహరణ… అన్నట్టు ఈ లింకు ఓసారి చదవండి… ఈ సినిమా గురించే ‘ముచ్చట’ రాసిన ఓ స్టోరీ…
Share this Article