Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సూర్యకాంతం మరీ అలాంటి పాత్ర చేయడం కలుక్కుమనిపించింది…

February 2, 2024 by M S R

Subramanyam Dogiparthi…….   ఆకలి మంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు పాట అందరికీ గుర్తుండే ఉంటుంది . ఫంక్షన్లప్పుడు భోజనాలు ఆలస్యమయితే ఈ చరణం ఎత్తుకునే వాళ్ళం సరదాగా . ఆ పాట ఈ సినిమా లోనిదే . ఓ మామూలు పెసరట్లు అమ్ముకునే నాగభూషణం లాటరీ టికెట్టుకు లక్షల రూపాయల నడమంత్రపు సిరి రాగానే ఎలా దిగజారి అధఃపాతాళానికి పడిపోతాడో చూపిస్తుందీ సినిమా .

నడమంత్రపు సిరి మాత్రమే కాదు ; నడమంత్రపు అధికారం వచ్చినా , యోగం పట్టినా మనిషికి కళ్ళు నెత్తికెక్కితే , గోతిలో పడిపోతాడు . అందరూ గోతిలో పడరు . సిరి , అధికారం నడమంత్రంగా వచ్చినా , పాత మిత్రుల్ని , బంధువులనూ మరచిపోయినట్లు చచ్చేదాకా నటిస్తూనే ఉంటారు . వారికి ఙానోదయం కలగదు . వాళ్ళకు అలా సాగిపోతుంటుంది . లక్ష్మీ నివాసం సినిమా లాగా చక్కటి సందేశాత్మక సినిమా .
మా నరసరావుపేటలోనే చూసా . థియేటర్ గుర్తు లేదు . ఏవరేజ్ గా ఆడిందని గుర్తు . నడమంత్రపు సిరి పట్టే పెసరట్ల భూషయ్యగా నాగభూషణం , అతని సంతానంగా సత్యనారాయణ , విజయనిర్మల , హీరోగా హరనాథ్ బాగా నటించారు . సూరేకాంతం ఈ సినిమాలో వాంప్ కం విలన్ గా నటించింది . ఆమె ఈ పాత్రను ఎందుకు అంగీకరించిందో ఆశ్చర్యమే . ఆమె శరీర ఆకారానికి వాంప్ పాత్ర ఏంటో బాధాకరంగా ఉంటుంది . ఇతర పాత్రల్లో రాజనాల , రాజబాబు , విజయలలిత , మాలతి ప్రభృతులు నటించారు .
తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బలం టి చలపతిరావు సంగీతం . హీరాలాల్ , చిన్న సంపత్ ల నృత్య దర్శకత్వం . నీదేరా నా మనసు, ఇక నీకేరా నా వయసు అనే నృత్య గానం చాలా బాగుంటుంది . ఉదయచంద్రిక అనే కన్నడ నటి , మన విజయలలిత పోటీగా ఒకరు శాస్త్రీయ నృత్యం మరొకరు ఆధునిక నృత్యం ప్రదర్శిస్తారు . పాట , నృత్యం , వీరిద్దరి పెర్ఫార్మన్స్ అన్నీ బాగుంటాయి . ఎన్నాళ్ళకెన్నాళ్ళకు సమయం చిక్కింది , నీ చల్లని మనసు కమ్మని వలపు ఎంతో హాయి , అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా , అబ్బబ్బో ఏమందం , అమ్మల్లారా లాటరీ అయ్యల్లారా లాటరీ పాటలు కూడా బాగుంటాయి .
సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . టైం ఉండాలిగా ! చూడబులే . నీదేరా నా మనసు నృత్య గానం మాత్రం తప్పక చూడండి . యూట్యూబులో పాట వీడియో కూడా ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions