‘పీఠం’ మీద ఎవరుంటే వారికి మద్దతుగా రంగులు మార్చుకునేవారే అసలైన ‘పీఠాధిపతులు’… ఓ మిత్రుడి వ్యాఖ్య ఇది… విశాఖలో శారదాపీఠం పేరిట స్వరూపానంద స్వామి ఆశ్రమం, సారీ, పీఠం ఉంది కదా… సదరు స్వరూపాందుడు హఠాత్తుగా తన రాజకీయ విధేయతను మార్చేయడంపై కామెంట్ ఇది…
ఇదేకాదు, నిన్నటి నుంచీ సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లు స్వామి వారి ద్వంద్వ నీతిని, రంగులు మార్చిన వైనాన్ని ఏకిపడేస్తున్నయ్… కొత్తవలసలో జగన్ పుణ్యమాని ఈ స్వామి 15 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని 15 లక్షలకు పొంది, తరువాత ‘స్పిరిట్యుయల్ పర్సస్’ కోసమే అనే క్లాజును కూడా ‘ఎనీ పర్పస్’ అని మార్పించుకున్నాడనీ, అవి కాపాడుకోవడం కోసమే స్వామి వారు వర్ణాంతరానికి పాల్పడ్డారని, అనగా రంగు మార్చేశాడని సోషల్ మీడియా విమర్శ…
దీనిపై ఇంకా స్వామి వారు స్పందించినట్టు లేదు… కానీ విమర్శలు హేతుబద్ధం… ఇదే స్వామి యావత్ భక్తసమాజం నివ్వెరపోయేట్టుగా జగన్‌ను ముద్దాడింది నిజం… తన తపశ్శక్తిని (?) ధారబోసానని అన్నదీ నిజం… రిషికేష్‌లో ప్రత్యేక యాగాలు, పూజలు చేసిందీ నిజం… రాజశ్యామల యాగాలూ నిజం… ఇదే స్వామి తెలంగాణలో అధికార పీఠం మీద కేసీయార్ ఉన్నప్పుడు ఆయన భజన చేసిందీ నిజం… కేసీయార్ ఇలాంటోళ్ల మాయలో ఈజీగా పడుతుంటాడు కదా…
Ads
చాన్నాళ్లు జగన్‌కు ఢోకా లేదనీ, చంద్రబాబు గత పాలనపై విసుర్లూ నిజం… ఇప్పుడు చంద్రబాబు మంచి పాలకుడిగా కనిపిస్తున్నాడు… అవసరం మరి… గతంలో చంద్రబాబు కోసం కూడా తను కష్టపడ్డాడుట… అప్పటికి ధారబోయడానికి తపశ్శక్తి సమకూరి ఉండదు, లేకపోతే అదీ ధారబోసేవాడు… సరే, ఇదంతా లోకసహజం అనుకుందాం… కానీ..?
జగన్ మీద తన ప్రభావం అధికం… తను క్రిస్టియన్, కానీ అదే బలమైన ముద్ర తనకు రాజకీయంగా మంచిది కాదనే భావనతో తను పుష్కరస్నానాలు చేసేవాడు, తిరుమల వెళ్లేవాడు, పంచాంగ శ్రవణాలు ఏర్పాటు చేసేవాడు… ఇదుగో ఇలాంటి స్వాములు ఏది చెబితే అది వినేవాడు… ప్రత్యేకించి దేవాదాయ శాఖ ఈ స్వామి వారి గుప్పిట్లో చిక్కి విలవిల్లాడింది…
ఇప్పుడేమైంది..? రాజశ్యామలం ఫలించలేదు, తపశ్శక్తి మహత్తు కోల్పోయింది… అత్యంత పరాభవమైన పరాజయం మిగిలింది జగన్‌కు… ఒక స్వామి నిజరూప దర్శనం జరిగిపోయింది జనానికి..! బట్, ఒక్కటి మాత్రం నిజం… ఇలాంటి స్వాముల విషయంలో చంద్రబాబు అంటీముట్టనట్టుగానే ఉంటాడు…
ఆదరించడు, తిరస్కరించడు… వెళ్తాడు, దండం పెడ్తాడు, అంతే, అక్కడితో సరి… పైగా తనకు హిందూ ముద్రలు అవసరం లేదు కదా… పైగా ఈ పూజలు, పునస్కారాల మీద కూడా పెద్దగా అనుకూలత ఉండదు, అలాగని వ్యతిరేకించడు… పాలన వ్యవహారాల్లోకి అస్సలు రానివ్వడు… జియ్యరులైనా, స్వరూపులైనా… నువ్వు అలాగే ఉండు బాబూ..!!
Share this Article