Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ మోహన్‌బాబో వేయాల్సిన వేషం… దాసరి తనే వేసేసి మెప్పించాడు…

March 15, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం … జేసుదాస్ పాడిన ఈ పాట ఈ స్వయంవరం సినిమాకే ఐకానిక్ సాంగుగా నిలిచిపోయింది .

అద్భుతమైన ఈ పాటను వ్రాసింది దాసరే . ఆగస్టు 6 , 1982న విడుదలయిన ఈ సినిమా ఫక్తు దాసరి మార్క్ సినిమా . హీరో దాసరా లేక శోభన్ బాబా అంటే కూడా చెప్పడం కాస్త కష్టమే . ఏ మోహన్ బాబో వేయాల్సిన పాత్రను తానే వేసి రక్తి కట్టించారు దాసరి .

Ads

మనసా మాంగల్యమా , పెళ్ళా ప్రేమా కధాంశంతో వచ్చిన మరో హిట్ సినిమా . చిన్నప్పుడే ఏమీ తెలియని వయసులో బొమ్మల పెళ్ళి లాగా పిల్లలు పెళ్లి చేసుకోవటం అక్కినేని- సావిత్రి మాంగల్యబలం సినిమా నుండి చూస్తూనే ఉన్నాం . అయితే ఈ సినిమాలో దాసరి మార్క్ మలుపులు చాలా ఉన్నాయి .

హీరోహీరోయిన్ల తండ్రులు వ్యాపారంలో భాగస్వాములు . కోట్లు గడిస్తారు . ఇద్దరి మధ్యలో వాళ్ళ మేనేజర్ విబేధాలు సృష్టిస్తాడు .

మిత్రులు విడిపోవటం , హీరో తండ్రి ఆస్తి కోల్పోయి చనిపోవటం , హీరో హీరోయిన్ తండ్రితో గొడవ పడటం , హీరోయిన్ తండ్రి ఓ డబ్బున్న వాడితో కూతురి పెళ్ళి చేయటం , హీరో రోడ్డున పడటం , అసలు కధ తెలుసుకున్న హీరోయిన్ భర్త తాను ఆత్మాహుతి చేసుకుని హీరోహీరోయిన్లను పెళ్ళి చేసుకొమ్మని దారి విడవటం టూకీగా సినిమా కధ .

దాసరి కధను , స్క్రీన్ ప్లేని బిర్రుగానే నడిపించారు . ఈ సినిమా విజయానికి , వంద రోజులు ఆడటానికి మరో ప్రధాన కారణం సత్యం సంగీతం . శ్రావ్యమైన పాటలకు లిరిక్సును రాజశ్రీ , దాసరి బాగా వ్రాసారు .

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది , నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా , ఇక్కడ ఎక్కడ అంటూనే , ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో దాగి దాగి ఉన్న జాబిల్లీ ఒకసారి నువ్వు రావాలి , హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం పాటలు శ్రావ్యంగా ఉండటమే కాకుండా హిట్టయ్యాయి కూడా .

దాసరి , శోభన్ బాబు , జయప్రదల తర్వాత ప్రధాన పాత్ర రమాప్రభదే . బాగా నటించింది . ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , రావుగోపాలరావు , పుష్పలత , అంజలీదేవి , రూపా చక్రవర్తి ప్రభృతులు నటించారు .

ఈ సినిమాలో మరో ముఖ్యమైన లిటిగేషన్ పాత్ర మేనేజరుది . అతని పేరు నాకు ఐడియా లేదు . ఏ సాక్షి రంగారావో , అల్లు రామలింగయ్యో వేయాల్సిన పాత్ర . బహుశా చెల్లెల్ని కామందుకు సెట్ చేసే అంశం ఉంది కాబట్టి అల్లు రామలింగయ్య వంటి పేరున్న సీనియర్ నటుడిని తీసుకుని ఉండకపోవచ్చు . కానీ ఆ పాత్రను ఇతగాడు చాలా బాగా రక్తి కట్టించాడు . తప్పకుండా ప్రత్యేకంగా అభినందించాల్సిందే .

జయప్రద- శోభన్ బాబు జంట చాలా అందంగా ఉంటుంది . ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండటం వలన డ్యూయెట్లు కూడా అందంగా వచ్చాయి . శోభన్ బాబు మహిళా అభిమానులకు , జయప్రద మగ అభిమానులకు బాగానే నచ్చింది సినిమా . సత్యం సంగీతం , జేసుదాస్ గాత్రం సినిమాను వంద రోజుల బండి ఎక్కించాయి . ఈమధ్యే ఏదో చానల్లో వచ్చింది .

ఇలాంటి కధాంశంతోనే ఇ వి వి సత్యనారాయణ కన్యాదానం అనే టైటిలుతో ఓ సినిమా తీసారు . బాగానే ఆడింది . అయితే ఆ సినిమాలో ఆత్మాహుతులు లేవు . శ్రీకాంత్ , ఉపేంద్ర , రచన ప్రధాన పాత్రధారులు . బై ది వే , ఈ సినిమా హీరోయిన్ రచన ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ MP అయింది .

మళ్ళా స్వయంవరం సినిమాకొస్తే ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో సినిమా , పాటల వీడియోలు ఉన్నాయి . శోభన్ బాబు , జయప్రద , దాసరి అభిమానులు మళ్ళా ఇంకోసారి చూడొచ్చు . It’s a Dasari mark movie filled with drama as usual , emotions , romance and melodious music .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions