……… By….. Taadi Prakash………….. The Father of Indian White Revolution, వర్గీస్ కురియన్ తో ఒక రోజు అర్థరాత్రి… హైవే… చీకటినీ, చినుకుల్నీ చీల్చుకుంటూ బస్సు దూసుకుపోతోంది. గుజరాత్ వెళ్తున్నాం మేమంతా. అది 1985 చివరిలో. విజయవాడ ‘ఉదయం’ దినపత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్ని నేను. మరో 40 మంది విజయవాడ పత్రికా విలేకరులు. ఖేడా జిల్లాలోని ఆనంద్ అనే చిన్న పట్టణానికి వెళుతున్నాం. అక్కడ అమూల్ పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని చూడటం, వర్గీస్ కురియన్ని కలవడం! […]