ఒక ఫోటో ఆసక్తికరంగా అనిపించింది… నిజానికి ఓ సాదాసీదా ఫోటోయే… కానీ వర్తమాన తెలుగు పత్రికల స్థితిగతుల, సంస్థాగత వ్యవహారాల నేపథ్యంలో కాస్త ఇంట్రస్టింగ్… ఈ ఫోటోలో ఉన్నది ఏబీఎన్- ఆంధ్రజ్యోతి బాస్ రాధాకృష్ణ… విమానంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాడు… తన వెనుక కనిపిస్తున్నది వక్కలంక రమణ… పత్రికలో కీలకమైన పొజిషన్ తనది… ఈనాడు రామోజీరావు చాన్నాళ్లుగానే ఈనాడుకు దూరదూరంగానే ఉన్నాడు వయస్సు, అనారోగ్యాల రీత్యా… ఆయన వెళ్లిపోయాక ఈ యాభై ఏళ్ల నంబర్ వన్ […]
క్రియేటివ్ రాశిఫలాలు… ఆంధ్రజ్యోతి మరీ అపహాస్యం చేసేసింది…
రాశి ఫలాలను, జాతకాలను మీడియా ఎంత ఫార్స్‌గా మార్చేసిందో చూశాం కదా… ఏవేవో ప్రాతిపదికలతో ఏదేదో రాసేసి జనం మొహాన కొడుతుంటారు… నమ్మినవాడి ఖర్మ… రంగురాళ్లు, జాతకపూజల దందాలకూ మీడియా పోకడలకూ పెద్ద తేడా ఏమీ అనిపించదు… ఆంధ్రజ్యోతి సైటులో ఓ స్టోరీ చదివితే హాశ్చర్యం ఆవరించింది… పెడపోకడలకు పరాకాష్ట అనిపించింది… ఆ టైటిల్ ఏమిటంటే… Maha Shivratri 2024: శివుడికి ఇష్టమైన రాశిఫలాలివే.. మహాదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి..! ఇది మహాశివరాత్రి కానుకగా సమర్పించారన్నమాట… ఇందులో విషయం […]
తకరారు నమస్తే… చంద్రబాబుపై ఏడుపు… ఆంధ్రజ్యోతికి నొప్పి… అక్షరాలా గిలగిలా…
పార్టీలే కాదు, ఆయా పార్టీల బాకాలు కూడా బజారుకెక్కి తన్నుకుంటయ్… తిట్టుకుంటయ్… తెలుగునాట చాలా సహజం… సాక్షిని ఈనాడు, సాక్షిని ఆంధ్రజ్యోతి… ఈనాడు, జ్యోతిలను సాక్షి… నమస్తేను వెలుగు, వెలుగును నమస్తే… నమస్తేను ఆంధ్రజ్యోతి, జ్యోతిని నమస్తే… ఇలా తిట్లదండకాలు నడుస్తూ ఉంటయ్… వార్తను బట్టి, తీసుకున్న పొలిటికల్ ధోరణిని బట్టి… వీటిల్లో ప్రతి పత్రిక ఏదో ఒక పార్టీకి మైకు… అందుకని అవే రంగులు పూసుకుని, బజారులో పడి శిగాలూదుతూ ఉంటయ్… కానీ ఏదైనా సబ్జెక్టు […]
ఆంధ్రజ్యోతి డిజిటల్ బాట… డైనమిక్ ఎడిషన్లతో కొత్త ప్రయోగాలు…
రాబోయే రోజుల్లో ఇక పత్రికల ప్రింట్ ఎడిషన్లు కనిపించడం అరుదైపోతుంది… విపరీతంగా పెరిగిన ముద్రణవ్యయం, పెరిగిన జీతభత్యాల భారం, రవాణా ఖర్చు, పంపిణీ వ్యయం తడిసి మోపెడవుతోంది… ఏవో రాజకీయ అవసరాలున్నవాళ్లు తప్ప కమర్షియల్ కోణంలో ఎవరూ కొత్తగా ప్రింట్ జోలికి వెళ్లే అవకాశాల్లేవు ఇక… పైగా పేపర్ కొని చదివేవాళ్ల సంఖ్య కూడా వేగంగా పడిపోతోంది… ప్రతి నిమిషమూ వార్తల్ని అప్‌డేట్ చేసే సైట్లున్నాయి… సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తోంది… ఎప్పటికప్పుడు ముఖ్యమైన వార్తల్ని మొబైల్ […]
కేసీయార్ ఉచ్చులోకి అమిత్ షా… అప్పుడు ఉంటుంది అసలు తమాషా…
నిజమే అయితే… ఇక కేసీయార్ ఏకంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ వ్యవహారాల కీలక సూత్రధారి అమిత్ షాను ఉచ్చులోకి లాగబోతున్నాడు అనే తాజా వార్తలే గనుక నిజమైతే… ‘ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు’లో సిట్‌ను నేరుగా ఢిల్లీ చిన పాదుషా పైకే ప్రయోగించడమే నిజమైతే… పోరాటం మరింతగా రక్తికడుతుంది… (ఇక్కడ రక్తికట్టడం అనే పదం వాడటానికి కారణం… ఇవేవీ చివరకు ‘వర్కవుట్’ అయ్యే కేసులేమీ కావు అని… ఒకరినొకరు ఇరికించడం కోసం, పొలిటికల్‌గా బదనాం చేయడం కోసం […]
ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?
బహుశా రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు… ‘ఈనాడు వయా మీడియాగా పోతుంది, అదంటే గౌరవం… సాక్షిని నేను అసలు చదవను… జ్యోతి కూడా టీడీపీ భజన పత్రిక…’ అన్నాడట మీడియాతో ఆఫ్‌దిరికార్డు మాట్లాడుతూ..! అది నిజమే… సాక్షిని వైసీపీ వాళ్లే పెద్దగా చదవరు… అందులో జగన్ భజన తప్ప మరొకటి ఉండదు… ఇతర పార్టీల వార్తల కవరేజీలో గానీ, బాస్ భజనలో గానీ, ప్రత్యర్థుల మీద దాడిలో గానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది… […]