Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగుదేశంలో పవర్ సెంటర్…: లోకేష్ మిత్రుడు రాజేశ్ కిలారు ఎవరు..?

May 26, 2025 by M S R

rajesh

. నిజానికి చంద్రబాబునాయుడు పార్టీలో ఎవరినీ రెండో పవర్ సెంటర్‌గా ఎదగనివ్వడు… తన లెక్క తనది… అలా చూసుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ తన చెప్పుచేతల్లో ఉంది ఇన్నాళ్లూ… కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి… తన వయోభారం కావచ్చు, ఇంకేమైనా కారణాలు కావచ్చు… వారసుడు లోకేష్ పగ్గాలు పట్టుకున్నాడు… పార్టీ, ప్రభుత్వంలో తన మాటే చెల్లుబాటు ప్రస్తుతం… తను గతంలోని లోకేష్ కూడా కాదు… అన్నీ నేర్చుకున్నాడు… పరిణతి కనిపిస్తోంది… ఐతే పార్టీలో లోకేష్ గాకుండా మరో […]

మోడీకి మద్దతుకూ ప్రత్యేక హోదాకూ ముడిపెట్టి ఉండాల్సిందట…

June 14, 2024 by M S R

jagan

సామాజిక పింఛన్ల పథకానికి వైఎస్ఆర్ పేరును తీసేసి ఎన్టీయార్ భరోసాగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది… ఇదీ పొద్దున్నే కనిపించిన వార్త… సరే, ఊహించిందే… ఇది మాత్రమే కాదు… అనేకానేక పథకాలకు జగన్, వైఎస్ పేర్లున్నయ్, అవన్నింటినీ తుడిచేస్తాడు చంద్రబాబు… ఎన్టీయార్ పేరో, మరో పేరో పెడతాడు, సరే, వాళ్లిష్టం… నిజానికి ఇలా నాయకుల పేర్ల బదులు ఇంకేవైనా మంచి తెలుగు పేర్లు పెట్టి ఉంటే… ఇలా ఎడాపెడా పేర్ల మార్పిడి పథకం అవసరం లేదు… ఉండదు… మరీ […]

రామోజీరావు స్మైల్, సేఫ్… రాధాకృష్ణ ఫుల్ హేపీ… పసుపు కాంతులు…

June 4, 2024 by M S R

yellow media

ఈసారి ఎన్నికల విశ్లేషణల్లో ఖచ్చితంగా తెలుగు మీడియా ప్రస్తావన కూడా రాకతప్పదు… జగన్ ఎంతోకాలంగా చెబుతున్నాడు, తనకు ప్రత్యర్థులు చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు… టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు అని..! సో, ఇప్పుడు జగన్ ఎవరూ ఊహించని రీతిలో మట్టికరిచాడు… సరే, ఇదంతా తన స్వయంకృతమే… ఎందుకు ఓడిపోయాడు, మరీ జనం ఇంతగా ఎందుకు ఛీకొట్టారనే అంశాన్ని ఇక్కడ కాస్త వదిలేస్తే… తెలుగు మీడియా వ్యవహారశైలి, పోషించిన పాత్ర ముఖ్యం… అబ్బే, మీడియా రాతలకు జనం […]

ఫలితాల అంచనాల్లో రవిప్రకాష్ సాహసం… నాలుగో ‘ఆర్’ అవుతాడా..?

May 5, 2024 by M S R

raviprakash

ఆర్… రామోజీరావు ఈనాడు, ఆర్… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఆర్… రాజగోపాలనాయుడు టీవీ5… ట్రిపుల్ ఆర్… వీళ్లంతా జగన్ వ్యతిరేక శక్తులే… చంద్రబాబు అనుకూల వ్యక్తులే… బయటికి ఏం చెప్పుకోబడినా సరే, ప్రస్తుతం జగన్ అధికారాన్ని కూల్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నవారే… అందరి సామాజికవర్గమూ ఒకటే… అందరూ జగన్ ప్రారంభించిన కులసమరంలో ఒకవైపుకు నెట్టేయబడినవారే… ఈ ట్రిపుల్ ఆర్‌కు మరో ఆర్ జతచేరుతుందా..? అదే సామాజికవర్గం… గతంలో అదే జగన్ వ్యతిరేకత… ఈ ఆర్ పేరు రవిప్రకాష్… టీవీ9 ఫౌండర్… […]

శారీ పాలిటిక్స్..! బాబాయ్ మీదుగా యెల్లో చీరె దాకా ‘‘ప్రచార విజ్ఞత..!!

April 27, 2024 by M S R

saree politics

దేశమంతా ఎన్నికల ప్రచారం ఒక తీరు… ఏపీ పాలిటిక్సు మాత్రం మరో తీరు… బూతులు, తిట్లు, ఎద్దేవా, వ్యక్తిత్వ హననం స్థాయి కూడా దాటిపోయి చివరకు కట్టుకున్న చీరెల దాకా వచ్చింది పరిస్థితి… నాకు మీరు ఇచ్చిన గత అయిదేళ్ల పాలనకాలంలో నేను ఇది చేశాను, మళ్లీ గెలిపిస్తే ఇంకా ఇది చేస్తాను అని హుందాగా చెప్పుకుంటే సరిపోయేది కదా, కానీ జగన్ ఎటెటో వెళ్లిపోతున్నాడు… జగన్ రాష్ట్రానికి ఇదుగో ఈ ద్రోహాలు, నష్టాలు చేశాడు, గతంలో […]

కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!

March 31, 2024 by M S R

caste

ఫోన్‌ ట్యాపింగ్‌ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]

కుర్చీలు మడతపెట్టి, కండోమ్స్ దాకా వచ్చింది వైరం… రేపేమిటో..!!

February 22, 2024 by M S R

condoms

బూతులు, మహిళా నేతలపై వెగటు విమర్శలు, వ్యక్తిత్వ హననాలు, వెకిలి వెక్కిరింపుల నుంచి చివరకు కుర్చీ మడతపెట్టి తిట్టుకునేదాకా దిగజారింది ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కొట్లాట… సోషల్ మీడియాలో జరిగే యుద్ధానికి ఆకాశమే హద్దు… దానికి మర్యాదలు మన్నూమశానాలు జాన్తానై… మొన్న ఎక్కడో లోకేష్ ఓ కుర్చీని మడతపెట్టి చూపిస్తున్న ఫోటో కనిపించింది… తనకు ఆ కుర్చీ మడతపెట్టడం అనే పదాల్ని ఎందుకు వాడతారో తెలుసా అసలు..? తెలిసీ ఆ వెకిలి ప్రదర్శనకు దిగాడా…? ఇక […]

బాబుపై సుప్రీం తీర్పు ప్రభావం కేసీయార్‌పై ఎంత..? తమిళిసై ఇంపార్టెన్స్ పెరిగిందా..?

January 16, 2024 by M S R

చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టులో సందిగ్ధత ఇంకా కొనసాగనుంది… చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ సెక్షన్ వర్తింపు, గవర్నర్ ముందస్తు అనుమతి అంశాల్లో ద్విసభ్య బెంచ్ భిన్నాభిప్రాయాల్ని వెలువరించి, తదుపరి కార్యాచరణను చీఫ్ జస్టిస్‌కు నివేదించింది… సో, త్రిసభ్య ధర్మాసనమో, సీజే నేతృత్వంలోని మరింత విస్తృత ధర్మాసనమో ఏర్పాటు కావాలి… నిజానికి ఈ ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు గవర్నర్ ముందస్తు అనుమతి దగ్గర డిఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నదే తప్ప 17 ఏ సెక్షన్ వర్తింపు […]

ఇన్నాళ్లూ ఫోన్ కాల్‌కూ దొరకలేదు… ఇప్పుడు ఫోన్ వస్తే చాలు గుండెల్లో దడదడ…

December 19, 2023 by M S R

జగన్

— అభ్యర్థుల ఖరారుపై వైసీసీ అధినేత జగన్‌ ఫోకస్‌ — ఇన్‌ఛార్జుల మార్పుపై నేరుగా నేతలతోనే చర్చలు — సీఎం జగన్‌తో ఉభయ గోదావరి జిల్లాల నేతల భేటీ — సీటు మారుస్తారన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్‌ — సీఎంను కలిసిన వారిలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. — కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ — జగన్‌తో భేటీ అయిన అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్… — రాజోలు ఎమ్మెల్యే […]

ఆ సర్వే ఏం చెబుతోంది..? జగన్ మళ్లీ గెలుస్తాడా..? హఠాత్ మార్పుల నేపథ్యమేంటి..?

December 12, 2023 by M S R

ysrcp

సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చి కేసీయార్ చేతులు కాల్చుకున్నాడు… 2018లోనే అందులో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది… వాళ్లకు అప్పుడూ టికెట్లు ఇచ్చి, మళ్లీ మొన్న టికెట్లు ఇచ్చి స్థూలంగా తనే దెబ్బతినిపోయాడు… వైనాట్ 175 అని కలలు కంటూ మురిసిపోతున్న జగన్‌కు తత్వం బోధపడింది… కళ్లు తెరిచాడు… మరి నా సంగతేమిటని ఆలోచించాడు… స్థానికంగా ప్రజల ఆదరణ చూరగొనలేని, వ్యతిరేకత పెంచుకున్న నాయకులకు మళ్లీ అవకాశాలు ఇస్తే పరిస్థితులు ఎదురు తిరుగుతాయని గ్రహించాడు… సర్వేలకు పూనుకున్నాడు… పైగా […]

‘‘బాబుకు తెలంగాణలో పనేమిటా..!? అసలు కేసీయార్‌కు ఆంధ్రాలో ఏం పని..?’’

December 25, 2022 by M S R

ntnews

ఏబీఎన్‌లో రాధాకృష్ణ ఓ సీరియస్ ప్రశ్న సంధించాడు కేసీయార్‌కు… నిజంగా గట్టి ప్రశ్నే… టీడీపీ వాళ్లకు అలా అడగడం చేతకావడం లేదు కాబట్టి ఆ బాధ్యతనూ తనే మీద వేసుకున్నట్టుగా… ‘‘చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులతో అడిగిస్తున్న కేసీయార్‌కు మరి ఆంధ్రాలో ఏం పని..? తనెందుకు ఆంధ్రాలో పోటీచేయాలి..?’’ ఈ ప్రశ్నకు దారితీసింది ఏమిటంటే..? ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ కావడం…! గతంతో పోలిస్తే టీడీపీకి తెలంగాణలో పెద్దగా బలం లేకపోయినా… ఆంధ్రా […]

ఏపీలో పిల్లలు తగ్గిపోవడానికి… జగన్ పిచ్చి పాలన నిర్ణయాలే కారణమా..?

November 20, 2022 by M S R

eenadu

పిల్లలు పుట్టకపోవడం, పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ముసలోళ్లే అధికమైపోవడం, జనాభాలో యువత శాతం కుంచించుకుపోవడం… ఇత్యాది లక్షణాలకు అసలు కారణం ఏమై ఉంటుంది..? మన సగటు జ్ఞానపరిధి మేరకు ఆలోచిద్దాం… మీరూ ఆలోచించండి… కుటుంబ నియంత్రణ మీద ప్రజల్లో అవగాహన పెరిగిపోవడం, ఒకరికన్నా ఎక్కువ మందిని ‘అఫర్డ్’ చేయలేమనే రియాలిటీ అర్థం కావడం… అంటే పిల్లలు ఎక్కువగా ఉంటే చదువు, ఆరోగ్యంతోపాటు ప్రేమనూ అందరికీ సరిపోయేలా, సరిగ్గా ఇవ్వలేమనే భావన… పెరిగిన జీవనవ్యయం, చంచలమైన కొలువులు, ఒక […]

Advertisement

Search On Site

Latest Articles

  • శాపగ్రస్త..! రాస్తే నవల… తీస్తే సినిమా… బతుకంతా ప్రేమరాహిత్యమే..!!
  • ఆ కుటుంబమే క్షమించేసింది… మళ్లీ ఇప్పుడు ఈ ఆగ్రహ ప్రకటనలేల..?!
  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions