బిగ్‌బాస్ ఏదో ఉల్టాపుల్టా అన్నాడు… నిజంగానే అంతా ఉల్టాపల్టా యవ్వారమే కనిపిస్తోంది… రెండు వారాలకొచ్చింది… వీసమెత్తు ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సీజన్ కూడా… గత సీజన్ పనిచేసిన క్రియేటివ్ టీమే పనిచేస్తున్నట్టుంది చూడబోతే… నాగార్జున రాగద్వేషాలు కూడా పనిచేస్తున్నట్టున్నయ్… వెరసి ఇప్పటికీ బిగ్‌బాస్ గాడిన పడలేదు, పట్టాలెక్కలేదు… ఈసారి ఏం చేశారు..? షకీలాను బయటికి పంపించేశారు… అబ్బే, ప్రేక్షకుల వోట్ల మేరకు అంటారేమో… అంత సీన్ లేదు… అదంతా బిగ్‌బాస్ ఇష్టారాజ్యం… పంపించాలనుకుంటే ప్రేక్షకుల వోట్లు […]
బిగ్‌బాస్ ఫిమేల్ కంటెస్టెంట్లకు ముందస్తుగానే ప్రెగ్నెన్సీ టెస్టులు..!
బిగ్‌బాస్ షోపై మొన్న హైకోర్టులో జరిగిన విచారణను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ… కాస్త ఇంట్రస్టింగ్… ఎవరో ఒకాయన వేసిన పిల్ మీద జరుగుతోంది ఈ విచారణ… అవసరమైతే మేమే ఆ షో చూస్తామని కూడా అప్పట్లో జడ్జిలు చెప్పారు… స్టే ఇవ్వలేదు… లేటైంది… ఈలోపు షో ముగిసింది… పిటిషనర్ వాదన ఏంటంటే… బిగ్‌బాస్ షో హింసాత్మకం, అశ్లీలం, అనైతికం కాబట్టి ఆ ప్రసారాలను నిలిపివేయించాలి… అశ్లీలంగా ఉంటే ఆ షో చూడకుండా ఉంటే […]
టాప్ ఫైవ్‌లో ఎవరు ఉంటారు..? వారం మధ్యలోనే తరిమేసేది ఎవరిని..?
హమ్మయ్య… బిగ్‌బాస్ షో ముగింపుకొస్తోంది… కోర్టు ప్రత్యక్ష విచారణ దాకా పోకుండానే దానంతటదే గడువు ముగిసి, హౌజుకు తాళం పడబోతున్నది టెంపరరీగా… భ్రష్టుపట్టించబడిన ఈ సీజన్ ముగిసిపోతుందంటే చివరకు బిగ్‌బాస్ షో అభిమానులు కూడా ఆనందపడుతున్నారు… అంత చెత్త చెత్త చేశారు… కారణాల జోలికి వెళ్లాలంటే మళ్లీ పేడకుప్ప తవ్వాలి… అదో కంపు… చివరి వారంలోకి ఆరుగురు కంటెస్టెంట్లు ప్రవేశించారు… కానీ ఫైనలిస్టులు అయిదుగురే కావాలి కదా… కాబట్టి బుధవారమో, గురువారమో మరొకర్ని తరిమేస్తారట హౌజు నుంచి… […]
85 లక్షలకు చేరిన బిగ్‌బాస్ ప్రైజ్ మనీ… సోషల్ తిట్లతో దిగొచ్చిన టీం…
కొన్నాళ్లుగా బిగ్‌బాస్ టీంకు ఒకటే పని… విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీలో ఎంత కోత పెట్టాలి..? ఎలా కోతపెట్టాలి అని..! పేరుకు యాభై లక్షల ప్రైజ్ మనీ అని ప్రకటించి, మళ్లీ ఈ కోతలేమిట్రా, ఎలాగూ ఈసారి షో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఖర్చులు మిగుల్చుకునే వేషమా అని నెటిజనం, సోషల్ మీడియా, మీడియా వెక్కిరింపులకు, తిట్టిపోతలకు దిగాయి… ఆ టీంకు వాచిపోయినట్టుంది… దిగొచ్చింది… నిజానికి ఆమధ్య రాజ్ అనుకుంటా… కంటెస్టెంట్ ఏదో పాట పాడి, […]
ఫాఫం నాగార్జున… చివరకు ఆ ఆదిరెడ్డికీ లోకువ చేసిన బిగ్‌బాస్ టీం…
ఫాఫం నాగార్జున… మళ్లీ అదే అనాలనిపిస్తోంది… నిన్నటి షో చూశాక మరింత బలంగా ఇలాగే జాలేసింది… అసలు ఈ సీజనే పరమ చెత్త… ఈ దరిద్రం ఎప్పుడు అయిపోతుందా అని ఆ టీమే ఎదురుచూస్తున్నట్టుగా ఉంది… సరే, ఈ సీజన్ దివాలా తీసింది సరే… ఎలాగోలా పూర్తి చేసి, చేతులు దులుపుకుంటే సరిపోతుంది కదా… లేదు, మధ్యలో నాగార్జున పరువు తీస్తున్నారు… తనకేమో ఇదంతా సమజైతలేదు… బిగ్‌బాస్ టీం నాగార్జునను పూర్తిగా మిస్ లీడ్ చేస్తోంది… తనేమో […]
తత్వం బోధపడి, తలబొప్పి కట్టి… బిగ్‌బాస్ తాజా సీజన్ సామాన్యులకే…
మొత్తానికి నాగార్జునకు, మాటీవీ వాడికి, బిగ్‌బాస్ నిర్మాతలకు తత్వం బోధపడింది… కోట్లకుకోట్లు ధారబోసి, ఆచితూచి ఎంపిక చేసిన సెలబ్రిటీలు నయాపైసా వినోదాన్ని ఇవ్వలేకపోతున్నారు… పైగా ఓవరాక్షన్లు, బూతులు, అశ్లీలం… దాంతో ఇక సామాన్యులతో ఈసారి సీజన్ నిర్వహించడానికి రెడీ అయిపోయారు… నిజానికి బిగ్‌బాస్ టీం ఎంపికల్లో ఏమేం మతలబులు ఉన్నాయో ఏం పాడో గానీ… గత రెండు మూడు సీజన్ల కంటెస్టెంట్లు పరమ బేవార్స్ ప్రదర్శన ఇస్తున్నారు… టీవీల్లో వచ్చిన అయిదు సీజన్లకన్నా ఓటీటీ బిగ్‌బాస్ సీజన్ […]
మీ సేఫ్ గేమ్స్ పాడుగాను… ఆటలోని మజాను చంపేస్తున్నార్రా బాబూ…
బిగ్‌బాస్ అంటేనే ఓ ఆట… ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే, ఆ బిగ్‌బాస్ టీం అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు… టీం ప్లాన్లు ఎదురుతన్నొచ్చు… కారణం సింపుల్… కంటెస్టెంట్ల తత్వాలు..! ఆ తత్వాల నడుమ పోటీయే బిగ్‌బాస్… గెలుస్తారా, ఓడిపోతారా, నామినేట్ అవుతారా, ఎవిక్ట్ అయిపోతారా, రీఎంట్రీ ఉంటుందా, సీక్రెట్ రూమా, జైలా, కెప్టెనా… ఏమైనా జరగనీ… కానీ ఆడాలి… తోటి కంటెస్టెంట్లను రెచ్చగొట్టాలి, బతిమిలాడాలి, జట్టుకట్టాలి, తగాదా పెట్టుకోవాలి… అన్నీ ఉంటయ్ గేమ్ ప్లాన్‌లో…! కోపాలుంటయ్, ఆవేశాలుంటయ్, […]
బిగ్‌బాస్..? బిగ్‌లాస్..? జెర కొన్నాళ్లు ఆగండి బాస్… కాలం చెబుతుంది…
బిగ్‌బాస్ పుణ్యమాని గంగవ్వకు ఇల్లొచ్చింది… బంగారం కొన్నది… సొహెల్‌కు మస్తు పైసలొచ్చినయ్… అభిజిత్‌కు పైసలతోపాటు కప్పొచ్చింది… అవినాష్, సొహెల్, మెహబూబ్, దివి, మోనాల్, అభిజిత్, అరియానా, అఖిల్… మస్తు సినిమా అవకాశాలు వస్తున్నట్టు ధూంధాం ప్రచారం సాగుతోంది… అయిదారు రోజులుగా మీడియా, సోషల్ మీడియా వీళ్లకొచ్చే అవకాశాలపైనే హోరెత్తిస్తున్నాయి… వాళ్లు కూడా ఈ పాపులారిటీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ… హొవ్, హొవ్… డుర్ డుర్… కాస్త పగ్గాలు వేయండి… మబ్బుల్లో నుంచి కాస్త నేలమీదకు దిగిరండి… […]