Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

షకీలాను పంపించేశారు… సీక్రెట్ రూంకు గరుణపురాణం… పాత బేకార్ తప్పులే మళ్లీ…

September 16, 2023 by M S R

బిగ్‌బాస్ ఏదో ఉల్టాపుల్టా అన్నాడు… నిజంగానే అంతా ఉల్టాపల్టా యవ్వారమే కనిపిస్తోంది… రెండు వారాలకొచ్చింది… వీసమెత్తు ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సీజన్ కూడా… గత సీజన్ పనిచేసిన క్రియేటివ్ టీమే పనిచేస్తున్నట్టుంది చూడబోతే… నాగార్జున రాగద్వేషాలు కూడా పనిచేస్తున్నట్టున్నయ్… వెరసి ఇప్పటికీ బిగ్‌బాస్ గాడిన పడలేదు, పట్టాలెక్కలేదు…

ఈసారి ఏం చేశారు..? షకీలాను బయటికి పంపించేశారు… అబ్బే, ప్రేక్షకుల వోట్ల మేరకు అంటారేమో… అంత సీన్ లేదు… అదంతా బిగ్‌బాస్ ఇష్టారాజ్యం… పంపించాలనుకుంటే ప్రేక్షకుల వోట్లు తక్కువ అని చెబుతారు… కొనసాగించాలీ అనుకుంటే అదే చెబుతారు… ఎస్, షకీలా పెద్దగా ఇంప్రెసివ్ ఆట ఆడలేదు… కానీ మరీ మూలకు కూర్చోలేదు… ఎంతోకొంత ఇన్వాల్వ్ అవుతూనే ఉంది…

Ads

కానీ ఏమాటకామాట… ఆమె తత్వం ఈ ఆటకు సూట్ కాదు… ఇక్కడ చిల్లరతనం అవసరం… అది ఆమెకు లేదు… ఆమె శృంగారం ఒలకబోసిన బోలెడు చిత్రాలు వచ్చాయి గతంలో… ఓ ఊపు ఊపేసింది… కానీ పెద్దగా సంపాదించుకున్నట్టు లేదు… ఇప్పుడెవరూ సినిమాల్లో చాన్సులివ్వరు… సో, డబ్బు కోసం బిగ్‌బాస్ హౌజుకు వచ్చింది… ఆమె నడవడిక, మాట తీరు గమనిస్తే హుందాగా ఉంది… మరి హౌజులో అలా ఉండకూడదు కదా… అది మైనస్ అయిపోయింది…

వయస్సు అనేది పెద్ద ఫ్యాక్టర్ కాదు… గతంలో గంగవ్వ కొన్నాళ్లు బాగానే ఉండగలిగిందిగా… అప్పట్లో బాబు గోగినేని కూడా ఉన్నాడు… షకీలా హౌజులో ఉన్న యువ కేరక్టర్లతో మింగిల్ కాలేకపోయింది… ఎస్, వోట్లు తక్కువే రావచ్చుగాక… కానీ ఆమెతో పోలిస్తే యావర్, ప్రశాంత్, శివాజీ తదితరులు ఇంకా వేస్ట్… ఇక్కడే మరో విషయమూ చెప్పుకోవాలి… శివాజీ మీద నాగార్జునకు ప్రేమ ఎక్కువ కదా… నేను పోతా, గేట్లు తీయండి అంటూ అరుస్తుంటాడు తరచూ… అదో గేమ్ ప్లాన్‌లాగా… ఈ విషయంలో యావర్‌కూ శివాజీకి తేడా లేదు… ఈవారం king meter అట… అంటే నాగార్జున ఇష్టం అన్నమాట… అఫ్ కోర్స్, ఎప్పుడూ ఉన్నదే… ఈసారి official… అంతే…

Ads

అందరికీ నీతులు చెబుతుంటాడు… పెత్తనం చలాయించే ప్రయత్నం చేస్తాడు… పనులు చేయడు… పెత్తందారీ పోకడతో విసిగిస్తున్న శివాజీ ఏదో నాగార్జున పుణ్యమాని ఈసారి ఎలిమినేట్ డ్రామాలోకి వచ్చాడు… సీక్రెట్ రూంలోకి వెళ్లాడు… అక్కడేం వికారాలు పోతాడో చూడాలిక… లాంచింగ్ షోకు రేటింగ్స్ తక్కువ వచ్చినా సరే, ఏవో పెద్ద అంకె వేసుకుని గొప్పగా ప్రచారం చేసుకున్న తీరును మనం చెప్పుకున్నాం కదా, వీక్ డేస్‌లో మరీ దారుణంగానే ఉంది… ఈ సిట్యుయేషన్‌లో గత సీజన్‌లాగే… దాదాపుగా… నడుస్తున్న ఈ సీజన్ ఇప్పుడప్పుడే మెరిసే సూచనలైతే లేవు…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions