ఏమైంది, ఏమీ కాలేదు… నిక్షేపంలా ఉంది, బంగారంలా ఉంది, అత్యద్భుతమైన అతి గొప్పాతిగొప్ప ప్రాజెక్టు… ప్రపంచ ఎనిమిదో వింత… జస్ట్, ఒక పిల్లర్ కుంగింది, మరో పిల్లర్ కాస్త ఫ్రాక్చరయింది, అంతే… ఈమాత్రం దానికి ఇంత ఏడవాలా రేవంత్ రెడ్డి..? అసలు కాళేశ్వరం లేకుండా యాసింగిలో నీళ్లిస్తవా, ఇచ్చి చూడు, మేమూ చూస్తాం… మాట్లాడితే లక్ష కోట్ల అవినీతి అంటవ్, కేసీయార్ తినేశాడు అంటవ్, మళ్లీ మళ్లీ అదే కూస్తే మర్యాద దక్కదు సుమా…….. దాదాపు ఇలాగే […]
సో వాట్…? కలెక్టర్ ఆటవిడుపు ఫోటోలకు ఈనాడు మెయిన్ పేజీ ఇంపార్టెన్సా..?!
ఒక వార్త… అదీ ది గ్రేట్ ఈనాడులో.,. పొలం బాటలో కలెక్టర్ దంపతులు అని శీర్షిక… పొలం బాట అనేది సర్కారీ ప్రోగ్రాం పేరు కాదులెండి… నిత్యం సమీక్షలు, క్షేత్ర పర్యటనలో తీరిక లేకుండా విధులు నిర్వహించే కలెక్టర్ ఆదివారం పూట ఆటవిడుపుగా పొలం బాటపట్టారు… అనేది వార్త సారాంశం… నిజానికి అది ఓ ఫోటో వార్త… అంటే రైటప్‌కు ఎక్కువ, వార్తకు తక్కువ… సదరు కలెక్టర్ మెదక్ జిల్లాకు కలెక్టర్, పేరు రాహుల్ రాజ్… ఆయన […]
‘రద్దుల పద్దు’…. ఈనాడు కళ్లల్లో సంతోషం కోసం బాబు తాజా డెసిషన్…!
కక్షసాధింపు ఉండదు… మాది జగన్ పాలనలాగా సైకో పాలన కాదు… ప్రజావేదిక శిథిలాలను ఆ పాలనకు గుర్తుగా అలాగే ఉంచుతాను…. అని ఏవేవో చెప్పిన చంద్రబాబు తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చేశాడు… జగన్, బాబు… ఎవరూ జేసీబీ పాలనకు అతీతులు కారని నిరూపించాడు… ప్రతి జిల్లాలో నిర్మించిన పార్టీ ఆఫీసుల బొమ్మలు వేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో ఆనందం పొందాయి గానీ… టీడీపీ పార్టీ ఆఫీసులు నిర్మించుకోలేదా..? అసలు హైదరాబాదు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కథేమిటి..? రెండు […]
అప్పట్లో ఈనాడుకు ఏడెనిమిది మంది ఎడిటర్లు… తర్వాత ఒక్కడే…
నాగసూరి వేణుగోపాల్ సోషల్ మీడియాలో పంచుకున్న ముచ్చట ఏమిటంటే… ‘‘దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాదుకి ఏ పెద్ద జర్నలిస్టు లేదా సంపాదకుడు వచ్చినా ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రసంగించడం అనేది ఆనవాయితీ! అటువంటి మహామహులను ఈ బడ్డింగ్ జర్నలిస్టులు కలిసే అవకాశం చాలా విలువైనది. అలా లెక్చరిచ్చిన పత్రికాసంపాదకులకు పారితోషికం, వసతి వంటివి ఎలాగూ ఏర్పాటు చేయబడతాయి. ఇది ఒక పార్శ్వం కాగా, ఆ సంపాదకులు లేదా జర్నలిస్టులు, వారు ఇతర చోట్ల ఇటువంటి సదుపాయం […]
ఆయన నవ్వడమే అరుదు… నా జవాబు విని చిన్నగా నవ్వాడు…
నిజానికి ఇది ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం, తన బయోపిక్‌లో ఓ చిన్న సీన్… పెరిఫెరల్‌గా చూస్తే ఇందులో న్యూస్ ఎలిమెంట్ ఏమీ లేదు… కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే… ఒకప్పుడు ఈనాడును రామోజీరావు ఎంత జాగ్రత్తగా నిర్మించాడో అర్థమవుతుంది… ఇప్పుడంటే ఈనాడును ఎవరుపడితే వాళ్లు ఆడేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు రామోజీరావు ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా తనే చూసుకుంటూ, దాన్ని జాగ్రత్తగా పెంచాడు… ఈనాడులో ఒకప్పుడు ప్రతిదీ సిస్టమాటిక్, మెటిక్యులస్… ఆ పునాదులు అంత బలంగా […]
ఆరకంగా ఈనాడు రామోజీరావు తను అరెస్టు గాకుండా కాపాడుకున్నాడు…
Nancharaiah Merugumala…… నారీమన్ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం! …………………………………. ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70 ఏళ్లకు పైగా న్యాయవాద […]
ఛోడ్‌దేవ్ ఆంధ్రా మీడియా… పాపప్రక్షాళనకు నమస్తే తెలంగాణకు ఇదే చాన్స్…
ఒక ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారి, తెలంగాణ వ్యతిరేక శక్తులను నెత్తికెక్కించుకుని, తెలంగాణ ప్రయోజనాల్ని కసకసా తొక్కిపడేసిన కేసీయార్ పార్టీలాంటిదే కదా నమస్తే తెలంగాణ పత్రిక కూడా…. అది కొనసాగాల్సిన అవసరం ఉందని చెబుతారేం..? టీన్యూస్, తెలంగాణటుడే రంగంలో ఉండాలన్నట్టు రాస్తారేం..? జర్నలిస్టుల జీవితాలు బజారున పడొద్దనేనా..? అని సీరియస్ ప్రశ్న వేశాడు ఓ జర్నలిస్ట్ మిత్రుడు… తనకు పెద్ద పెద్ద వివరణలు అక్కర్లేదు… ఈరోజు ఆ పత్రికలో ఫస్ట్ పేజీలో వచ్చిన ఓ […]
రామోజీ సర్… ఇలాంటివి మీ కంటబడుతున్నాయా..? లేక పూర్తిగా వదిలేశారా..?
రాజకీయ లక్ష్యాలతో వండి వార్చే అభూత కథనాలు, అక్షరాలతో దాడులు ఈనాడు పాత్రికేయానికి ఆది నుంచీ ఉన్న అవలక్షణమే… ఆ దరిద్రాన్ని పక్కన పెడితే తెలుగు మీడియాలో ఈనాడే నంబర్ వన్… మిగతా మీడియా ఈనాడును చూసి వాతలు పెట్టుకోవడమే తప్ప సొంత దారుల్లేవు, సొంత క్రియేటివ్ ఐడియాల్లేవు… గతంలో ఈనాడు వార్తారచన, ప్రజెంటేషన్‌కు సంబంధించి కొన్ని ప్రమాణాలు పాటించేది… వర్తమానంలో ఈనాడు ఏం పబ్లిష్ చేస్తున్నది..? ఇది ఎవరికీ అంతుపట్టని ప్రశ్న… చివరకు రామోజీరావుకు కూడా […]
అప్పట్లో… ఒకానొక కాలంలో… రామోజీరావుకు శిక్ష విధించిన ఆయనెవరో తెలుసా..?!
ఏమాటకామాట… ఒక్క నిజాన్ని అంగీకరించాలి… ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సరే మార్గదర్శి మీద జనంలో కోపం, అసహనం ఏమీ రావడం లేదు… రామోజీరావు మీద ప్రజల్లో ఉన్న విశ్వాసం అది… ఆ క్రెడిబులిటీ గట్టిగా ఉంది కాబట్టే… గతంలో మార్గదర్శి ఫైనాన్స్ మీద వైఎస్ పన్నాగాలను కూడా చూశారు కాబట్టే జగన్ చిట్‌ఫండ్స్ మీద పడితే… అదంతా రాజకీయమే అని నమ్ముతున్నారు అందరూ… వై ఓన్లీ మార్గదర్శి..? ఈ ప్రశ్నకు జగన్ ప్రభుత్వం వద్ద ఫెయిర్, […]
సభకు వచ్చిన వారి పేర్లు కూడా రాసేస్తే ఓ పనైపోయేదిగా ఈనాడూ..!!
పత్రికల జోన్ పేజీలలో కొన్ని వార్తలొస్తుంటాయి… ఏదైనా సభ జరిగితే అందులో పాల్గొన్నవారి పేర్లు లంబాచోడా అనేక పేర్లు వార్తలో ఇరికిస్తారు… కొన్ని మొహామాాటాలు, కొన్ని ఒత్తిళ్లు, కొన్ని ప్రలోభాలు… కారణాలు ఏవైతేనేం..? కొన్నిసార్లు లీడ్ రాసేసి, మిగతా వార్త మొత్తం పేర్లతో నింపేవాళ్లు కూడా ఉన్నారు… డెస్కుల్లో కూడా కళ్లు మూసుకుని అచ్చేస్తారు… పైగా రొటీన్ ఫార్మాట్… ఎవరో ముఖ్య అతిథి తెలిసీతెలియక ఏదైనా కూస్తే దాన్నే లీడ్ తీసుకుని, అదే హెడింగ్ పెట్టి తోసేస్తుంటారు… […]
ఈ తుచ్ఛమైన చట్టాలు అంతటి రామోజీరావుకు కూడా వర్తిస్తాయా..?
Murali Buddha………. రామోజీ రావుకు చట్టాలు వర్తిస్తాయా ? మార్గదర్శి పై హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధానికి లేఖ అని ఈనాడులో పెద్ద వార్త చూడగానే ఆసక్తిగా చదివాను … జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే అల్లా టప్పా వ్యక్తి కాదు చిట్ ఫండ్ , చట్టం వ్యాపారం గురించి బాగా తెలిసిన వారు అయి ఉంటారు, ఉండవల్లి లేవనెత్తిన ప్రశ్నలకు కచ్చితంగా ఈయన సమాధానం ఇచ్చే ఉంటారు అని చూశా ….. […]
అడ్డదారులూ ఫలించని సాక్షి… ఈనాడును జయించలేక చతికిల… ప్చ్, ఆంధ్రజ్యోతి…
పత్రికల గతిని శాస్త్రీయంగా సూచించేవి ఏబీసీ లెక్కలు… ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… పది రోజుల క్రితం తాజా ఫిగర్స్ వచ్చాయి… జాతీయ స్థాయిలో ఎవరూ రాసుకోలేదు… ఎవరికీ ఆశించినంత, రాసుకునేంత సంతృప్తి లేదు గనుక… కరోనా భయాల అనంతరమూ పత్రికల సేల్స్ పెద్దగా పెరగలేదు గనుక… 2019 స్థాయిని తిరిగి చేరలేదు గనుక… చేరుకుంటామనే నమ్మకమూ, సూచనలూ లేవు గనుక… సరే, ప్రింట్ మీడియా పరిస్థితి ఇకపై కూడా పెద్దగా బాగుపడే అవకాశాల్లేవు, కారణాలు అనేకం […]
హరీష్ భాయ్… సకాల స్పందన భేష్… కానీ చేయాల్సింది ఇంకా ఉంది…!
నిజంగా ఈ వార్త బాగుంది… అసలు మన మెయిన్ స్ట్రీమ్ పత్రికలు హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తల్ని రోజురోజుకూ మరిచిపోతున్నయ్… పాపపంకిలమైన రాజకీయ, ఉద్దేశపూరిత కథనాలకు పరిమితమై మన పత్రికలన్నీ మురికి కంపు కొడుతున్నవేళ ఇలాంటి వార్తలు రావడమే అరుదు… అందుకని ఈ వార్త రాసిన ఈనాడు ఇంద్రవెల్లి విలేఖరికి అభినందనలు… వార్తను స్థూలంగా గమనిస్తే… అదొక గిరిజన గూడెం… ఉన్నవే 6 ఆదివాసీ కుటుంబాలు… ఏ చిన్న అవసరానికైనా సరే పది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండలకేంద్రానికి […]
ఆమె కూడా అనిశా, రోరసం, భారాస అని మాట్లాడుతూ ఉంటుందా ఏం..?!
దీన్నే ‘అతి’ అంటారు… తెలుగును మెరుగుపరుచుకోవడం వేరు… తెలుగు నేర్చుకోవడం వేరు… సీఎం ఆఫీసులో పనిచేసే స్మిత సభర్వాల్ ఏదో మొహమాటానికో, మర్యాదకో నేను ఈనాడును చదివే తెలుగు నేర్చుకున్నాను అన్నదట… ఇంకేం… అంతకుమించిన సర్టిఫికెట్ మరిక దొరకదు, ఇదే మహాభాగ్యం అనుకున్న ఈనాడు… ఇదుగో ఈ హెడింగ్ పెట్టేసి… ధన్యోస్మి అన్నట్టుగా… ఓ మూడు నాలుగు కాలాల వార్తను భీకరంగా అచ్చేసుకుంది… ఈ దెబ్బకు మహిళల దినోత్సవం, రోజు విశిష్టత ఎట్సెట్రా కాకరకాయ కబుర్లు సోదిలో […]
పాపం ముగ్గురు ఈనాడు సబెడిటర్లు బలి… అసలు దండించాల్సింది ఎవరిని..?!
నిజంగానే ఓ ముఖ్యమైన వార్త రిపోర్టింగులో పాత ఫోటోల్ని, ప్రజెంట్ ఫోటోలుగా ముద్రించడం ఈనాడు చరిత్రలో అత్యంత అరుదు… వేరే పత్రికల్ని వదిలేయండి… ఈనాడులో ఇలాంటి పాత్రికేయ వృత్తి విషయాల్లో కొంత డిసిప్లిన్ మెయింటెయిన్ చేస్తారు… తప్పులు చేసిన ఉద్యోగులకు తక్షణం తీసిపడేస్తారు… మరి పట్టాభినీ కొట్టారు అనే బ్యానర్ స్టోరీలో జరిగిన తప్పులకు ఎవరిని బలితీసుకున్నారు..? ఏముంది..? పెద్ద తలకాయలన్నీ సేఫ్… అమరావతి డెస్క్ ఇన్‌ఛార్జి రామకృష్ణ, మరో ఇద్దరు సబ్‌ఎడిటర్లను తీసేశారని సమాచారం… ఎందుకంటే… […]
పాత ఫోటోల్ని దంచి కొట్టారు… ఆనక అరుదైన రీతిలో తలదించుకున్నారు…
అప్పట్లో వైఎస్ మీద ఎన్ని రాసినా… ఇప్పుడు జగన్ మీద రాస్తున్నా… ఈనాడు గానీ, ఆంధ్రజ్యోతి గానీ, టీవీ5 గానీ… ఎప్పుడైనా పొరపాటో, తప్పో దొర్లితే వివరణ, ఖండన, క్షమాపణ, సంతాపం, స్పష్టత వంటివేమీ ఉండేవి కావు… అబద్ధాలు రాయకపోతే అది పాత్రికేయం ఎలా అవుతుంది..? అసలు జగన్ మీద రాయకపోతే అది జర్నలిజం ఎలా అవుతుంది..? అనే తెంపరితనం కనిపించేది… మా పొలిటికల్ లైన్ ఇదే, ఏం చేసుకుంటావో చేసుకోపో అనే వైఖరి కనిపించేది… క్రమేపీ […]
ఏం ఈనాడుర భయ్… జగన్ పేరుపైనే దృష్టి… కవిత పేరు పట్టని వైనం…
ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు… ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు […]
ఏపీలో పిల్లలు తగ్గిపోవడానికి… జగన్ పిచ్చి పాలన నిర్ణయాలే కారణమా..?
పిల్లలు పుట్టకపోవడం, పిల్లల సంఖ్య తగ్గిపోవడం, ముసలోళ్లే అధికమైపోవడం, జనాభాలో యువత శాతం కుంచించుకుపోవడం… ఇత్యాది లక్షణాలకు అసలు కారణం ఏమై ఉంటుంది..? మన సగటు జ్ఞానపరిధి మేరకు ఆలోచిద్దాం… మీరూ ఆలోచించండి… కుటుంబ నియంత్రణ మీద ప్రజల్లో అవగాహన పెరిగిపోవడం, ఒకరికన్నా ఎక్కువ మందిని ‘అఫర్డ్’ చేయలేమనే రియాలిటీ అర్థం కావడం… అంటే పిల్లలు ఎక్కువగా ఉంటే చదువు, ఆరోగ్యంతోపాటు ప్రేమనూ అందరికీ సరిపోయేలా, సరిగ్గా ఇవ్వలేమనే భావన… పెరిగిన జీవనవ్యయం, చంచలమైన కొలువులు, ఒక […]
ఈనాడులో మళ్లీ బాండెడ్ లేబర్… ఆంధ్రజ్యోతిలో జీతాల పెంపుదల…
ఈమధ్య ఓ మీడియా వ్యవహారాల వెబ్‌సైట్ కొన్ని అంకెలు ప్రచురించింది… జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పత్రికల సర్క్యులేషన్ ఈ రెండేళ్లలో ఎంత దారుణంగా పడిపోయిందనేది ఆ గణాంకాల సారాంశం… తెలుగులో పత్రికల స్థితిగతులేమిటో ‘ముచ్చట’ ఇంతకుముందే చెప్పింది… అసలు ఏబీసీ లెక్కలంటే వణికిపోయే చిన్నాచితకా పత్రికల్ని వదిలేద్దాం… ఏబీసీ లెక్కలకు సిద్ధపడేవి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి… వాటి కాపీలు ఎంత దారుణంగా పడిపోయాయో కూడా మనం చెప్పుకున్నాం… దేశమంతటా ప్రింట్ మీడియా సంక్షోభం కొనసాగుతోంది… ముద్రణ […]
భేష్ ఈనాడు..! ఔనూ, ఈ భేటీతో సాయిరెడ్డికి అందిన సంకేతమేమిటి..?!
విమర్శించడానికి ‘ఈనాడు’ మీద బోలెడు అంశాలు దొరుకుతాయి… రోజురోజుకూ పతనమవుతున్న ప్రొఫెషనల్ ప్రమాణాలు, నాన్-ప్రొఫెషనల్ అంశాలు ఎట్సెట్రా… కానీ కొన్ని ప్రొఫెషనల్ టాస్కులు కూడా ఈనాడు మాత్రమే చేయగలదు… ఈనాడును చూసి వాతలు పెట్టుకునే ఆంధ్రజ్యోతికి, సాక్షికి అస్సలు చేతకావు అలాంటి టాస్కులు… మిగతా వాటికి పత్రికల లక్షణాలే లేవు… (తెలుగు మీడియాకు సంబంధించి…) 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని దేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఘనంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే కదా… అదేదో బీజేపీ […]