ఫాఫం… మాకిరెడ్ది అనబడే ఔత్సాహిక కార్టూనిస్టును అనాల్సిన పనేమీ లేదు… పత్రిక ఎడిటోరియల్ లైన్ ఏమిటో, పొలిటికల్ దాస్యం ఏమిటో దానికే కట్టుబడి కార్టూన్లు గీయాలి కదా… లేకపోతే ఈనాడు నుంచి తరిమేస్తారు కదా… అంతటి శ్రీధరుడినే పంపించేశారు, ఈ కొత్త కార్టూనిస్టులు ఎంత..? విషయం ఏమిటంటే..? పత్రిక కథనాలకు దీటుగా కార్టూన్లు కూడా నాసిరకంగా తయారయ్యాయని చెప్పడమే… అప్పుడంటే రామోజీరావు స్వయంగా పత్రిక వ్యవహారాలను చూసుకుంటున్నప్పుడు తను స్వయంగా శ్రీధరో, పాపా కార్టూనిస్టో రోజుకు పది […]
ఈనాడు కార్టూన్‌పై నెటిజన్ల ఫైర్… మోడీని తిట్టుకో, కానీ దేశాన్ని కాదు…
ఇదే ఈనాడు ఓ దశలో మోడీకి విపరీతంగా డప్పుకొట్టింది… చంద్రబాబుతోపాటు తనూ దూరమైంది… అంతే… తన రాగద్వేషాలే తన పాలసీలు… అంతకుమించి తేడా ఏమీ ఉండదు… లోతైన ఆలోచన, జాతికోణంలో సంయమనం వంటివి దానికి పట్టవు… పడితే అది ఈనాడే అనిపించుకోబడదు… మోడీని అనేక అంశాల్లో ఆక్షేపించవచ్చు… తప్పేమీ లేదు… మోడీ విమర్శలకు అతీతుడేమీ కాదు, ఉపేక్షించాల్సిన పనీ లేదు… నోట్ల రద్దు దగ్గర్నుంచి ఆత్మనిర్భర్ దాకా అనేకానేక వైఫల్యాలున్నయ్… అయితే ఒక విమర్శ చేసేముందు ప్రతిపక్షం […]
అదొక విపత్తు… ఆకలి సంక్షోభం… దాని మీద వెకిలి కార్టూన్లు ఏల ఈనాడూ..?
ఈనాడులో వచ్చిన ఓ కార్టూన్ నిజంగా మొత్తం ఈనాడు వ్యవస్థ సిగ్గుపడాలి… కార్టూనిస్టులందరూ శ్రీధర్‌లు కాలేకపోవచ్చు, కొత్త కార్టూనిస్టులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉండవచ్చు, భవిష్యత్తులో ఎదగవచ్చు… కానీ ఒక కార్టూన్ ప్రచురించే ముందు ఎవడూ చూసేవాడు లేడా..? ఎవడికీ సబ్జెక్టు మీద కమాండ్ లేదా..? ఎవడూ అసలు ఏ వార్తల్నీ చదవడం లేదా..? ది గ్రేట్ ఈనాడును బుల్లెట్ రైల్ వేగంతో భ్రష్టుపట్టిస్తున్నారా..? ఉదాహరణ ఈ కార్టూన్… చెప్పాలంటే..? వద్దులెండి, అక్షరనిష్ఠురం..! గీసినవాడు పాపం, కొత్త… తన […]