. Shankar G ….. సినిమా హీరోగా స్థిరపడటానికి నటనే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో కొండంత నటన తెలిసినా అవగింజంత అదృష్టం ఉండాలంటారు కానీ కృష్ణ అనే నటుడుకి కొండంత అదృష్టమే అండగా ఉంది. నటుడి రూపం, నవ్వు, అందం, నడక, హీరోయిజం ఏదైనా కావచ్చు చూసేవాళ్ళను సమ్మోహితులను చేయటానికి. ఆ నటుడిని చూడటం ఒక వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం అతడు నటించిన సినిమా కథ బావుందా లేదా అన్నది అనవసరం… […]
ఎహె, బయటికి వచ్చేశాను అని చెప్పకుండా… క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పాలి…
ఆమధ్య చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న తరువాత త్రిష ఓ పదం వాడింది… పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ పోలేదు… ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేసింది… అది ఓ బ్రహ్మ పదార్థం వంటి, భ్రమ పదార్థం వంటి పదం… సరిగ్గా ఇదీ దాని నిర్వచనం అని ఎవరూ చెప్పలేరు… కాకపోతే సినిమాల్లో ఎవరైనా […]
‘‘హీరో ప్రభాస్ ఎవరు..? నాకు తెలుగులో చినూ భర్త ఒక్కడే తెలుసు..’’
ఓ ఇంగ్లిష్ మెయిన్ స్ట్రీమ్ సైటులో ఓ వార్త చదివి నిజమే కదా అనిపించింది… ఇప్పుడంటే తెలుగు సినిమాలంటే హిందీ వాళ్లకు బాగా తెలిసిపోయింది… తెలుగు హీరోల గురించీ తెలిసింది… ఆస్కార్ దాకా వెళ్లిన తెలుగు సినిమా, హీరోలు, పాటల గురించీ తెలిసింది… కానీ బాహుబలికి ముందు..? హిందీ వాళ్లకు ఎవరూ తెలియదు… వాళ్లకు తెలుగు అంటే జితేంద్ర సినిమాలకు ముడిసరుకు ఇచ్చే ఏదో ఓ అనామక ఫిలిమ్ ఇండస్ట్రీగానే తెలుసు… రేఖ, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి […]
ఆదిలోనే ఆటుపోట్లు… కృష్ణకు మాత్రమే బలమైన నమ్మకం ఉండేది…
సూపర్ స్టార్ కృష్ణ గురించి అవీ ఇవీ సెర్చుతుంటే… అనేకచోట్ల కనిపించింది… కృష్ణ ఒక సినిమా ఎన్నిరోజులు నడుస్తుందో తొలి షో చూసి చెప్పేసేవాడు… పర్‌ఫెక్ట్ అంచనా… నిజమే, చివరకు తన సినిమాల మీద కూడా అంచనాల్ని, జోస్యాల్ని చెప్పి.., అవి నిజమైన సందర్భాలు బోలెడు… కానీ సినిమాల జయాపజయాల గురించి కాదు, ఓ నటుడి కెరీర్ మీద కూడా తన దృక్కోణం, తన అంచనా వేరేగా ఉండేది… ఉదాహరణకు… మహేశ్ బాబు… ఫస్ట్ లీడ్ రోల్ […]
హీరో కృష్ణ నీడ నిష్క్రమించింది… 80 ఏళ్ల వయస్సులో ఇంకా ఒంటరి…
రెండున్నరేళ్ల క్రితం ఆయన ప్రియసతి విజయనిర్మల వెళ్లిపోయింది… మొన్నటి జనవరిలో పెద్ద కొడుకు రమేశ్ బాబు వెళ్లిపోయాడు… ఇప్పుడు సంప్రదాయసతి ఇందిర కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది… ఎనభయ్యేళ్ల వయస్సులో హీరో కృష్ణ చుట్టూ మరింత ఒంటరితనం ఇప్పుడు… కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉంటున్నా సరే, ఇన్నాళ్లూ ఆమె ఉనికి కృష్ణను మానసికంగా స్థిమితంగా ఉంచేది, ఇప్పుడు ఆమె కూడా కృష్ణకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది… ఇందిరకు చిన్న వయస్సులోనే కృష్ణతో పెళ్లిచేశారు… సొంత మామకూతురే… పెళ్లయిన నాలుగేళ్లకే […]
భారీ బడ్జెట్ మూవీలకు డప్పులు… ప్రతి ప్రాజెక్టూ పరేషాన్‌లోనే…
ప్రభాస్ నటించే భారీ ప్రాజెక్టు సాలార్ మీద తనకే అసంతృప్తిగా ఉందట కదా… నిజానికి అదీ అచ్చంగా కేజీఎఫ్ కోసం రాసుకున్న కథలాగే ఉందట… అవే కోలార్ గోల్డ్ మైన్స్… అదే స్టోరీ లైన్… దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ నడుమ ఈ విషయంలోనే విభేదాలు వస్తున్నట్టుగా చెబుతున్నారు… అదే పంథాలో కథ సాగితే ఎవరు చూస్తారనేది ప్రభాస్ సందేహమట… అంతేకాదు, దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె మీద […]
మహేష్ బాబు అర్థరహితమైన వ్యాఖ్య… డ్యామేజీ కంట్రోల్ ప్రయత్నాలు…
మామూలుగా మహేష్ బాబు బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతాడు… ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లలో ఎక్కడైనా సరే మాట తూలడు… వివాదాల జోలికి పోడు… కూల్‌గా, హుందాగా ఉంటాడు… కానీ మొన్న ఓచోట హఠాత్తుగా హిందీ సినిమాలకు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదాన్ని కొనితెచ్చింది… నిజంగానే తన వ్యాఖ్యలు అర్థరహితం… హిందీ సినిమా తనను భరించలేదు అనే వ్యాఖ్య సందర్భరహితం కూడా..! తను ఏ మూడ్‌లో ఉండి, ఏం అనబోయి, ఆ మాటలన్నాడో తెలియదు గానీ, ఆ […]
నువ్వు సూపర్ మహేష్… ఎక్కడా తొణక్కుండా, కూల్‌గా భలే జవాబు చెప్పావ్…
‘‘ఫిల్మ్ బ్యూరో రాధా అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సూపర్ స్టార్’’ అని ఓ వీడియో కనిపించింది… ఇలాంటి వీడియో వార్తల సంగతి తెలుసుకదా… అందుకని మనసులోనే ఆంజనేయస్వామిని ఓసారి పాహిమాం అని ధ్యానించి, చూడ సాహసించి, వీడియో ఓపెన్ చేస్తే… సదరు సూపర్ స్టార్ షాక్ సంగతేమిటో గానీ… నాకు కొన్ని షాక్స్ తగిలాయి… కానీ ఏమాటకామాట… ఆ తిక్క స్క్వేర్ ప్రశ్నకు మహేష్ జవాబు ఇచ్చిన తీరు, తను చూసిన చూపు మాత్రం భలే […]
ఇన్నేళ్లుగా మహేష్ బాబుకు ఈత రాదు… 46 ఏళ్ల వయస్సులో నేర్చుకున్నాడు…
సాధారణంగా సినిమాల్లో హీరోలు అంటేనే… సముద్రాలు ఈదేస్తారు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కేస్తారు… ఒంటి చేత్తో మడత నలగకుండా వందలాది మంది రౌడీలను ఉతికేస్తారు… ఏదంటే అది చేసేస్తారు… అంత సుప్రీం స్టామినా అన్నమాట… తెర మీద వాళ్లకు తెలియని విద్య ఉండదు… కానీ ఒరిజినల్‌గా వాళ్లూ మనుషులే కదా… నానా బలహీనతలు ఉంటయ్… కాకపోతే ఎప్పుడూ తమలోని మైనస్ పాయింట్లు, భయాలు గట్రా బయట ఫోకస్ గాకుండా జాగ్రత్త పడతారు… అది తమ ఇమేజీకి నష్టం […]