సోషల్ మీడియాలో ఒకటే చర్చ… మోడీ మామూలుగా వచ్చి పోడు కదా… ఏదైనా కాస్త చర్చను అంటించి వెళ్తాడు… ఇక మీడియా, సోషల్ మీడియా వదలవు… రకరకాల క్రియేటివ్ ఊహాగానాలు… పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రపంచంలో ఎవరికీ అర్థం కారు… ఇంకేం..? బోలెడు ప్రచారాలు ఆల్రెడీ స్టార్టయ్యాయి… ఇంతకీ జరిగింది ఏమిటి..? చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి మోడీని రమ్మన్నాడు… సరే, పాత కక్షలు ఎన్నున్నా… ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ప్రబలంగా ఉన్నా… ఎవరు […]
హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!
1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]
ఆ పాత మిత్రుల మోడీ తాజా ఆలింగనాలతో బీజేపీకి వచ్చే ఫాయిదా ఎంత..?!
ఏపీలో చంద్రబాబు తెలుగుదేశంతో బీజేపీ పొత్తు ఉండబోతున్నదనే వార్తలు వస్తున్నాయి… ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్‌తో బీజేపీ పొత్తు ఖరారైపోయింది… బిహార్‌లో జేడీయూ నితిశ్ మళ్లీ బీజేపీ పంచన ఆల్రెడీ చేరిపోయాడు… కర్నాటకలో దేవెగౌడ జేడీఎస్ కూడా బీజేపీతో చేతులు కలిపింది… కేరళలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులేకాదు, జాతీయ స్థాయిలో ఇంకా బీజేపీలో చాలామంది చేరుతున్నారు… సొంతంగా 370 సీట్ల సాధన, ఎన్డీయే కూటమిగా 400 సీట్లు అనే టార్గెట్ దిశలో బీజేపీ అన్ని శక్తులూ […]
ఇది రాజకీయ పోస్టు కాదు… ‘పెద్దన్న’ మీద రచ్చ సరైంది కాదు…
ఇది రాజకీయ పోస్టు కాదు.
‘మోడీ అయినా, నేనయినా… మొదట గుజరాతీలం… తరువాతే గ్లోబల్ ఎక్స్‌పోజర్…’
వైఎస్ ముఖ్యమంత్రి… హైదరాబాద్‌లో ప్రవాసీదివస్… అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేకంగా విభాగాలు… ప్రవాస భారతీయులతో తమ రాష్ట్రాల గుడారాల్లో భేటీలు… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడు… దద్దరిల్లిపోయింది… ఏపీ సహా మిగతా అన్ని రాష్ట్రాల గుడారాలు, ముఖ్య నేతల ప్రసంగాలు గట్రా వెలవెలబోయాయి… ఆరోజు నుంచీ మోడీ పెట్టుబడిదారులకు సన్నిహితుడు… గుజరాత్‌కు… ప్రధానిగా సైతం… ఒక వీడియో చూస్తుంటే నాటి హైదరాబాద్ ప్రవాసీ దివస్ గుర్తొచ్చింది… సరే, నిన్నివాళ వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరుగుతోంది కదా… […]
సరె, సర్లే, మోడీ భయ్… గట్ల పోయి వన్ బై టూ చాయ్ తాగొద్దాం పా…
ఏ వచనం? ఏమిటా ఏకవచనం పిలుపు? ఏకవచనం పిలుపు అమర్యాద. బహువచనం పిలుపు గొప్ప గౌరవం. పెద్దవారిని నువ్వు అనకూడదు. మీరు అనాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఏకవచనం పిలుపుల మీద పెద్ద పట్టింపే ఉండదు. రాయలసీమ, తెలంగాణల్లో నిత్యవ్యవహారంలో ఏకవచనం సర్వసాధారణం. కోస్తాలో బహువచనానికే బహు డిమాండు. మీడియా రుద్దిన ప్రామాణిక భాష ప్రభావంతో ఇప్పుడు రాయలసీమ, తెలంగాణల్లో కూడా చాలావరకు “నువ్వు” “మీరు”గా మారింది. వ్యాకరణం ప్రకారం ‘డు’ ఏకవచనం. ఒకడే అయితే క్రియాపదం చివర ‘డు’; […]
NDA లో చేరిక ప్రయత్నాలు, KTR ను సీఎం చేసే ప్రయత్నాలూ నిజమే…
అంతా నిజమే… బీఆర్ఎస్‌లో ఎన్డీయేలో చేరడానికి సంప్రదింపులు నిజం… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నది నిజం… మోడీని ఆశీస్సులు అడిగిన మాట నిజం… మొన్నామధ్య బహిరంగంగానే మోడీ ఈ విషయాన్ని వెల్లడించడం నిజం… మోడీ బయటపెట్టాక కేటీయార్ తీవ్రంగా ఖండించాడు… పొల్లు మాటలు, నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన ఆశీస్సులు దేనికి..? మా ఎమ్మెల్యేలు తలుచుకుంటే అవుతుంది గానీ ఆయనెవరు నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి…. అంటూ సీరియస్‌గా విరుచుకుపడ్డాడు మోడీ మాటలపై… అప్పుడు కూడా కేసీయార్ సైలెంట్… ఒక్కముక్క […]
మోడీపై ఓ అమెరికన్ ఎన్జీవో దిక్కుమాలిన సర్వే… మన లెఫ్ట్ మీడియాకు పండుగ…
మోడీ గురించి అస్సలు వినలేదని 40 శాతం అమెరికన్లు చెప్పారట… అసలు ఆయనపై విశ్వాసం లేదని 37 శాతం మంది చెప్పారట… ఇది ఓ వార్త… ఇలాంటివి ఎక్కువగా కమ్యూనిస్టుల పత్రికల్లోనే కనిపిస్తుంటాయి… అమెరికా, ఇంగ్లండు తదితర ప్రాంతాల్లో కొన్ని దిక్కుమాలిన సర్వే సంస్థలు ఉంటాయి… ఇండియాను బ్యాడ్ లైట్‌లో చూపించేలా పలు సర్వేలను అవి ప్రకటిస్తుంటాయి… మన పత్రికలు కళ్లుమూసుకుని పబ్లిష్ చేసుకుని, చంకలు గుద్దుకుంటుంటాయి… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… క్వాలిటేటివ్ బెటర్ కంట్రీ పేరిట […]
సొంత ఖాతా నుంచి నగదు డ్రా చేసినా సరే… నున్నగా గుండు గొరుగుతున్నారు…
హైదరాబాద్… ఐసీఐసీఐ బ్యాంకు శాఖ… ఓ పెద్ద మనిషి తన బ్యాంకు ఖాతా నుంచి పది లక్షలు డ్రా చేయడానికి చెక్కు రాసి… క్యాషియర్‌కు ఇచ్చాడు… క్యాషియర్ పక్కనే నిల్చున్నతను ఎంత అనడిగాడు… పది అన్నాడు ఈ పెద్ద మనిషి… ఆ పక్క లైన్‌లోకి రా అన్నాడు అతను… రా అనే ఏకవచనంతో ఆ పెద్ద మనిషికి ఎక్కడో చురుక్కుమంది… ఆ చెక్కును అటూ ఇటూ చూసి, ఆ పెద్ద మనిషిని ఎగాదిగా చూసి… ఎందుకింత డబ్బు […]
‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’
Nancharaiah Merugumala…….. రాహుల్ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్ 52 ఏళ్ల బ్యాచిలర్ పై అనర్హత వేటు వేయించారా?……………………………………………………. కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు.. అంటే 2018 జులై 21న రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి ఉన్నారు. అన్ని విధాలా, […]
మోడీకి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కూ లింకేమిటి..? గూగుల్‌తో వైరమేంటి..?
పార్ధసారధి పోట్లూరి ……… మోడి Vs జార్జ్ సోరోస్ అండ్ కంపనీ ! గూగుల్ యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ + లిథియం ! చేజారిపోతున్న భారీ ఆదాయం ఇవ్వగల ఒక్కో అవకాశం వెరసి అమెరికా వెనక ఉండి నడిపిస్తున్న డ్రామా ! పైకి కనపడేది వేరు, లోలోపల జరుగుతున్నది వేరు! పేరు జార్జ్ సోరోస్ దే అయినా ఫైనల్ గా రంగంలోకి దిగేది ఐరోపా సమాజం మరియు అమెరికా ! 140 కోట్లు జనాభా కల భారత […]