అయోధ్యలో రాముడి గుడి కట్టాం… ఆర్టికల్ 370 ఎత్తేశాం… ఇన్‌స్టంట్ ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం… పౌరసత్వ సవరణ చట్టం తెచ్చాం… సర్జికల్ స్ట్రయిక్స్ చేశాం… నిజానికి పోలింగ్ హీట్ పెరిగేకొద్దీ బీజేపీ నాయకుల నుంచి ఈ మాటలు పెద్దగా వినిపించలేదు, వినిపించడం లేదు… కొత్త కొత్త ఎజెండా వైపు ప్రచారం మళ్లిపోయింది… ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు వంటి అంశాలవైపు బీజేపీని కార్నర్ చేయడం మొదలుపెట్టిందో బీజేపీకి తన విజయాల ప్రచారంకన్నా […]
ఏపీ పొత్తుల ప్రాతిపదిక జస్ట్ ప్రస్తుత అవసరాలే… సిద్ధాంతాల్లేవ్, రాద్దాంతాల్లేవ్…
జాతీయ పార్టీలను వదిలేస్తే… ప్రాంతీయ పార్టీల కోణంలో… కేవలం ఆయా పార్టీల అధినేతలు, కుటుంబాల అవసరాలను బట్టి సిద్ధాంతాలుంటయ్… రాజీలుంటయ్… కాళ్ల బేరాలుంటయ్… సాగిలబడటాలుంటయ్… ఏసీబీలు, ఈడీలు, సీబీఐలు కన్నెర్ర చేస్తే నడుంలు మరింత వంగిపోతయ్… పొత్తులకూ అంతే… ఎవరి అవసరం వాళ్లది… చివరకు జాతీయ పార్టీలు సైతం నంబర్లాటలో పైచేయి కోసం ప్రాంతీయ పార్టీలో ‘కుమ్మక్కు’ కావడం మన రాజకీయ విషాదం… చంద్రబాబు వంటి అత్యంత విశ్వాసరహితుడితో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటనేది తాజా ప్రశ్న… […]