మేం తలవంచమని మీకు తెలుసు… మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించేది అందం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం…… ఇది బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తాజా సీజన్ తాలూకు ప్రోమోలో మొదటి డైలాగ్… అది వింటుంటే చంద్రబాబు జైలు, తెలుగుదేశం ఆందోళనలు, కోర్టుల్లో పోరాటాలు, కార్యకర్తల ఆరాటాలు గట్రా గుర్తొస్తున్నాయా..? అబ్బే, ఇది కామన్ అన్‌స్టాపబుల్ డైలాగే అంటారా..? సరే… సినిమాలో ఐనా, లైఫులో ఐనా అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు… సర్వం నాశనం చేయడానికి బయల్దేరతాడు… […]
బాలయ్య బ్రాండ్ వాల్యూ పెరిగింది… ఓటీటీ, యాడ్స్‌కూ బాలయ్య వ్యాపించాడు…
ఒక్కొక్క సినిమాయే ఫట్‌మని పేలిపోయాయి… చివరకు ఏ గొప్ప నటుడికి వారసుడిగా తెరపైకి వచ్చాడో ఆయన బయోపిక్స్ రెండూ బోల్తా కొట్టాయి… వయస్సు పెరుగుతోంది… కొత్తతరం వస్తోంది… ఇక బాలకృష్ణ కెరీర్ ముగింపుకు వస్తోంది అనుకున్నదశలో అఖండ తనకు ఓ పునరుజ్జీవం… ఆ సినిమాలోనూ బాలకృష్ణ మార్క్ వికారాలు కొన్ని ఉన్నా సరే, నయా అఘోరా పాత్ర తనకు సరిగ్గా సూటైంది… తన మార్కెట్ మళ్లీ ఒక్కసారిగా బుల్ దశలోకి వచ్చేసింది… అదే ఊపుతో వీరసింహారెడ్డి వచ్చి, […]