ఒక సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌లా అనిపించలేదు… ఓ ఆధ్యాత్మిక సభలా జరిగింది… మొదటి నుంచీ జైశ్రీరామ్ అనే నినాదాలను హోరెత్తించారు… ఆదిపురుష్ ప్రతి షోలో, ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని నిర్మాతలతో ప్రకటింపచేశారు… హీరో ప్రభాస్ కూడా పదే పదే జైశ్రీరామ్ అని స్లోగన్స్ ఇచ్చాడు… చినజియ్యర్ రాక కూడా ఇదేదో సినిమా ఫంక్షన్ అన్నట్టు గాకుండా రామకార్యంలా కనిపించింది… అదీ తిరుపతిలో నిర్వహించడం కూడా… ఎందుకిలా..? అవసరం..! ఆదిపురుష్‌పై మొదటి […]
మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
బహుశా ఈ దేశ ప్రేక్షకులు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ను తిట్టినంతంగా మరే దర్శకుడినీ తిట్టి ఉండరు… అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఆదిపురుష్ సినిమా ట్రెయిలర్ల దగ్గర నుంచీ విమర్శల జోరు ఆగలేదు… యానిమేషన్ సినిమాల నుంచి కొన్ని సీన్లను యథాతథంగా తీసుకుని, ఆదిపురుష్‌లో పేస్ట్ చేసేశాడు… ట్రోలింగ్, విమర్శలు, తిట్ల ధాటికి దడుచుకుని… గ్రాఫిక్స్ మెరుగుపరుస్తాను, మరో రెండొందల కోట్లు ఇవ్వండి అంటూ ఓం రౌత్ కొన్నాళ్లు మాయం… అసలే 500 కోట్ల బడ్జెట్ […]
సినిమా ఆదిపురుషుడు కదా… నీలమేఘ శ్యాముడు కాస్తా స్వర్ణరాముడయ్యాడు…
రాముడు, కృష్ణుడు నల్లని వారు, నీల మేఘ శ్యాముడన్న (నీల అంటే సంస్కృతంలో నలుపు) పేరిట పిలుస్తారు కదా. మన సినిమాల్లో మాత్రం రాముడు, కృష్ణుడి వేషధారులకు ఎందుకు నీలం రంగుతో మేకప్ చేస్తారు? నీలమేఘము అంటే నీటితో నిండి ఉన్న మేఘము అని అర్థం. నీళ్ళతో నిండిన మేఘం నల్లగా ఉంటుంది… ఈ ప్రశ్న, ఈ సందేహం చాలామందిలో ఉన్నదే… ప్రవచనకారులు కూడా ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెబుతారు… మన సౌత్ ఇండియన్ సినిమాల్లో […]
600 కోట్లతో ‘‘ముంచేసినట్టే’’… గ్రాఫిక్స్ కాదు, చేయాల్సింది కంటెంటు రిపేర్లు…!
అందరూ ఆదిపురుష్ సినిమా ఆరు నెలలు వాయిదా పడింది… మరో 100 కోట్లు బొక్క అని రాసేస్తున్నారు… సినిమాకు గ్రాఫిక్ రిపేర్లు చేయించాలని చెబుతున్నారు… కానీ నిజానికి చెప్పాల్సింది అది కాదు… గ్రాఫిక్స్ కాదు, అసలు కంటెంటుకే రిపేర్లు అవసరం… ఇప్పుడున్న స్థితిలో ఆదిపురుష్ గనుక రిలీజ్ చేస్తే దర్శకుడు ఓం రౌత్‌ను ఎక్కడైనా కట్టేసి కొడతారేమో… అసలు ఇలాంటి పిచ్చోడిని పట్టుకుని టీ-సీరీస్ వాళ్లు 500 కోట్ల బడ్జెట్ పెట్టడం ఏమిటి..? ప్రభాస్ గుడ్డిగా, అసలు […]
ఓహో… రాముడు విలుకాడా..? ఆంధ్రజ్యోతిలో అబ్బురపరిచే ఆవిష్కరణ..!!
ఏదైనా వివాదం తలెత్తితే చాలు… అంటే సందు దొరికితే చాలు… దూరిపోయి, పొక్క పెద్దది చేసి… వీలైతే ట్యాంకర్ పెట్రోల్ పోసి, తమ స్వప్రయోజనాలు చూసుకునే బ్యాచ్ బోలెడు మంది..! అయితే దాన్ని చిల్లర పంచాయితీల్లా చేసేసేవాళ్లూ ఉంటారు… ఇది అలాంటిదే… అప్పట్లో, 14 ఏళ్ల క్రితం ముంబైలోని వానరసేన స్టూడియోస్ అనే సంస్థ రాముడిని విలుకాడిగా చూపిస్తూ ఏదో చిత్రం రూపొందించిందట… అసలు అలా ఏ ఇతర కామిక్స్‌లో గానీ, చిత్రాలలో గానీ చూపించలేదుట… అసలు […]
ఆ దర్శకుడు చిన్నప్పుడు కనీసం బొమ్మల పుస్తకాలూ చదవనట్టున్నాడు..!!
Priyadarshini Krishna……….. చిన్నప్పుడే కామిక్ పుస్తకాల కథలతో నీతి పాఠాలు, చరిత్ర, పురాణేతిహాసాలు చదివించేది మా అమ్మ… నిజానికి నాకు ఈ మాత్రమైన తెలుగు హింది ఇంగ్లీష్ భాషలు రావడం, ఇంకా పురాణ పాత్రలపై అవగాహన వచ్చిందంటే కేవలం చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు అన్నిటికంటే ఎక్కువగా అమరచిత్ర వారి సీరిస్ అండ్ టింకిల్….. అమరచిత్ర కథల సీరీస్‌లోని రామాయణం, మహాభారతం పూర్తి సీరీస్ నాన్న బైండ్ చేయించారు. సెలవుల్లో అవి చదువుకోవడం ఒక యాక్టివిటీ…. అంతటి పిల్లల పుస్తకాల్లో […]
ఓహో… రాముడికి జంధ్యం ఉండొద్దా..? ఈ వితండ వాదమేంది తల్లీ..?!
మొత్తానికి చెత్తా టీజర్, చెత్తా యానిమేషన్ అని విమర్శలకు గురవుతున్న ఆదిపురుష్ వేషాలు చినికి చినికి గాలివాన అయ్యేట్టు కనిపిస్తున్నాయి… హార్డ్ కోర్ హిందుత్వ వాది, మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా తెర మీదకు వచ్చాడు… అబ్బే, ఆ టీజర్‌లో హనుమంతుడి వేషధారణ బాగాలేదోయ్, ఆ సీన్లు సినిమాలో మాత్రం కనిపించకూడదు మరి, తరువాత మీ ఇష్టం అంటూ దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నాడట… తనే చెప్పాడు… టీజర్‌లో హనుమంతుడు లెదర్‌తో చేసిన అంగవస్త్రం, […]
రజినీకాంత్‌కే చేతులుమూతులు కాలినయ్… ఐనా ఆదిపురుష్‌కు ఏమిటీ ధీమా..?!
బహుశా ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్‌ను గుడ్డిగా నమ్మి ఉండవచ్చు… లేదా కాల్షీట్లు చాలా తక్కువ ఇచ్చి ఉండవచ్చు… మరేం చేయాలి దర్శకుడు… గ్రాఫిక్స్‌తో కథ నడిపించేయాలి… మైండ్ కూడా డిస్టర్బ్ అయినట్టుంది… ఆ సైఫ్ వేషమే దానికి ఉదాహరణ… ఆ గబ్బిల వాహనం ఏమిటో… మాంచి మోడరన్ హెయిర్ కటింగ్ ఏమిటో… గడ్డం, మీసాలతో కాస్త బిన్ లాడెన్ లుక్ ఏమిటో తనకే తెలియాలి… గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉన్నయ్… బోలెడు మంది మీమ్స్‌తోనే కాదు, […]
భారీ బడ్జెట్ మూవీలకు డప్పులు… ప్రతి ప్రాజెక్టూ పరేషాన్‌లోనే…
ప్రభాస్ నటించే భారీ ప్రాజెక్టు సాలార్ మీద తనకే అసంతృప్తిగా ఉందట కదా… నిజానికి అదీ అచ్చంగా కేజీఎఫ్ కోసం రాసుకున్న కథలాగే ఉందట… అవే కోలార్ గోల్డ్ మైన్స్… అదే స్టోరీ లైన్… దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ నడుమ ఈ విషయంలోనే విభేదాలు వస్తున్నట్టుగా చెబుతున్నారు… అదే పంథాలో కథ సాగితే ఎవరు చూస్తారనేది ప్రభాస్ సందేహమట… అంతేకాదు, దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ప్రతిష్టాత్మకంగా, భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె మీద […]