సినిమా సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది… చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు అని..! సరదాగా బాగానే ఉంది కానీ చాలామంది కంగనా రనౌత్‌ను నాలుగో నంబర్ చంద్రముఖిగా చెబుతున్నారు… అదీ బ్లండర్… ఆమె త్వరలో విడుదల కాబోయే చంద్రముఖి-2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది… నటిగా ఆమె మెరిట్‌కు వంక పెట్టలేం… కాకపోతే ఆమె సౌత్ సినిమాల్లో నటించి ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… ఈ సినిమా రిజల్ట్ చూడాలిక… దెయ్యం, […]
లారెన్స్ సాహసించిన నాన్-కాంచన టైప్ మూవీ… ఉత్త రొటీన్ దంచుడే…
నాకు లారెన్స్ అంటే ముచ్చటేస్తుంది… రాఘవేంద్రుడి మహత్తుతో బ్రెయిన్ కేన్సర్ నుంచి బయటపడ్డాననే భక్తితో తన పేరులో రాఘవ కూడా కలుపుకున్నాడు… ప్రభుదేవాకు దీటైన డాన్సర్… ఎవరెలా పోతేనేం, తనకంటూ ఓ సెక్షన్ ప్రేక్షకులుంటారు… కాంచన టైపు థ్రిల్లర్లు అలా అలా అలవోకగా తీసేసి వదులుతాడు… చూసేవాడు చూస్తాడు… మినిమం గ్యారంటీ సినిమాలు… ఎప్పుడూ ఏదో టీవీ చానెల్‌లో కాంచనలు కనిపిస్తూనే ఉంటయ్… నిజానికి ఇది కాదు తన మీద అభిమానానికి కారణం… సమాజం మీద కన్సర్న్… […]