.
తమన్నా, కాజల్ అగర్వాల్… క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో ఇరుక్కున్నారు… పోలీసులు ప్రశ్నిస్తున్నారు… ఈ వార్తలు చాలా తెలుగు సైట్లలో కనిపిస్తున్నాయి… సెలబ్రిటీలు కదా, పైగా పాపులర్ పర్సనాలిటీస్…
కానీ ఈ క్రిప్టోకరెన్సీ కేసు పాతదే… 2024లోనే ఈడీ వాళ్లను విచారణకు పిలిచింది… కానీ నిందితులుగా కాదు… స్కామ్, బాధ్యుల మరిన్ని వివరాల కోసం..! అంతేతప్ప వాళ్లు చేసిన నేరం కాదు, ఆ స్కామ్ చేసిన కంపెనీ వీళ్లది కాదు…
Ads
2022లో అనుకుంటా… ఓ కంపెనీ మీరు పెట్టుబడులు పెట్టండి, మస్తు లాభాలొస్తాయి అని నమ్మబలికి ప్రజల నుంచి కోట్లకుకోట్లు వసూలు చేసింది… 2.4 కోట్లు అలా నష్టపోయిన ఓ పదిమంది పుదుచ్చేరి బాధితులు కేసు ఫైల్ చేశారు…
తమ ఫ్రాడ్ సజావుగా, బాగా అమలయ్యేందుకు వీలుగా ఆ కంపెనీ నిర్వాహకులు గ్రాండ్ పార్టీలు అరేంజ్ చేశారు… తమన్నాకు 25 లక్షలు, కాజల్‌కు 18 లక్షలు ఇచ్చి అందులో పార్టిసిపేట్ చేయించారు… 100 కార్లనూ ఇప్పించారు పెట్టుబడిదార్లకు… తరువాత ముంబైలో ఓ క్రూయిజ్‌లోనూ పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేశారు…
సో, సినిమా సెలబ్రిటీలను చూసి, నమ్మి మేం ఈ స్కామ్‌లో ఇరుక్కున్నాం, పెట్టుబడులు పెట్టాం అనేది బాధితుల ఆరోపణ… వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేస్తే కేసుకు బలం, ప్రచారం వస్తాయనీ, ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందనే భావన కావచ్చు…
ఐతే ఈ ఇద్దరు తారలూ పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే… ఓ ప్రోగ్రామ్‌కు ఎవరో బుక్ చేసుకున్నారు, వెళ్లారు… జస్ట్, రిబ్బన్ కటింగ్ యవ్వారంలాగే… డబ్బు ముట్టిందా, వెళ్లామా, వచ్చామా… అంతే… వాళ్లేమీ ఆ కంపెనీకి ప్రచారకర్తలు కారు, బ్రాండ్ అంబాసిడర్లు కారు, బుక్ చేయడానికి… కంపెనీ వీళ్ల పేర్లు, బొమ్మలు వాడుకుని వేల మంది నుంచి డబ్బు కొట్టేశారు… అదీ ఈక్రైం కేసు కహానీ…
ఈడీ పిలిచింది కూడా వాళ్ల నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి మాత్రమే… నిందితులుగా కాదు… వాళ్లు ఇందులో చేసిన నేరమూ ఏమీలేదు… ఆ కంపెనీ గురించి, ఆ కరెన్సీ గురించి వాళ్లకు తెలిసి చస్తే కదా… కాకపోతే వాళ్ల మేనేజర్లు తెలివైనవాళ్లు అయితే చెప్పి ఉండాల్సింది… వాళ్లకూ కమీషన్లు తప్ప ఇంకేం తెలుసు..?
కాకపోతే ఈ కేసు టీవీ, సినిమా సెలబ్రిటీలందరికీ ఓ గుణపాఠం… అడిగిన డబ్బు ఇచ్చారు, వెళ్లాలని గాకుండా… ఆయా కంపెనీల పూర్వాపరాలేమిటో కాస్త తెలుసుకుంటే ఈ ఈడీల నోటీసులు, పోలీసు కేసులు, విచారణ తలనొప్పులు ఉండవు… లాయర్ల ఖర్చులూ ఉండవు…! స్కిన్ టోన్, లుక్ మాత్రమే కాదు, దిమాక్‌లో చటాక్ అవసరం అని..!!
Share this Article