కలిసి సర్కారు ఏర్పాటు చేసి నాలుగు రోజులయ్యాయో లేదో… అప్పుడే కాంగ్రెస్‌కూ, స్టాలిన్‌కూ నడుమ సురసుర…! అఫ్ కోర్స్, భాగస్వామ్య పక్షాలు అన్నాక అన్నింటా ఏకాభిప్రాయం ఉండాలని ఏమీలేదు, ప్రణయకలహాలు, పరిణయకలహాలు ఉండొద్దని కూడా ఏమీ లేదు… అయితే ఏ విషయంలో అనేది కాస్త ఇంట్రస్టింగు… నిన్న రాజీవ్ గాంధీ వర్ధంతి… ఆయన హత్యకు గురైంది కూడా తమిళనాడులోనే… హంతకులైన టైగర్లకు డీఎంకే ఫుల్ సపోర్ట్ అనే అభిప్రాయం ఎన్నో ఏళ్లుగా ఉన్నదే, చూస్తున్నదే… ఓ దశలో డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం రద్దుచేసి పారేసింది కూడా… ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే… రాజీవ్ హంతకుల్ని జైలు నుంచి విడుదల చేయాలని స్టాలిన్ రాష్ట్రపతికి లేఖ రాయడం తాజా వివాదమూలం…
అప్పట్లో 26 మంది మీద కేసులు పెడితే 19 మంది విడుదలైపోయారు… మిగతా ఏడుగురు జైలులోనే ఉన్నారు 30 ఏళ్లుగా…! మొదట ఉరిశిక్ష అన్నారు, తరువాత దాన్ని మార్చి… చచ్చేదాకా జైలు అని మార్చారు… సాధారణంగా యావజ్జీవశిక్ష అయితే రెమిషన్లతో కలిపి ఏ పద్నాలుగేళ్లకో విడుదల అవుతారు… కానీ ఈ కేసులో రాజ్యం భావించింది వేరు… ‘‘ఓ ప్రధాని స్థాయి నేతను చంపిన వాడిని కూడా క్షమించేస్తే ఇక రాజ్యానికి ఉండాల్సిన అభిమానం, కసి, కట్టుబాటు, గౌరవం ఏమున్నట్టు..?’’ అనుకుంది… అందుకే ఎన్నిరకాల ఒత్తిళ్లు వచ్చినా.., ఏ పార్టీ ఏం డిమాండ్ చేసినా… కుదరలేదు… కోర్టులు కూడా దానికే స్టికాన్ అయి ఉన్నయ్… చివరకు హతుడి భార్య సోనియా, పిల్లలు రాహుల్, ప్రియాంక కూడా హంతకుల్ని క్షమిస్తున్నామని ప్రకటించినా సరే… రాజ్యం తన ధోరణికే కట్టుబడి ఉండిపోయింది… చివరకు పదేళ్లు సోనియా రాజ్యమే నడిచినా సరే, ఆ హంతకుల విడుదల సాధ్యం కాలేదు… కొన్ని అంశాల్లో అంతే… సాధ్యం కాదు…
Ads
ఇప్పుడు డీఎంకే ప్రభుత్వం వచ్చింది… డీఎంకే సహజంగానే కాస్త టైగర్ల పక్షం… వాళ్లు ఇప్పటికే 30 ఏళ్లుగా జైలులో మగ్గుతున్నారు కదా, శిక్ష సరిపోతుంది అనేది డీఎంకే స్టాండ్… కానీ తనంతట తను నిర్ణయం తీసుకునే కేసు కాదు ఇది… అందుకే రాష్ట్రపతికి లేఖ రాశాడు స్టాలిన్… అది ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అళగిరికి నచ్చలేదు… కాంగ్రెస్ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో నెగెటివ్‌గా రియాక్టయింది… ‘‘నో, నో, స్టాలిన్ లేఖ కరెక్టు పద్ధతి కాదు… 26 మందిలో 19 మందిని విడుదల చేసింది కోర్టు, కాంగ్రెస్ వ్యతిరేకించలేదు… మిగతా ఏడుగురి మీద కూడా కోర్టే ఏదో ఒక నిర్ణయం తీసుకోనివ్వాలి… మేం దానికి కట్టుబడి ఉంటాం… ఇలాంటి ఇష్యూస్‌లో రాజకీయ ఒత్తిళ్లు సరైన ధోరణి కాదు… 25 ఏళ్లు దాటి జైళ్లలో మగ్గుతున్నవాళ్లు తమిళనాడులోనే 100 మంది ఉంటారు, మరి వాళ్లను వదిలి ఈ ఏడుగురిపైనే ప్రేమ ఏమిటి..?’’ అని రుసరుసలాడాడు మీడియా ఎదుట… ఎంతైనా పొత్తు పార్టీ కదా, డీఎంకే కౌంటర్ చేయకుండా, సైలెంటుగా ఉండిపోయింది… కోల్డ్ బ్లడెడ్ మర్డర్లు చేసిన వాళ్లనే కొన్నేళ్లలో రిలీజ్ చేస్తున్నది మన సిస్టం… ఈ ఏడుగురినీ ఎందుకు చేయదు… ఇది ఓ పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు…!!
Share this Article