Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తానాకు కొత్త కార్యవర్గం… ఎన్నికలు లేకుండా రాజీమార్గంలో ఎంపికలు…

July 11, 2023 by M S R

తానా ఎన్నికలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో Chennuri V Subba Row… పోస్ట్ ఆసక్తికరంగా ఉంది… అందులో ఆశ్చర్యపరిచిన వాక్యం ఏమిటంటే… మొన్నటిదాకా 36 వేల మంది సభ్యులున్న తానాలో ఇప్పుడు 70 వేల మంది ఉన్నారనేది… సరే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ అని ఆ పోస్టులో రాయబడిన వాక్యం నిజమో కాదో తెలియదు గానీ తానా అంటే తానాయే… అమెరికాలో కులాల వారీ, ప్రాంతాల వారీ వేర్వేరు సంఘాలు పెట్టుకున్నారు…

వాటినీ తేలికగా తీసిపారేయలేం గానీ తానా ఇంపార్టెన్స్‌ను గుర్తించక తప్పదు… చాలామంది ఆరోపిస్తున్నట్టుగా తానా పర్టిక్యులర్‌గా ఒక కులం గుప్పిట్లో ఉన్నదనే విషయాన్ని కాసేపు విస్మరిస్తే, అమెరికాలోని మన ప్రవాసాంధ్రులకు ఈ ఆర్గనైజేషన్ సేవల్ని చులకనగా చూడలేం… ఈమధ్య 3 రోజులపాటు తానా 23వ మహాసభలు నిర్వహించారు కదా… దాదాపు 18 వేల మంది హాజరైనట్టు నిర్వాహకులు చెబుతున్నారు… చాలా పెద్ద సంఖ్య… ప్రవాసాంధ్రులు తానాను ఓన్ చేసుకున్న తీరుకు, మనవాళ్లు సంఘటితమవుతున్న తీరుకు ఆ సంఖ్యే ఓ ఉదాహరణ…

ఇళయరాజా పైత్యం గురించి కొంత చర్చ జరగడం మినహా స్థూలంగా తానా సభలు బాగా జరిగినట్టు లెక్క… తానా ఎన్నికల గురించి ఆయన తన పోస్టులో చెప్పిన వివరాలు ఇలా ఉన్నయ్… ‘‘ఈ సంవత్సరం జరగాల్సిన ఎన్నికల విషయంలో ఇరు వర్గాలు మేరీల్యాండ్ కోర్ట్ ని ఆశ్రయించటం, ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవటం, ఎన్నికలు జరగక పోవటం తానా సభ్యుల కు తెలిసిన విషయం. ఇంకా చెప్పాలంటే ఎన్నికలు జరగక పొతే.. కొత్త కార్య వర్గం రాక పొతే జరిగే పరిణామాలు ( రాజ్యాంగ సంక్షోభం ) గురించి సీనియర్ లేదా సీరియస్ తానా సభ్యులు మాత్రమే వర్రీ అవుతున్న సంగతి కొందరికే తెలుసు. తానా కు గత కొద్దీ నెలలు గా పట్టిన గ్రహాణం ఈ రోజు జరిగిన బోర్డు మీటింగ్ లో తీసుకొన్న తీర్మానాలతో పూర్తి గా విడిచింది అనే చెప్పాలి.

Ads

గత 30-40 రోజులుగా ఎం జరుగుతోంది?

తానా ఎన్నికల విషయం లో … కొత్త గా చేరిన సభ్యులకు వోట్ హక్కు ఇచ్చే విషయం లో ఇరు వర్గాలు కోర్టుకి వెళ్ళటం వలన ఎన్నికల నిర్వహణ ఆగి పోయింది. తానా రాజ్యాంగం ప్రకారం అప్పటికే 2 సంవత్సరాల క్రితం ఎన్నికైన ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, 2- 3 నెలల క్రితం ఎన్నికైన కార్య వర్గ సభ్యులతో, తానా మహా సభాల చివరి రోజున తన బాధ్యతలు చేపడుతారు. ఈ సంవత్సరం కార్య వర్గ ఎన్నికలు జరగ లేదు. ప్రస్తుత కార్య వర్గం ( అంజయ్య చౌదరి టీమ్) కాల పరిమితి ( duration) పెంచాలంటే బోర్డ్ లో 2/3 మెజారిటీ తో ఆమోదం పొందాలి కనుక ఆ పని చెయ్యలేక పోయింది. మరి ఎలా?? దీనినే రాజ్యాంగ సంక్షోభం అంటారు.

అప్పుడు తానా పెద్దలు జయరామ్ కోమటి, నాదెండ్ల గంగాధర్, జంపాల చౌదరి ఇరు వర్గాల మధ్య సంధి సమావేశాలు నిర్వహించటం మొదలు పెట్టారు. తానా లో భీష్ముడి లాంటి డా.బండ్ల హనుమయ్య ప్రస్తుతం బోర్డు చైర్మన్ గా ఉండటం వలన కూడా రాజి ప్రయత్నాలు సెమి ఫార్మల్ గా జరగటం మొదలు అయ్యాయి. ఎన్నికలు జరిపి ప్రజా స్వామ్య బద్దంగా నాయకులు రావటం మంచి విషయమే.. హర్షణీయం.. గౌరవ నీయం కూడా.. అయితే తానా లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఇలాంటి విపత్కర పరిస్తితి నుంచి బయట పడాలంటే… ఎన్నికలు లేకుండా ఇరు వర్గాలు రాజి పడి ముందుకు వెళ్ళాలని చెప్పారు.

Dr నరేన్ కొడాలి వర్గం, నిరంజన్ శృంగవరపు వర్గం కూడా అందుకు సమ్మతించి రాజి చర్చలకు ముందుకు వచ్చారు. జయ్ తాళ్లూరి, సతీష్ వేమన లాంటి సీనియర్లు కూడా ఇలా వెళ్ళటమే పరిష్కారం అని ఇరు వైపులా సూచించారు. రాజి మార్గం అంటే ఇరు వైపులా కొందరు పోటీదారులు తప్పుకోవాలి. అలాగే ఆ పేర్లు ఇరు వర్గాలు వప్పు కోవాలి. ఇది ఒక రోజులో , ఒక మీటింగ్ లో తేలే విషయం కూడా కాదు. ఆ విధంగా అనేక ఫార్మల్ టెలి కాన్ఫరెన్స్ లు, ఇన్ఫార్మల్ ఫోన్ డిస్కషన్స్ లతో, మెల్ల మెల్ల గా ఇరు వర్గాలకు ఆమోద యోగ్యమైన సభ్యుల సెలక్షన్ ( ఎలక్షన్ కి బదులు గా) జరుగుతూ వుంది.

ఈ రోజు ( 10 జులై 2023) న ఏం జరిగింది?

ఇరు వర్గాలు మాట్లాడుకొని ఆమోద యోగ్యమైన సభ్యులతో ఒక కార్య వర్గం ఏర్పడటం ఒక ఎత్తు అయితే… ఆ కార్య వర్గం ఎన్నిక అయినట్టు ప్రకటించాలి అంటే తానా బోర్డు ఆమోదించాలి. బోర్డు సమావేశం తానా సభల ముందు జరిగితే … సభల నిర్వహణ కి ఏమన్నా ఇబ్బంది రావచ్చు అని ఆ సమావేశాన్ని ఈ రోజు ( 10 జులై 2023) న హోటల్ మారియట్ లో జరిపారు. కొత్త కార్య వర్గాన్ని బోర్డు లో ప్రవేశ పెట్టి 2/3 మెజారిటీ తో పాస్ అయ్యేలా చూసుకొన్నారు. ఆ విధం గా వచ్చిన కార్య వర్గ వివరాలు ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు.

చివరి మాట… ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు తయారు అయి, విరమించుకోవడం వలన కొందరు నాయకులు , వారి స్నేహితులు నిరుత్సాహ పడవచ్చు. ఆవేశ పడవచ్చు. కానీ తానా సంస్థ ని తల్లి గా భావించి , తల్లి ఆరోగ్యం ముఖ్యం అని ముందుకు వెళ్ళాలి అందరు అనుకోవడం ఒక శుభ పరిణామం. ఎన్నికలలో పోటీ కి దిగిన నాయకులు అందరూ ఇప్పటికే తమ టైమ్ ని, డబ్భు ని ఖర్చు పెట్టారు. ఈ పద్దతి లో బోలెడు డబ్బు వృధా కాకుండా మిగిలింది. తానా సంస్థ కి కూడా ఎన్నికల నిర్వహణ భారం పోయింది. కొన్ని వేల ( లేదా లక్షల) డాలర్ల ఖర్చు మిగిలింది.

నిన్న రాత్రి ( 9 జులై న) బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు , కొత్తగా 2025-27 కి అధ్యక్షుడి గా వస్తున్న డా నరేన్ కోడాలి ఇద్దరు అందరికి తెలిసిన నాయకులు. ఇద్దరూ సౌమ్యులు గా పేరు పొందిన వారు. ఇద్దరూ కలిసి ఇరు వర్గాల నుంచి వచ్చిన కార్య వర్గ సభ్యులతో తానా ని ముందుకు తీసుకెళ్లాల్సిన భాద్యత ఇద్దరి మీద వుంది. ఇప్పటి వరకు 36000 మంది సభ్యులతో వున్న తానా ఇప్పుడు 70000 మంది సభ్యులతో ప్రపంచం లోనే అతి పెద్ద organisation గా మారిన తానా సంస్థ ను ముందుకు తీసుకెళ్లే అవకాశం , అదృష్టం వచ్చింది. తానా ను ముందుకు తీసుకెళ్ళాలి. అలా స్నేహ భావం తో ముందుకు వెళ్లాల్సింది గా మా కోరిక.. విన్నపం……

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!
  • నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…
  • పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…
  • ‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…
  • నాటకాలు, సినిమాలు… రచన, నటన… విసు ఓ తమిళ దాసరి…
  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions