Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తాతినేని అనగానే గుర్తొచ్చేది యమగోల… అబ్బో, ఆ స్టెప్పులు, ఆ పాటలు…

April 20, 2022 by M S R

నాకెందుకో తాతినేని రామారావు అనగానే జస్ట్, యమగోల గుర్తొస్తుంది… ఆయన ఖాతాలో అరవయ్యో, డెబ్బయ్యో సినిమాలు ఉండవచ్చుగాక… చాలావరకు హిందీ సినిమాలకే పరిమితమయ్యాడు ఆయన… నిజానికి ఆ యమగోల సినిమాకు సంబంధించి కూడా ఎన్టీయార్‌కు ఆయనపై పెద్ద విశ్వాసం ఉండేది కాదు… కానీ అది సూపర్ డూపర్ బంపర్ హిట్…

ఆగండాగండి… ఆ సినిమా ఏదో ఫన్ బేస్డ్ సినిమా… కానీ ఫుల్లు వెగటు భంగిమలు, శృంగార గీతాలు… మరీ అర్ధరాత్రి దాటాక జాతరల్లో వేసే రికార్డింగ్ డాన్సుల తరహాలో… పాపం శమించుగాక… దాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చుగాక… పైగా ఎస్పీ బాలు భాషలో చెప్పాలంటే… ఎన్టీయార్ ఇనుప లవ్వు… ఓలమ్మీ తిక్కరేగిందా..? గుడివాడ వెళ్లాను… చిలక కొట్టుడు కొడితే… వయస్సు ముసురుకొస్తున్నదీ… వీటిల్లో వయస్సు పాట వదిలేస్తే (అది ఆయన రాయలేదు… సమరానికి నేడే అనే పాట శ్రీశ్రీ రాశాడు… DV నరసరాజు మాటలు) మిగతా వాటిల్లో రసవేటూరి కలం తిక్కతిక్కగా నర్తించేస్తుంది…

yamagola

Ads

ఈ ఫోటువ బాలయ్య నటించిన కథానాయకుడు అనే ఎన్టీయార్ భయోపిక్ సినిమాలోనిది… అచ్చు ఎన్టీయార్‌లాగే ఇనుప లవ్వర్‌గా భలే కనిపించాడు… సరేగానీ, తాతినేని రామారావు గురించి సీనియర్ జర్నలిస్టు Bharadwaja Rangavajhala షేర్ చేసుకున్న సంగతులు ఏమిటంటే…



తాతినేని రామారావు కూడా క‌న్నుమూశారు … కృష్ణా జిల్లా క‌పిలేశ్వ‌ర‌పురం నుంచీ ఇండ‌స్ట్రీకి వెళ్లిన రామారావుకి ఆశ్ర‌యం క‌ల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంక‌ట సుబ్బారావు. ఇల్ల‌రికం సినిమా టైముకి తాతినేని ప్ర‌కాశ‌రావుగారి ద‌గ్గ‌ర చేరిన రామారావు గారు .. అటు త‌ర్వాత ప్ర‌త్య‌గాత్మ‌తో కొన‌సాగారు.

పిఎపి బ్యాన‌ర్ లో ఆ రోజుల్లో డైరెక్ట‌ర్లు అయిన వారంద‌రూ దాదాపు కృష్ణా జిల్లా క‌మ్మ‌యువ‌కులే .. మ‌ళ్లీ కులం ప్ర‌స్తావ‌న తెస్తావురా బార్బేరియ‌స్ అని తిడితే తిట్టిన‌ప్ప‌టికీ చాటునైనా యదార్థం చెప్పాలి క‌దా …

పిఎపి సుబ్బారావుగారి మొద‌టి సినిమా డైరెక్ట్ చేసింది ఎల్వీ ప్ర‌సాద్ మాత్రం ఎగ్జంమ్ష‌ను.. ఆయ‌న ప‌గో జిల్లా కమ్మ అన్నమాట . అయితే ఆయ‌న‌కీ కృష్ణా జిల్లాతో చాలా చుట్ట‌రికం ఉండేద‌నుకోండి… ముఖ్యంగా ఉయ్యూరు ప్రాంతంతో …

అది ప‌క్క‌న పెడితే .. పిఎపి బ్యాన‌ర్ లోనే డైరెక్ట‌ర్ అయిన తాతినేరి రామారావుగారి తొలి సినిమా న‌వ‌రాత్రి.

అక్కినేని హీరో… ఇది త‌మిళం నుంచీ రీమేకు…. (యమగోలకు కూడా ఏదో బెంగాల్ సినిమా మాతృక అని గుర్తు)…

ఆలుమ‌గ‌లు ఆ బ్యాన‌ర్ లో ఆయ‌నిచ్చిన పెద్ద హిట్టు… చిగురేసే మొగ్గేసే సొగ‌సంతా పూత‌పూచే లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయా సినిమాలో…

ప్ర‌త్య‌గాత్మ , తాతినేని రామారావు ఆల్డ‌ర్ నేటివ్ గా డైరెక్ట్ చేసేవారు … త‌ర్వాత బ‌య‌ట బ్యాన‌ర్ల‌లో … మంచి మిత్రులు అనే కృష్ణ, శోభ‌న్ బాబుల సినిమా తీశారు. రామానాయుడు బ్యానర్ లో జీవన తరంగాలు డైరెక్ట్ చేశారు.

ఎన్టీఆర్ తో తాతినేని రామారావు ప‌న్జేసిన తొలి సినిమా య‌మ‌గోల. అక్కినేని కాంపౌండ్ డైరెక్ట‌ర్ గా పేరుంది అప్ప‌టికి తాతినేని రామారావుకి. భలే రంగ‌డు, బ్ర‌హ్మ‌చారి, దొర‌బాబు లాంటి అక్కినేని మాస్ సినిమాలు తీశారాయ‌న‌.

య‌మ‌గోలకు తాతినేని రామారావు డైరెక్ట‌ర్ అన్న‌ప్పుడు అన్న‌గారు కొంత సందేహంలో ఉన్నారు. అందుకే … కె.వి రావును అసిస్టెంట్ గా పెట్ట‌మ‌ని కండీష‌న్ పెట్టారు. అలాగే రైట‌ర్ ప్ర‌తిరోజూ సెట్ లో ఉండాల‌నేది మ‌రో కండీష‌ను.

ఆ సినిమా విజ‌యం సాధించిన త‌ర్వాత ఎన్టీఆర్ ఆట‌గాడు సినిమాకు డైరెక్ష‌న్ చేశారు.

అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు తీసే సినిమాల‌కు ఎక్కువ‌గా ప‌న్జేసేవారు. అలాగే శోభ‌న్ బాబుతో సినిమాలు తీసిన హ‌రికృష్ణ కూడా టీ కృష్ణ‌తో ట్రావెల్ మొద‌లెట్ట‌డానిక‌న్నా ముందు తాతినేరి రామారావుతోనే ప్ర‌యాణించారు.

పూర్ణచంద్ర‌రావు నేతృత్వంలోనే తెలుగు సినిమాల‌ను హిందీలోకి రీమేక్ చేయ‌డం అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టి బొంబాయి డైరెక్ట‌ర్ అయ్యారాయ‌న‌.

తాతినేని రామారావుతో పాటు బాప‌య్య‌ గారు కూడా ముంబై వెళ్లారు. తాతినేని ప్ర‌కాశ‌రావు గారు నాదెండ్ల వైపు ట‌ర్న్ అయిన‌ప్పుడు ఆయ‌న కొడుకు టిఎల్వీ ప్ర‌సాద్ కు ఇక్క‌డ సినిమాలు మాయ‌మైపోయాయి.

అప్పుడు అత‌ను కూడా తాతినేని రామారావు గైడెన్స్ లోనే ముంబై షిఫ్ట్ అయ్యాడు. అలా బాలీవుడ్ లో జండా ఎగ‌రేసిన తాతినేని రామారావు ఎన‌భై నాలుగో ఏట చెన్నైలో క‌న్నుమూశారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions