Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?

June 13, 2025 by M S R

.

అంతటి ఎన్టీఆర్ కే తప్పలేదు… 1995 లో ఎన్టీఆర్ ను బాబు దించేశాక… ఓ రోజు ఎన్టీఆర్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబు రాజకీయ వ్యభిచారి అని తిట్టారు . ఈ వార్త మరుసటి రోజు పత్రికల్లో రాగానే ( అప్పుడు టీవీల్లో 24 గంటల వార్తలు లేవు ) బాబు నాయకత్వంలోని మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో ధర్నా…

ఎన్టీఆర్ మహిళలను వ్యభిచారులు అని అవమానించారని ఆందోళన … ఎన్టీఆర్ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని ప్రకటన ఇచ్చారు కానీ ఎందుకో ఇంటి ముందు చేయలేదు … పార్టీని చీల్చి తనను గద్దె దించి తమ mla లను తీసుకు వెళ్ళాడాన్ని రాజకీయ వ్యభిచారం అని ఎన్టీఆర్ తిట్టారు … ఇందులో మహిళలను అవమానించడం ఏమిటో అప్పుడే కాదు, ఇప్పటికీ అర్థం కాలేదు …

Ads

టీడీపీకి ఉన్న ప్రచార బలం అద్భుతమైనది . బాబు ఎన్టీఆర్ గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడకుండా కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్టు మీడియా ద్వారా తీర్చుకునే వారు . ఇప్పుడంటే అన్ని పార్టీలకు మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి రాజకీయాలు వేరు .

బాబు టీడీపీకి మాత్రమే మీడియా ఉన్న రోజుల్లో ఎవరు ఏ అంశంపై నోరు తెరిచినా మహిళలను అవమానించారు అని టీడీపీ ప్రత్యర్థులకు ఊపిరి ఆడకుండా చేసేది … చివరకు ఎన్టీఆర్ సైతం ఈ దెబ్బకు విలవిలలాడి పోయారు .

తనను అధికారం నుంచి దించేసి , పార్టీ లాగేసుకొని బయట పడేస్తే… బాబుది రాజకీయ వ్యభిచారం అని ఎన్టీఆర్ విమర్శిస్తే మహిళలను అవమానించారు, మహిళలను వ్యభిచారులు అన్నారు అని బాబు బృందం ఎన్టీఆర్ పై ధ్వజమెత్తింది .

బాబు రాజకీయాన్ని విమర్శిస్తే మహిళలను విమర్శించడం ఎలా అవుతుందో . అప్పుడు బాబు బృందంలో ఉన్న కొమ్మినేనికి సైతం అర్థం అయి ఉండదు .. తాను సాక్షి టివిలో నిర్వహించిన చర్చలో ఇతరులు ఏదో అంటే తనపై sc, st కేసు ఏమిటో ? కోర్టు కూడా అదే అన్నది కదా…

అప్పటి ఎన్టీఆర్ మనసులో ఏమనుకున్నారో ఇప్పుడు కొమ్మినేనికి అర్థం అయి ఉంటుంది . ఎన్టీఆర్ కే తప్పలేదు, నేనెంత అనుకుంటున్నారేమో కొమ్మినేని … చర్చలో పాల్గొన్న వ్యక్తి ఏదో అన్న దానికి కొమ్మినేనికి ఏం సంబంధం ? నవ్వితే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా ? అని సుప్రీం కోర్ట్ సీరియస్ గానే ప్రశ్నించింది .

జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మనకున్నా… కొమ్మినేని పై sc, st కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏమిటీ అని జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్ట్ నాయకులు ప్రశ్నించక పోయినా సుప్రీం కోర్ట్ మాత్రం సీరియస్ గానే ప్రశ్నించింది .

ఆంధ్రభూమిలో నేను టీడీపీ బీట్ చూసేవాడిని… ఓ రోజు కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయం బయట నిలబడితే, లోపల అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారని తెలిసి కలవడానికి వెళుతూ… మీరూ రండి అని కొమ్మినేని పిలిస్తే వెళ్ళాను .

పిచ్చాపాటి చర్చలో మధ్యాన్నం భోజనంకన్నా కోడి గుడ్డు ఇవ్వడం ఆరోగ్య రీత్యా పిల్లలకు మంచిది కదాని ysr ఏదో అన్నారు … మరుసటి రోజు చిన్న వార్త వచ్చింది . దానిపై టీడీపీ పెద్ద గొడవ… పిల్లల నోటికాడి ముద్దను ysr లాగేస్తున్నారు అంటూ గగ్గోలు …

కోడి గుడ్డు మీద ఈకలు భలే లాగుతారు అనిపించింది . టీడీపీ గెలువవచ్చు, ఓడిపోవచ్చు కానీ ప్రచారంలో ఆ పార్టీ దరిదాపుల్లోకి వచ్చే పార్టీ ఇంకోటి లేదు . తాను నమ్ముకొన్న పాత పార్టీ , కొత్త పార్టీ కన్నా సుప్రీం పుణ్యమా అని కొమ్మినేని బయట పడ్డారు …

టీడీపీ ప్రచార సత్తా చూశాక కొమ్మినేనికి సైతం దిమ్మ తిరిగి పోయి ఉంటుంది . టీడీపీ ప్రచార సామర్ధ్యం ఎన్టీఆర్ కే దిమ్మతిరిగి పోయేట్టు చేసింది … కొమ్మినేని ఎంత …!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions