రాజకీయాలు… రాజకీయాలు… మన సమాజాన్ని వీలైనంత భ్రష్టుపట్టించేది, కలుషితం చేసేది రాజకీయాలే… మన మీడియాకు ఆ బురదను ప్రజలకు రుద్దడం తప్ప మరో పని లేదు…
ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ వార్త చదివాక అనిపించింది అదే… శీర్షిక పేరు మిగులు ఉపాధ్యాయులు పది వేలు… అంటే సింపుల్‌గా వాళ్లకు పనిలేదు… జీతాలిస్తుంటాం… నెలనెలా వేల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్లతో పని చేయించుకోవాలి కదా ఈ ప్రభుత్వాలు..? కొలువులిస్తూ పోవడమే తప్ప తగిన పని చూపించకూడదా..?
అదేమంటే, మరో డీఎస్సీ వేస్తాం, మరో పదివేల కొలువులిస్తాం అంటారు… పిల్లలున్నచోట టీచర్లు సరిపోరు, కొన్ని అసలు పిల్లలే లేరు, టీచర్లు వచ్చీపోతుంటారు… ఈరోజుకూ హేతుబద్ధీకరణం చేతకాలేదు ప్రభుత్వాలకు… అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు… టీచర్ల జోలికి పోవడానికి జంకు…
Ads
రియాలిటీ ఏమిటి అంటే…? కొన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగానే నడుస్తున్నాయి.., మంచి ఫలితాలే వస్తున్నాయి… పెద్ద గ్రామాలు, పట్టణాల్లో స్కూళ్లలో కాస్తోకూస్తో సౌకర్యాలు కూడా పర్లేదు… ఎటొచ్చీ పల్లెల్లో స్కూళ్లే ఎవరికీ పట్టవు… దాంతో పేదజనం కూడా అందుబాటులో ఉన్న ప్రైవేటు బడిలో చేర్పించేస్తున్నారు…
అసలు ఒక్క విద్యార్థి కూడా లేని బడుల సంఖ్య 1864… రాజకీయం వాటిని మూసేయదు… మూయనివ్వదు… అలాగని ప్రభుత్వం సరిగ్గా నడిపించదు… అవలా నామ్‌కేవాస్తే నడుస్తుంటాయి… నడిపిస్తుంటారు… 9447 స్కూళ్లు 1 నుంచి 30… వాటిల్లో అయిదు, పది లోపు పిల్లలవి గనుక కేటగిరిస్తే మూణ్నాలుగు వేలు ఉంటాయి… ఇలా లెక్కలు తేల్చి 10 వేల మంది టీచర్లు ‘మిగులు’గా విద్యాశాఖ అంచనాకు వచ్చింది…
30 మంది పిల్లలకు ఒక టీచర్ చాలు… కానీ ఇప్పుడు ఏకంగా 17 మంది పిల్లలకు ఓ టీచర్… సంగెం మండలంలో ఓచోట తనిఖీకి వెళ్తే నలుగురు విద్యార్థులకు ముగ్గురు టీచర్లున్నారని ఈనాడు రాసుకొచ్చింది… ఎస్, నగరాలకు చుట్టుపక్కల బళ్లలో టీచర్లు ఎక్కువ, మరీ ఎక్కువ, పిల్లలు తక్కువ… నగరంలో ఉండి రోజూ వెళ్లిరావడం సులభం కాబట్టి ఆయా బళ్లకు టీచర్ల గిరాకీ ఎక్కువ…
సిరిసిల్లలో కలెక్టర్ కాస్త హేతుబద్దీకరించి 238 మంది టీచర్లను అవసరమున్నచోట్లకు సర్దుబాటు చేసినట్టు ఈనాడు కథనం… నిజానికి ఇప్పుడు ఇలాంటి కథనాలే అవసరం… స్టోరీ బాగుంది… అసలే అనేక ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేషన్లలో ఉద్యోగులుంటారు, కానీ సరిపడా పని లేదు… తోడుగా ఇదుగో వేలాదిగా మిగులు టీచర్లు…
రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల సొంత ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోని సిట్యుయేషన్ వస్తోంది… ఆల్రెడీ అదే బాటలో ఉన్నాం…!!
Share this Article