Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపరేషన్ తేజస్…! అయోధ్య రామజన్మభూమికీ కంగనా రనౌత్‌కూ లింక్…!!

January 9, 2024 by M S R

ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది… పర్లేదు, వాట్సపులో, ఫేస్‌బుక్‌లో కొందరు రాసుకొచ్చారు… దేశమంతా ఇంటింటికీ రామజన్మభూమి అక్షింతలు పంచుతున్నారు కదా, బీఆర్ఎస్- కాంగ్రెస్ ఎలాగూ పార్టిసిపేట్ చేయవు, మరి బీజేపీ వాళ్లు కూడా పెద్ద హడావుడి చేయడం లేదేమిటి అని…! అసలు వచ్చే ఎన్నికల్లో ఫాయిదా కోసమే కదా అర్జెంటుగా రాముడి దర్శనానికి బాటలు వేస్తున్నది, మరి వాళ్లే వాడుకోవడం లేదేమిటి అని ఆ ప్రశ్నల సారాంశం…

సింపుల్, బీజేపీ దీన్ని పార్టీ కార్యక్రమంలాగా గాకుండా హిందూజాతి కార్యక్రమంలాగా మాత్రమే తీసుకుపోదలిచిందని ఓ జాతీయవాద మిత్రుడు వివరణ ఇచ్చాడు… నిజమేనా అని ఆలోచిస్తుంటే, నెట్‌లో సర్ఫింగ్ చేస్తుంటే అయోధ్య రాముడిగుడి బొమ్మ దగ్గర తేజస్ అనే ఇంట్రడక్షన్ కనిపించింది… అరె, అయోధ్యకూ ఈ తేజస్ సినిమాకు లంకె ఏమిటి అని ఏదో లింక్ ఓపెన్ చేస్తే అది నిజంగానే కంగనా రనౌత్ నటించిన తేజస్ సినిమా ఫోటో…

ఆమధ్య ఆమె తేజస్ అనే సినిమాలో ప్రధానపాత్ర పోషించింది కదా… యూరి సినిమా తీసినవాళ్లే ఇదీ తీశారు… 70 కోట్లు ఖర్చు చేస్తే 5.6 కోట్ల వసూళ్లు వచ్చాయట… హిందీ సినిమాల చరిత్రలో సూపర్ డిజాస్టర్ల జాబితాలో ఇదీ ఒకటి… అంతకుముందు ఇదే కంగనా రనౌత్ తీసిన ధాకడ్ కూడా ఆ జాబితాలో ఉన్నది… అంతేనా..? చంద్రముఖి-2 కూడా అంతే కదా… మొన్నామధ్య ఆమె రాజకీయాల్లోకి వస్తోందని, బీజేపీ తరఫున నిలబడే అవకాశముందనీ వార్తలు వచ్చాయి…

Ads

కరెక్టే, ఆమె సినిమాల తీరు చూస్తూ, సినిమాలు వదిలి ఆమె టెంపర్‌మెంట్‌కు ఆ రాజకీయాల్లోకి వెళ్లడమే బెటర్ అనుకుంటూ, ఆ సినిమా ఎక్కడుందా అని వెతికితే జీ5 ఓటీటీలో ఉంది… అసలు ఇంత డిజాస్టర్ కావడం ఏమిటి..? అయోధ్యకూ దానికి లింకేమిటి అని చూడటం ఆరంభిస్తే… ఆమె నటనకు, ఇన్వాల్‌మెంట్‌కూ ఢోకా లేదు… ఆమె రాజకీయ విధానాలు, వివాదాలు, విమర్శలు ఎలాగైనా ఉండనివ్వండి, ఒక నటిగా ఆమె మెరిటోెరియస్… అందుకే నాలుగు జాతీయ అవార్డులు, అయిదారు ఫిలిమ్‌ఫేర్లు… ఇందులో కూడా బాగానే చేసింది…

కథ కూడా మంచిదే… ఓ అమ్మాయి… యుద్ధవిమానం పైలట్ కావాలని కోరిక… తపన… ముంబై టెర్రరిస్ట్ అటాక్స్‌లో అందరినీ కోల్పోతుంది… ఇక దేశమే నా కుటుంబం అనుకుంటుంది… ఇండియన్ గూఢచారి ఒకరు పాకిస్థానీ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూపు చేతుల్లో చిక్కుతాడు, విడుదల చేయాలంటే ఏవేవో డిమాండ్లు పెడతారు… దేశం తనను తన ఏజెంటుగా అంగీకరించదు కదా… తేజస్ అనే పేరున్న ఆ వింగ్ కమాండర్‌కు తనను విడిపించే ‘ఆపరేషన్ తేజస్’ అప్పగిస్తుంది… అదీ ఆమె చూపిన చొరవ వల్లే… (మన ప్రిస్టేజియస్ యుద్ధవిమానం పేరు కూడా తేజస్…)

సదరు ఏజెంట్ కనిపెట్టిన ముఖ్య సమాచారం ఏమిటయ్యా అంటే… సదరు టెర్రరిస్టు గ్రూపు అయోధ్య రామజన్మభూమి ప్రారంభోత్సవ కార్యక్రమంపై సూసైడ్ అటాక్ ప్లాన్ చేస్తారు… అదీ ఈ తేజస్ సినిమాకూ ఆ అయోధ్యకూ లింకు… సినిమా ఎత్తుగడే బాగా ఆరంభమవుతుంది… బయట ప్రపంచంతో అనేక తరాలుగా సంబంధం లేని సెంటినలీస్ దీవులు తెలుసు కదా, ఒక యుద్ధవిమానం పైలట్ ప్రమాదవశాత్తూ అక్కడ పడిపోతాడు… అతన్ని తన సీనియర్లు హెచ్చరిస్తున్నా సరే ఈ తేజస్ (కంగనా) రక్షిస్తుంది…

కానీ ఈ టెంపోను సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు దర్శకుడు… పైగా నార్వే కార్గో విమానంలో రెండు చిన్న తేజస్ విమానాల్ని రహస్యంగా తీసుకుపోయి, పాకిస్థాన్ నుంచే ఆ ఏజెంటును దాచి ఉంచిన గిరిజన, ఎడారి ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్… కానీ ఇల్యూషన్ తెరను రన్‌వే మీద పాతి, పాకిస్థాన్ ఆర్మీ కళ్లుగప్పాలనే కథాంశం నమ్మబుల్‌గా లేక నవ్వులపాలై సినిమాను డిజాస్టర్‌గా చేసింది… మిగతాదంతా ఓ డిటెక్టివ్ నవల చదివినట్టు ఉంటుంది… క్లీన్ మూవీ, ఎక్కడా కమర్షియల్ వాసనల్లేవు…

‘‘పాకిస్థాన్‌లో ఆర్మీ చెప్పిందే నడుస్తుంది, డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వం కాదు’’… ‘‘ఇది కొత్త భారతదేశం, ఇప్పుడు ఎక్కడికైనా జొరపడుతుంది, ఎవరినైనా హతమార్చి మన సైనికులను విడిపిస్తుంది’’ వంటి డైలాగులు కూడా బాగానే ఉన్నాయి… మనకు తెలిసిన ఆశిష్ విద్యార్థి, ఈ కంగన మినహా ఇంకెవరూ తెలిసిన నటీనటులు లేరు… అక్కడక్కడా సినిమా బాగున్నట్టే అనిపించింది… కానీ కంగన బ్యాడ్ లక్… సినిమా జయాపజయాలకు చాలా కారణాలుంటయ్… కానీ వరుసగా అన్నీ డిజాస్టర్లే దక్కడం కంగన దురదృష్టం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సినిమా అంటేనే పత్తాలాట… ఏడిస్తే లాభం లేదోయీ ‘బార్బరికా..’
  • అత్తా అనసూయమ్మా… నీతో వరసోయమ్మా… హేమిటో, అప్పట్లో ఆ కథలు..!
  • గెలిచినవాడే తోపు..! ఇదే బాబు మార్క్ ‘పడిలేచే కెరటం’ ఫిలాసఫీ…!
  • మిస్టర్ అమిష్… పురాణాల్ని కూడా వక్రీకరించింది నువ్వు కాదా..?!
  • కొరియన్ హీరోయిన్… మంగోలియా విలన్… హీరో లోకలేనా సార్..?!
  • కాళేశ్వరం కత్తి ఇక మోడీ చేతిలో..! రేవంత్‌రెడ్డి వదిలేశాడు దేనికి..?!
  • పిచ్చి కూతలు, తిక్క చేష్టలు… మ్యూజిక్ అంటూనే ఇవేం పైత్యాలురా సామీ…
  • మూయించిన ఒక వీరుని కంఠం…. చక్రవర్తి టాప్ నంబర్ వన్ సాంగ్…
  • గోదాట్లో పడిపోయిన భానుప్రియ… ఆ నీళ్ల కింద ఊబి… హాహాకారాలు…
  • దిల్ కా దడ్‌కన్ రకుల్‌కు ఏమైంది..? మెడపై ఆ ప్యాచ్ ఏమిటి..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions