Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!

October 26, 2025 by M S R

.

ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన ప్రతి అక్షరమూ నిజం… నిజానికి దీని పూర్తి పాఠం కాంగ్రెస్ హైకమాండ్ ఇంగ్లిషులోకి అనువాదం చేయించుకుని మరీ చదవాలి ఓసారి సీరియస్‌గా… ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై ఓ రిపోర్టు…

ఈ ఎడిట్ పేజీ వ్యాసంలో కొన్ని విషయాల సారాన్ని ప్రస్తావిస్తూనే, కొన్ని విషయాలు చెప్పుకోవాలి… ఆ అవసరమూ ఉంది…

Ads

1. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మండుతోంది… గురువారం కేబినెట్ భేటీలో గంటకు పైగా మంత్రులకు ఆయన తలంటాడు… మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చాను, సీనియర్లకు ఎవరికేం తక్కువ చేశాను అని క్లాస్ తీసుకున్నాడు…

…….. ఇది నిజం, రేవంత్ రెడ్డి ప్రతి సీనియర్‌కూ గౌరవం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు… కానీ ప్రభుత్వం మీద నెగెటివ్ ప్రచారం జరుగుతుంటే, ప్రత్యేకించి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మీద చేస్తున్న నిందాపూర్వక దుష్ప్రచారాన్ని ఏ ఒక్క మంత్రీ ఖండించడు, అదేదే రేవంత్ రెడ్డి వ్యక్తిగత తలనొప్పి అనుకుంటున్నారు… బండి మునిగితే అందరమూ మునిగిపోతాం, మళ్లీ కేసీయార్ గద్దె ఎక్కితే ఒక్కొక్కరినీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడనే సోయి కూడా సీనియర్ మంత్రుల్లో లోపించింది…

2.  మల్లిఖార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని ముద్రవేశాడని ఎవరో ప్లాంటెడ్ ఆర్టికల్స్ రాయిస్తే, పింక్ మీడియా టాం టాం చేస్తే… పార్టీలో గానీ, ప్రభుత్వంలోగానీ ఒక్కరూ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే చేయలేదు… ఈరోజు కూడా అవే వార్తలు, కేసీ వేణుగోపాల్ రేవంత్‌కు క్లాస్ పీకాడనీ, చివరకు పీసీసీ అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని అంగీకరించాడనీ పింక్ మీడియా టాం టాం…

……… మంత్రులు ఖండించలేదు సరే, మరి ఎఐసీసీ స్పందన ఏమిటి..? జీరో..! ఓవర్ యాక్షన్ చేస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జికి అక్కరలేని నిరర్థక, శుష్క పాదయాత్రలు కావాలి గానీ ఇవెందుకు పట్టించుకోదు..? ఖర్గే మౌనంతో ఆ ప్రచారాన్ని పరోక్షంగా సమర్థిస్తున్నాడా..? ఈరోజు కేసీ వేణుగోపాల్ మందలింపుల మీద హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి…

3. మొన్నటి కాంగ్రెస్ గెలుపు కారణం… కేసీయార్ మీద ప్రజావ్యతిరేకత… అంతేతప్ప, ఈ సోకాల్డ్ సీనియర్ల మొహాలు చూసి జనం వోట్లేయలేదు… కేసీయార్‌ను ఢీకొట్టగల ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందనే ప్రజల భావన కూడా దీనికి కొంత ఉపకరించింది…

……… బీజేపీ అధ్వాన పనితీరు పుణ్యమాని మళ్లీ కేసీయార్ పుంజుకుంటే కాంగ్రెస్ బండి ఇక నొగలు విరిగి, మళ్లీ లేవదు… అంతేకాదు, రేవంత్ రెడ్డి గనుక కింద పడేస్తే… ఎత్తుకునేవాడు కూడా లేడు…

4. మంత్రుల విషయంలో ఇక తెగింపుతో ఉంటాను… ఏదయితే అదయింది…

……… అదే నిజమైతే సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సింది… చేయలేదు, పైగా ఇంటికి పిలిచి ఏదో సర్దుబాటు చేశాడు, ఫలితంగా మంత్రులతో ఏదో లోపాయికారీ ఒప్పందాలు జరిగాయనే బీఆర్ఎస్ ప్రచారానికి తావిచ్చాడు తనే… కొండా సురేఖ ఇష్యూ కాంగ్రెస్‌కు చాలా డ్యామేజ్ చేసింది…

5. రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి కూడా ఇస్తేనే కాంగ్రెస్‌కు తెలంగాణలో మనుగడ…

……….. ఎస్, కొందరు మంత్రుల శాఖల్లో రేవంత్ రెడ్డి వేలు పెట్టొద్దనే ముందస్తు షరతుతోనే హైకమాండ్ మూర్ఖత్వం మొదలైంది… కొనసాగుతోంది… కాంగ్రెస్‌లో డిసిప్లిన్ ఆశించలేం కానీ, మరీ ఇంత స్వేచ్ఛ మితిమీరి మొదటికే మోసం తెచ్చేట్టుగా ఉంది… పొంగులేటి, అడ్లూరి, వివేకా, పొన్నం, కొండా, సీతక్క, రాజగోపాల్రెడ్డి, జీవన్ రెడ్డి… వీళ్ల నష్టదాయక వైఖరులపై హైకమాండ్ చేసిందేముంది..? జీరో..!

6.  కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలెట్టారు…

……. ఈ విషయంలో పీసీసీ గానీ, ఎఐసీసీ గానీ ఏమీ స్పందించడం లేదు, సో ఎవరిదీ తప్పు… పక్కాగా ఢిల్లీదే తప్పు…

7. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో దశా దిశా లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది… ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ రేవంత్‌రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తిచెందుతోంది… మంత్రులు ఎవరికి వారే సీఎంలుగా పెత్తనాలు చెలాయిస్తున్నారు…

…….. నిజం, ముఖ్యమంత్రిని దూషించిన వారిపై కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఉండటం ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది… దీనికీ హైకమాండ్‌దే తప్పు…

8. ముందూ వెనుకా ఆలోచించకుండా, చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకోవడంతో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది…

…… నిజం, బీఆర్ఎస్, బీజేపీలను కార్నర్ చేసి, బీసీల్లో చాంపియన్ అయిపోవాలని పార్టీ భావించినా, దానికి ఓ ప్రణాళిక లేదు… పార్టీ ఫుల్ మద్దతుగా నిలబడలేదు, బీఆర్ఎస్ నెగెటివ్ ప్రచారాన్ని కౌంటర్ చేసే గొంతే లేకుండా పోయింది కాంగ్రెస్‌లో…

9.  నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం రేవంత్‌రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్‌రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్ఠానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి….

……. నిజం, రాజకీయాలలో రిస్కు తీసుకున్నప్పుడే ఫలితాలు వస్తాయి… ఈ ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిది కాదు… రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధిష్ఠానం కూడా సాహసించలేని పరిస్థితి… ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే అనువైన వాతావరణం ఇంకేముంటుంది..?

10. ప్రజలు మరచిపోయిన కాంగ్రెస్‌ సంస్కృతిని మళ్లీ గుర్తుకు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే అధికారం కోల్పోవడానికి సిద్ధపడక తప్పదు. తస్మాత్‌ జాగ్రత్త!

……. అవును, ఈ పరిస్థితికి కాంగ్రెస్ హైకమాండే ప్రధాన కారణం… రేవంత్ రెడ్డికి బలమైన సపోర్ట్ హైకమాండ్ నుంచి రాకపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందే… అటు కర్నాటకలో ఎలాగూ బండి మునిగిపోయేట్టుంది… ఇక తెలంగాణలోనూ చేజేతులా చెడగొట్టుకుని, కేసీయార్‌కు పగ్గాలు అప్పగించే స్థితి వస్తే… కాంగ్రెస్ పార్టీ ఇక మళ్లీ లేవదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శ్రీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి… అయ్యో, కేసు పెట్టేసి జైళ్లో వేస్తారా..?!
  • కృష్ణ సాహసి..! ఆరోజుల్లో ఎన్టీయార్‌ను ఢీకొట్టడం అల్లాటప్పా కాదు మరి..!!
  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…
  • అసలే వాడు ట్రంపులమారి… మన రోతను అక్కడా వ్యాప్తి చేయకండి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions