ఒక వార్త… పీటీఐ న్యూస్ ఏజెన్సీ నుంచి జనరేటయిన వార్త కావచ్చు బహుశా… హిందుస్థాన్ టైమ్స్‌లో కనిపించింది… తెలుగు పత్రికల్లో ప్రముఖంగా ఎక్కడా కనిపించలేదు… విషయం ఏమిటంటే… ‘‘గవర్నర్ తమిళిసై స్వయానా గైనకాలజిస్టు, గర్భ సంబంధ వైద్యంలో స్పెషలిస్టు… ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ప్రారంభించిన గర్భసంస్కార కార్యక్రమంలో ఆమె ఆదివారం మాట్లాడుతూ గర్భిణులు సుందరకాండ పారాయణం చేయాలనీ, రామాయణం వంటి పురాణగ్రంథాల పఠనం సాగించాలనీ, తద్వారా మానసిక, దైహిక బలవంతులైన శిశువులు జన్మిస్తారనీ చెప్పారు…
సదరు ఆర్ఎస్ఎస్ సంస్థ పేరు సంవర్ధినీ న్యాస్… దీనికోసం పనిచేసే డాక్టర్లు సంప్రదాయ, శాస్త్రీయ పద్దతుల్లో శిశువులు కడుపులో ఉన్నప్పుడే సంస్కారాన్ని, దేశభక్తిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారు… యోగ, పురాణాలు, గీతాపఠనం వంటి ప్రక్రియలతో ఈ గర్భసంస్కార అనేది శిశువు కడుపులో ఉన్నప్పటి నుంచీ శిశువుకు రెండేళ్ల ప్రాయం వచ్చేవరకూ కొనసాగిస్తారు… ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన గవర్నర్ ఈ సందర్భంగా మాట్లాడారు… (ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర సేవిక సమితి కార్యక్రమాల్లో ఇదీ ఒకటి…)
గ్రామాల్లో చూస్తాం, ఇళ్లల్లో పెద్దవాళ్లు గర్భిణుల ఎదుట కూర్చుని పురాణాల్ని, నీతికథల్ని పఠిస్తుంటారు… మరీ ప్రత్యేకంగా సుందరకాండ, కంబ రామాయణం… ఇదొక విశ్వాసం… ఈ ప్రక్రియ వల్ల గర్భంలో ఉండే శిశు దశ నుంచే సంస్కారం అలవడుతుందనేది నమ్మకం… అని గవర్నర్ వివరించారు… ఈ సందర్భంగా రాష్ట్ర సేవిక సమితి మేధోవిభాగం కోహెడ్ లీనా గహానే కూడా మాట్లాడారు… ఈ గర్భసంస్కార పద్ధతుల్ని వివరించారు… ఇదీ వార్త…
Ads
దొరికింది గవర్నరమ్మ అనుకుని ఇక నమస్తే తెలంగాణ ఒకవైపు… బీఆర్ఎస్ కేడర్ మరోవైపు సోషల్ మీడియాలో విరుచుకుపడతారేమో అనుకున్నాం గానీ… ఆలోచన తట్టలేదో లేక ఇప్పుడు మోడీకి కేసీయార్ సరెండర్ అని వస్తున్న వార్తలే నిజమో గానీ… ఎవరూ గవర్నర్ మీదకు ‘‘ఆయ్ఁ ఏమిటీ మనువాదం…? హిందుత్వను ఇక గర్భాల దశ నుంచే బోధిస్తారా..? కరడుగట్టిన హిందుత్వవాదులను తయారు చేస్తారా అభిమన్యుడి దశ నుంచే..? సాక్షాత్తూ గవర్నరే దాన్ని ప్రోత్సహిస్తూ ప్రసంగాలు చేయాలా..? అసలు ఆమె ఏం గైనకాలజిస్టు..?’’ అని మొదలు పెట్టలేదు, సంతోషం… ఆమెను అవమానించడమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా కదా…
నిజానికి ఇందులో గవర్నర్‌ను ఆక్షేపించడానికి ఏమీలేదు… గర్భిణి చేష్టలు, ఆలోచనలు, చివరకు తిండి ప్రభావం కూడా గర్భస్థ శిశువు ఎదుగుదల మీద ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా అందరూ విశ్వసించేదే… అంతెందుకు..? గర్భంలోని శిశువుకు కడుపులో ఉన్నప్పుడే రంగులు, అంకెలు, అక్షరాలు బోధించే కార్పొరేట్ తరహా ‘‘గర్భసంస్కార’’ సంస్థలు హైదరాబాదులో ఎప్పటి నుంచే ఉన్నవే… మనం మహాభారతంలోని అభిమన్యుడి కథ చదువుకున్నాం కదా… చక్రవ్యూహం గురించి అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటాడు…
ఎస్, కడుపులోని శిశువు వింటాడు, ఆలోచిస్తాడు… సో, అమ్మ కడుపు ఎదుట ‘‘మంచి పాఠాలు’’ ఎప్పుడూ మంచిదే… పైగా గర్భిణి ఆలోచనల్ని కూడా ఈ గ్రంథపఠనం ప్రభావితం చేస్తుంది… సో, గవర్నరమ్మ అమ్మల కడుపుల ఎదుట సుందరకాండ చదవండి, గీతను పఠించండి అని చెబితే అందులో తప్పేమీ ఉన్నట్టు లేదు… పైగా ఆమె స్వయంగా గైనకాలజిస్టు, ఆమె అనాలోచితంగా ఏమీ వ్యాఖ్యానాలు చేయదు… ఇందులో మతవ్యాప్తి ఏమీలేదు… హిందుత్వ బోధన కూడా కాదు… అనాదిగా తల్లులు, ఈ సమాజం విశ్వసిస్తున్న ఓ ఆనవాయితీ… అంతే…
Share this Article