ఉత్తరప్రదేశం దాకా వెళ్లిన మన పొలిటిషయన్స్ కొత్తేమీ కాదు… జయప్రద పేరు ఉదాహరణకు ఉండనే ఉందిగా… కానీ శ్రీకళారెడ్డి అనే పేరు, ఆమె బయోడేటా కాస్త ఆసక్తికరంగా ఉంది… ప్రస్తుతం ఆమె జాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తోంది…
నిజానికి ఆమె ఆమధ్య బీజేపీలో చేరింది… హుజూర్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణలోనే పోటీచేస్తుందని అందరూ అనుకున్నారు… ఆమెది తెలంగాణే… తండ్రి జితేందర్‌రెడ్డి, తను నల్గొండ డీసీసీబీ అధ్యక్షుడిగా చేశాడు, హుజూర్‌నగర్ నుంచి గతంలో ఇండిపెండెంటుగా కూడా గెలిచాడు… తల్లి లలితారెడ్డి తమ సొంత ఊరు రత్నవరం సర్పంచిగా చేసింది… ఆ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఆమె కుటుంబానిది నిప్పో బ్యాటరీల కంపెనీ…
అంతే తెలుసు కదా… ఎంత ఆస్తిపరులో… దాని ప్రధానకేంద్రం చెన్నై కావడంతో ఆమె అక్కడే చదువుకుంది… బీకామ్ వచ్చేసరికి హైదరాబాద్‌కు మారింది… తరువాత అమెరికా వెళ్లి ఆర్కిటెక్చర్ చదివింది… ఇండియాకు తిరిగొచ్చి తమ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటూ ఉండేది… ఇది 53 ఏళ్ల శ్రీకళారెడ్డి నేపథ్యం…
Ads
ఆమెకు మొదటి వివాహం ద్వారా ఒక సంతానం… అది విఫలం… యూపీలో బాహుబలి నేతగా ప్రసిద్ధి పొందిన ఓ గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటిషియన్ ఉన్నాడు ఒకాయన… పేరు ధనుంజయ్ సింగ్… యూపీలో అలాంటోళ్లే కదా పొలిటిషియన్స్… థాంక్స్ టు ఎస్పీ, బీఎస్పీ…
57 ఏళ్ల ఆయన మీద బోలెడు కేసులు (41 వరకూ)… మొదటి వివాహం ఏడాదిలోపే ఫెయిల్… అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించింది… తరువాత ఒకామెను చేసుకుంటే ఆమె పనిమనిషి హత్య కేసులో శిక్ష పడింది, విడాకులు… ఆమె ద్వారా ధనుంజయ్ సింగ్‌కు ఓ సంతానం ఉంది… మరి శ్రీకళారెడ్డికీ, ఈ ధనుంజయ్‌కు ఎలా పరిచయమో, ఎక్కడ కలిశారో గానీ… ఆమెకు రెండోది, ఆయనకు మూడోది పెళ్లి పారిస్‌లో 2017లో జరిగింది… తరువాత చెన్నైలో ఘనంగా రిసెప్షన్ కూడా… దీనికి అల్లు అర్జున్ సహా బోలెడు మంది సెలబ్రిటీలు హాజరయ్యారు…
ఇది ఆయన గారి నేపథ్యం… 2021లో ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో నిలబడి జెడ్పీ చైర్ పర్సన్ అయ్యింది… ఆయన గారేమో ఏదో కేసులో శిక్ష పడి జైలుపాలయ్యాడు… దాంతో ఇప్పుడు ఆమె జాన్‌పుర నుంచి పోటీ చేస్తోంది… ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఈమె ఇప్పుడు బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతోంది… ఇది ముస్లిం ప్రాబలమున్న సీటు, బీఎస్పీ బలంగానే ఉంది…
ఇవన్నీ ఒకెత్తు అయితే ఆమె అధికారికంగానే ప్రకటించిన ఆస్తుల గురించీ చెప్పుకోవాలి… వందల కోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు… ఈమె కూడా అదే జాబితా… 780 కోట్ల స్థిరాస్తులున్నయ్… 1.74 కోట్ల బంగారు ఆభరణాలు అనేది ఆమె బయోడేటాలో ఇట్టే ఆకర్షించే అంశం… ఆయన గారికీ అందులో సగం బంగారం ఉంది… భలే ఫ్యామిలీ, భలే స్టోరీ… చెప్పనే లేదు కదూ… ఆమె తండ్రి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు… ఆమె భర్త ఓ గ్యాంగ్‌స్టర్… ఇదీ అసలైన ఐరనీ..!!
Share this Article