,
అనుకుంటున్నదే…. ఇతర ఈటీవీ ప్రోగ్రాములతో పోలిస్తే కాస్త బెటర్ అనిపించింది ఇన్నాళ్లూ శ్రీదేవి డ్రామా కంపెనీ… అటు హైపర్ ఆది పైత్యం అంతా ప్రదర్శితమవుతూ త్వరలో భ్రష్టుపట్టిపోతుంది అనుకున్నదే… అనుకున్నట్టే అయ్యింది…
ఇంద్రజ ఉంటేనేం..? హైపర్ ఆదికి సాగిలబడిపోయింది ఈటీవీ అండ్ మల్లెమాల… ఫాఫం… ఈసారి బార్క్ రేటింగుల్లో ఈటీవీ టాప్ 30 జాబితాలో ఆ ప్రోగ్రాం జాడ లేకుండా పోయింది… అంతేకాదు, తను పిచ్చి జోకులు వేసి చిరాకు పెట్టే ఢీ షో కూడా ఆ జాబితాలో లేదు… ఫాఫం మల్లెమాల…
Ads
ఇంకా ఈ నిర్వాకానికి తోడు రష్మికి తోడుగా ఈసారి యాంకర్ రవి కనిపించాడు… అది మరో వేస్ట్ కేసు… జబర్దస్త్ అస్సలు పెరగడం లేదు అనుకుని ఇంకా ఇంకా బూతులు దట్టిస్తున్నారు… వీళ్ల దుంపతెగ… ఐనా సరే అదే అరకొర, బొటాబొటీ… యూట్యూబులో, రీల్స్, షార్ట్స్‌లో బిట్లు బిట్లు వేసి డబ్బు ఏరుకునే పనిలో పడింది ఈటీవీ…
ఒకప్పుడు ఈటీవీ ఏమిటి..? ఇప్పుడు ఏమిటి..? కాస్తో కూస్తో సుడిగాలి సుధీర్ కారణంగా ఫ్యామిలీ స్టార్స్ కాస్త బెటర్ రేటింగ్స్… తరువాత జబర్దస్త్… అంతే… జబర్దస్త్ బూతుల విషయం చెప్పుకుంటున్నాం కదా… రెండు… రెండే రెండు చెప్పుకుందాం…
ఎవడో ఏదో స్కిట్‌లో ఎవరో కమెడియన్ ఒక బెంగాలీని తెచ్చుకున్నాడు… రష్మితో అనిపించారు… నీ స్కిట్టులో బెంగాలీ, తప్పకుండా ఈసారి…. డ్యాష్ డ్యాష్… అర్థమైంది కదా రైమ్..? థూ… చివరకు రష్మి ఇంత బతుకూ బతికి… అలాగే మరోచోట చలాకీ చంటి… ఒకప్పుడు టాప్ టీవీ కమెడియన్…
ఎవడినో పట్టుకుని అంటున్నాడు… ఒరే, లాఠీనే లేపలేనోడివి…. డాష్ డాష్ … అని, అర్థమైంది కదా… బూతు… జంధ్యాల బతికి ఉంటే ఉరిపెట్టుకునేవాడు… ఐనాసరే రేటింగుల్లేవనే సోయి లేదు ఈటీవీకి… చీదరించుకుంటున్నార్రా బాబూ…
ఎలాగూ ఈటీవీ రేటింగ్స్ ఇక పెరగవు, దాని పని అయిపోయింది… పోటీ స్టార్ మా అండ్ జీతెలుగు… ఐతే స్టార్ మా రేటింగ్స్ దందా, సారీ, దంచుడుకు జీతెలుగు తట్టుకోలేకపోతోంది… ఈసారి టాప్ సీరియల్స్ ఏమిటంటే…?
1. కార్తీకదీపం… 2. గుండె నిండా గుడిగంటలు… 3. ఇల్లు ఇల్లాలు పిల్లలు… 4. ఇంటింటి రామాయణం… 5. చిన్ని… 6. నువ్వుంటే నా జతగా… తరువాత జీతెలుగు చామంతి సీరియల్… కార్తీకదీపంతో పోలిస్తే సగం రేటింగ్స్…
ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నదే స్టార్ మా రేటింగ్స్ దందా ఎలా ఉన్నా సరే… జీతెలుగు క్రియేటివ్ టీమ్ నాసిరకం పర్‌ఫామెన్స్… త్రినయని, ప్రేమ ఎంత మధురం చూశాం కదా… ఇప్పుడు మంచి కథ ఉన్నా సరిగ్గా ప్రజెంట్ చేసుకోలేని జగద్ధాత్రి…
మేఘసందేశం, పడమటి సంధ్యారాగం, చాలాదూరంలో అమ్మాయిగారు… తరువాత లక్ష్మినివాసం… మిగతా సీరియళ్లన్నీ సో సో… అసలు రియాలిటీ షోలు ఎవడూ చూడటం లేదు… రియాలిటీ షోలకు వస్తే ఓ వింత మనిషి ఓంకార్ హోస్ట్ చేసి, నిర్మించే ఇస్మార్ట్ జోడీ కాస్త బెటర్ రేటింగ్సుతో ఉంది…
చివరకు ఈటీవీ న్యూస్ సాధించే రేటింగ్స్ కూడా జీతెలుగు కొన్ని సీరియళ్లు సాధించలేకపోతున్నాయి… తెలుగు వినోద చానెళ్ల దురవస్థ అది… అంతే… స్టార్ మా అన్ని భాషల్లోకెల్లా ఫస్ట్ ప్లేసులో ఉంది, ఏం మాయ చేస్తుందో ప్రస్తుతానికి తెలియదు గానీ… జీతెలుగు ఓ మోస్తరు మర్యాదకరమైన సెకండ్ ప్లేసులో ఉంది… ఫాఫం ఈటీవీ స్టార్ మాటీవీలో మూడో వంతు రేటింగులతో కునారిల్లుతోంది…!!
Share this Article