తెలుగు న్యూస్ చానెళ్ల వీక్షణం తగ్గిపోతోంది… బాగా పాపులర్ అనుకున్న డిబేట్ల రేటింగ్స్ కూడా దారుణంగా ఉంటున్నయ్… వాటిని చూసేవారి సంఖ్య చాలా చాలా తక్కువ… మరీ పొలిటికల్ పిచ్చి ఉన్న కొందరు మినహా మిగతావారెవరికీ అవి పట్టవు… పైగా సదరు డిబేట్ ప్రజెంటర్ల పైత్యం రోజురోజుకూ ఏవగింపు కలిగిస్తోంది… సరే, అదంతా మరోసారి రేటింగ్స్ అంకెలతో చెప్పుకుందాం గానీ… వినోద చానెళ్ల పరిస్థితి ఏమిటి..?
ఇన్నాళ్లూ మనం చెప్పుకుంటున్నది ఏమిటి..? జెమిని టీవీ పనైపోయింది… ఉన్నవే నాలుగు చానెళ్లు కాగా, ఇది మరీ ఆరోదో, ఏడోదో ప్లేసులోకి జారిపోయింది అని… సినిమా చానెళ్లు దాన్ని దాటిపోయాయి… అఫ్‌కోర్స్ జెమిని టీవీయే ఓ సినిమా చానెల్‌గా మారిపోయింది… ఆ సీరియళ్లు డీడీ కాలం నాటి సీరియళ్లతో పోటీ… సారీ, అవి కాస్త నయం… ఇక రియాలిటీ షోలు ఎట్సెట్రా దానికి చాలా చాలా దూరం… ఇంకెవరు చూడాలి ఆ చానెల్‌ను… అఫ్‌కోర్స్, జెమిని టీవీని యాజమాన్యమే ఎన్నడో వదిలేసింది…
మాటీవీ రియాలిటీ షోలు, సీరియళ్లలో దిట్ట అనీ, అవే దాన్ని నంబర్ వన్ స్థానంలో ఉంచుతున్నాయని అనుకుంటున్నాం కదా… (జాతీయ స్థాయిలోనూ కొన్నిసార్లు నంబర్ వన్ ప్లేసులో ఉంది)… నిజానికి మాటీవీ బలం సీరియళ్లే (ఫిక్షన్)… రియాలిటీ షోలది ఏముంది..? బిగ్‌బాస్ మినహా పాపులర్ రియాలిటీ షోలు లేవు, అసలు నాన్ ఫిక్షన్ మాటీవీకి సరిగ్గా చేతకాదు… (ఎక్కువ ఖర్చుతో ప్రసారం చేసే బిగ్‌బాస్‌కు కూడా పూర్ రేటింగ్స్ వస్తున్నయ్…) జీతెలుగు చానెల్‌తో జరిగే పోటీలో కార్తీకదీపం వంటి సీరియళ్లే దాని బలం… ఇప్పుడు విశేషం ఏమిటంటే… ఆ ఫిక్షన్ కేటగిరీలో మాటీవీని జీతెలుగు కొట్టేసింది… కాకపోతే దానికి ప్రచారం చేసుకోవడం చేతకావడం లేదు…
Ads
నిజానికి టాప్ 30 ప్రోగ్రాముల జాబితా చూస్తే ఎక్కడో దిగువన త్రినయని, ప్రేమ ఎంత మధురం వంటి జీతెలుగు సీరియళ్లు కనిపిస్తాయి… కానీ టాప్ ప్లేసుల్లో మొత్తం మాటీవీ సీరియళ్లే ఉంటాయి… కార్తీకదీపం రోజులు పోయాయి కానీ బ్రహ్మముడి వంటి సీరియళ్లను బాగా పైకి లేపుతున్నారు… ఐనా సరే ప్రస్తుతం ఫిక్షన్ కేటగిరీలో జీతెలుగు ముందు వరుసలోకి వచ్చేసింది… ఈ టేబుల్ చూడండి…
సరే, సీరియళ్ల నాణ్యతలో ఈటీవీ ఎలాగూ డీడీ, జెమినీ టీవీతో పోటీపడుతుంది కాబట్టి అది ఫిక్షన్ కేటగిరీలో మాటీవీ, జీటీవీలకు చాలా దూరంలో ఉండిపోతోంది… పాత సినిమాల కారణంగా ఆ కేటగిరీలోనూ ఈటీవీ పూర్… ఈ మూవీస్ కేటగిరీలో జెమిని బెటర్… మాటీవీ, జీటీవీ దాదాపు సేమ్…
ఇక నాన్-ఫిక్షన్ అంటే రియాలిటీ షోలలో ఈటీవీ దిట్ట… జబర్దస్త్, ఢీ, డ్రామా కంపెనీ ఎట్సెట్రా షోలు దాని బలం… కానీ అవీ ట్రెండ్‌కు అనుగుణంగా మారలేక, జనానికి బోర్ కొట్టేస్తున్నయ్… అందుకే నాన్ -ఫిక్షన్‌లో కూడా ఈటీవీ చాలా వెనుకబడిపోయింది… ఒకప్పుడు వినోద చానెల్ అంటేనే ఈటీవీ… ఇప్పుడది మూడో స్థానంలో బిక్కుబిక్కుమంటోంది… మాటీవీ, జీతెలుగు చానెళ్ల రేటింగ్స్‌తో పోలిస్తే దూరంగా ఉండిపోయింది…
Share this Article