ఎందుకు తెలుగు ఇండియన్ ఐడల్‌ను ప్రెయిజ్ చేస్తావు అనడిగాడు ఓ ఫ్రెండ్… టీవీల్లో మ్యూజిక్, యాక్చవల్నీ నాట్ మ్యూజిక్… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలు చూసేవాళ్లకు మాత్రమే అర్థమయ్యే ఓ ఫీలింగ్… థమన్‌ను ఎందుకు మెచ్చుకుంటానూ అంటే… కంటెస్టెంట్ల ఎంపికలో కొంత ఎమోషన్‌కు గురవుతాడు గానీ ఓవరాల్‌గా తన జడ్జిమెంట్ సూపర్బ్…
ఒక్కసారి టీవీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి… స్టార్ మాటీవీ వాడి సూపర్ సింగర్, ఈటీవీ వాడి పాడుతా తీయగా. జీతెలుగు వాడి సరేగామ (అసలు ఈ టైటిలే చెత్తా)… అఫ్ కోర్స్, పాడుతా తీయగా బాలు నేతృత్వంలో సూపర్బ్… కానీ ఎప్పుడైతే సునీత, చరణ్ చేతుల్లోకి వెళ్లిపోయిందో అదొక ట్రాష్ అయిపోయింది…
ఒకప్పుడు స్టార్ మాటీవీ సూపర్ సింగర్ అనేది సెన్సేషనల్… ఇప్పుడది ఓ సాదాసీదా ఎంటర్‌టెయిన్‌మెంట్ షో… జీతెలుగు సరేగమ గురించి చెప్పుకోవడమే అనవసరం… తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ చూస్తుంటే సీజన్ 1 అండ్ 2 లకు మించిన పాటగాళ్లు వచ్చినట్టే కనిపిస్తోంది… ఇక్కడ చెప్పుకునేది నిజానికి అది కాదు…
Ads
చదువు, వృత్తి, కెరీర్, ప్యాషన్… వీటి నడుమ బోలెడు మంది డైలమాలో పడిపోతున్నారు… నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే సినిమా పాటల సింగింగ్ ఖచ్చితంగా ఒక కెరీర్ కాదు… దోపిడీ… ఏవో కచేరీల్లో పాడుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవడం తప్ప ఎంత విద్వత్తు ఉన్నా అది ఉత్త భ్రమాత్మక కెరీర్… పైగా మ్యూజిక్ కంపోజర్ల రకరకాల దోపిడీ…
జాతీయ అవార్డు సంపాదించిన సూపర్ గాయని సైతం పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో పాడుతూ పొట్టు పోసుకుంటున్న ఉదాహరణలూ మనకు తెలుసు… అందుకే శ్రీరామచంద్ర వంటి ప్రతిభావంతులైన గాయకులు సైతం రకరకాల పర్‌ఫామెన్స్ చేస్తూ నాలుగు పైసలు సంపాదిస్తున్నారు…
ఈసారి ఇండియన్ ఐడల్ షో ఆడిషన్స్‌కు వచ్చినవాళ్లలో ఒకరు అనిరుధ్… చూడగానే గీతామాధురి గుర్తుపట్టింది, చిన్నప్పటి నుంచీ పాడుతున్నావు కదాని… అవును, ఐఐటీలో గ్రాడ్యయేట్‌ను, చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను… కానీ ఈ సింగింగ్ కెరీర్ విషయంలో డైలమా అని నేరుగా చెప్పేశాడు అనిరుధ్… ఇద్దరు దోస్తులతో వచ్చి, గోల్డెన్ మైక్ పొందాడు, సూపర్ టోన్ తనది…
ప్రత్యేకించి ఒకామెను మరో ఉదాహరణగా చెప్పాలి… పేరు అనూరాధ… ఊరు బొబ్బిలి… ఉండేది ఒడిశా, రాయగఢ… తను ఆల్రెడీ ప్లేబ్యాక్ సింగర్ ఒడిశాలో… క్లాసిక్ డాన్సర్… యాక్ట్రెస్… త్వరలో డెంటిస్టు కాబోతోంది… ఐనా తెలుగు పాటల మీద పిచ్చి… ఎక్సలెంటుగా పాడింది… ఇన్‌స్టాలో ఏదో పాట పెడితే ఇదే కార్తీక్ కామెంట్ చేసి అభినందించాడు… అదే గుర్తుచేసుకున్నారు ఇద్దరూ… మెలోడియస్ టోన్…
మరొక పిల్లది శ్రీకాకుళం… కానీ తెలంగాణ యాసలో ఓ పాట అందుకుంది… పర్‌ఫెక్ట్ స్లాంగ్… బహుశా ఆమెకు నెక్స్‌ట్ లెవల్‌కు టికెట్లు వచ్చినట్టుంది… ఈ ఫీల్ మిగతా టీవీల రియాలిటీ షోలలో రాదు… సో, తెలుగు ఇండియన్ ఐడల్ షో చూసేవాళ్లకు మాత్రమే అర్థమయ్యే ఓ యూనిక్ ఫీలింగ్ ఇది… అంతే…
Share this Article