పొద్దున్నే ఏదో దినపత్రికలో ఒక సినిమా యాడ్ చూడగానే ఆశ్చర్యమేసింది… ఓ సినిమా యాడ్… దాని పేరు మా నాన్న నక్సలైట్… ఫాఫం, నక్సలైట్ ఉద్యమం అని జాలేసింది… అది క్షుద్ర సినిమా వస్తువు అయిందే అనే బాధేసింది… కొన్ని వేల మంది తాము నమ్మిన సిద్ధాంతానికి బలయ్యారు… వాళ్ల మార్గం తప్పో కరెక్టో అనే లోతైన చర్చ, మేధోవిశ్లేషణలు తరువాత… చివరకు అది ఈ చిల్లర ఇండస్ట్రీకి అక్కరకొచ్చే కథావస్తువు అయ్యిందే అని బాధ…
ఈమధ్య మూడు సినిమాలు వచ్చాయి నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో… ఒకటి ఆచార్య… నిజానికి ఏదో ఒరిజినల్ కథ… సహజంగానే తెలుగులోకి రీమేక్ అనగానే హీరోల సుప్రీం ఇమేజీ, ఫాల్స్ సుప్రిమసీని ఎక్స్‌పోజ్ చేస్తారు కదా… అది మన తెలుగు ఇండస్ట్రీకున్న తెగులు కదా… ఆ ఫార్ములాలో భాగంగానే చిల్లర స్టెప్పులు, చిల్లరన్నర పాటలు, చిల్లరెస్ట్ ఇమేజీ బిల్డప్పులు… అంతటి సైరా నర్సింహారెడ్డే తప్పించుకోలేకపోయాడు… ఇదెంత…? ఒక సెక్షన్ భాషలో చెప్పాలంటే పక్కా మనువాద సినిమా… మనువాద సాయుధపోరాటం అన్నట్టుగా… లాహే లాహే అని అరిచీ, ఎగిరీ ఆరిపోయాడు… ఫాఫం చిరంజీవి అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేం… అంతకుమించి తను మారడు, మారలేడు, మారనివ్వరు… అదొక విషాదపర్వం… ఫలితం పెద్ద డిజాస్టర్… అనూహ్యం ఏమీ కాదు… సరైన రిజల్టే…
Ads
పర్వం అంటే గుర్తొచ్చింది… విరాటపర్వం… నిజానికి దీన్ని తప్పుపట్టలేం… వెగటు, వెకిలి వాసనలు ఏమీ లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో తెరకు ఎక్కించాడు వేణు ఊడుగుల… కానీ ఒరిజినల్ కథను ఇష్టారాజ్యంగా మార్చిపారేశాడు… ఓ అపరిపక్వ ప్రేమకు అత్యంత ఉదాత్తమైన ముద్ర వేసి, ఆ వెన్నెల పాత్రను అతి అమితంగా ప్రేమించి పూర్తిగా దారితప్పాడు… రాజీపడ్డాడు… ఓ సగటు తెలుగు టీవీ సీరియల్ చేసేశాడు… చివరకు తనేం తీశాడో తనకే అర్థం కానట్టుగా…! ఇన్నేళ్లు ఆగీ, ఆపీ చివరకు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురై తనను తాను కాంప్రమైజ్ చేసుకున్నట్టున్నాడు… కానీ అట్టర్ ఫ్లాప్… ప్రేక్షకుడు పిచ్చోడు కాదు కదా…
కొండా అని మరో సినిమా… మురళిని హీరోగా చిత్రీకరించడానికి రాంగోపాలవర్మ అనే ఓ ‘‘బురదపంది’’ తనకు ఇష్టమొచ్చినట్టుగా తీసిన సినిమా అది… తనకు నక్సల్స్ మీద వీసమెత్తు అవగాహన లేదు, వెరసి ఛండాలం చేశాడు… తన గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోవడం, ఆ సినిమాలోని లోటుపాట్లు చర్చించడం మనకే సిగ్గుచేటు… వర్మ అనేవాడు ఓ డిస్‌కార్డెడ్ ఎలిమెంట్… అది వదిలేస్తే… తాజాగా ఇదుగో ఈ ప్రకటన… మా నాన్న నక్సలైట్… చదలవాడ అని చదవగానే దగ్గుబాటి అని స్ట్రయిక్ అవుతోంది, అదేమిటో…
తెలంగాణ యాస, కల్చర్, పాట, ఆట, మాటతోపాటు తెలంగాణతనం ఇప్పుడు ట్రెండ్… సేమ్, అలాగే నక్సలైట్ల ఉద్యమాన్ని కూడా తెలుగు ఇండస్ట్రీ పట్టేసుకుంది… అదొక సినిమా కథావస్తువు అయిపోయింది… తెలంగాణ యాస వీళ్ల వాయిస్ ఓవర్‌లో ఎంత వికృతంగా ధ్వనిస్తుందో, ఇదీ అంతే… ఏమీ తెలియదు… జస్ట్, అప్పటికప్పుడు ఆ సరుకును అమ్ముకోవాలనే తహతహ తప్ప… ఆ మూడు సినిమాలు అతి పెద్ద డిజాస్టర్లు… తెలంగాణ సమాజానికి నక్సలైట్లు అంటే ఏమిటో తెలుసు… ఇక వీళ్లు తమ నోటికొచ్చినట్టు కథనాలు, వ్యాఖ్యానాలు వినిపిస్తే అంగీకరిస్తారా..? మూసీలోకి విసిరేస్తారు… ఏమో… ఈ నాన్న నక్సలైట్ ఇంకా ఏ స్థాయికి నక్సలైట్లను చిత్రీకరిస్తాడో… ఫాఫం, నక్సలైట్లు…!! అవునూ, ఇదేనా, ఇంకా వచ్చేవి ఏమైనా ఉన్నాయా..?!
Share this Article