.
పేరు స్మిత… అసలు ఊరు బెజవాడ… ఇప్పుడు హైదరాబాద్… ప్రైవేటు సాంగ్స్ వీడియోలు బహుశా ఈమెతోనే స్టార్టయ్యాయి… కొన్ని సినిమాల్లో పాటలు పాడినా సరే, తన తొలి ఆల్బమ్ హాయ్ రబ్బాతో పాపులర్ అయ్యింది…
ఇప్పుడంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబులో అదరగొడుతున్నాయి… కానీ స్మిత తన వీడియోలు సొంతంగా రిలీజ్ చేస్తున్నప్పుడు తెలుగు సినిమా పాటల్నే రీమిక్సులే పాపులర్… మసక మసక చీకటిలో సాంగ్ అప్పట్లో బాగా హిట్… (20 ఏళ్ల క్రితం)…
Ads
సినిమాల్లో కూడా నటించింది… కొన్ని బ్యూటీ క్లినిక్కులు, ఫిట్‌నెస్ వ్యాపార కేంద్రాలు తెరిచింది… అలా బిజీ అయిపోయింది… ఆమధ్య టాక్ షోలు కూడా చేసింది… అలా సొంత వీడియో ఆల్బమ్స్‌కు గ్యాప్ వచ్చింది… ఇప్పుడు మళ్లీ అదే పాత రీమిక్స్ ధోరణితో… తనను తాను రీబూట్ చేసుకుని, అప్‌డేటెడ్ వెర్షన్‌తో తెరమీదకు వస్తోంది… తెర అంటే వెండి తెర కాదు, బుల్లి తెర కాదు… తనే ఆడాలి, తనే పాడాలి… స్టేజ్ మీద… దేశవిదేశాల్లో మ్యూజిక్ టూర్ చేయాలి…
కాకపోతే ఈసారి రీమిక్స్‌కు పాప్, జాజ్ వగైరాలన్నీ జతచేసి, య్యో య్యో బాపతు బోలెడంత వెస్టరన్ ఆర్కెస్ట్రయిజేషన్, కొన్ని కొత్త పదాలు గట్రా కలిపి కొట్టాలి… మొన్న బిగ్‌బాస్ వేదిక మీద నాగార్జునతో పాట రిలీజ్ చేయించింది…
పెద్ద ఇంప్రెసివ్ ఏమీ అనిపించలేదు… ఓహ్, ఇది గతంలో విన్న మసక మసక చీకటిలో పాటే కదా అని గుర్తుపట్టడమే కష్టం అయిపోయింది… ఇప్పుడు ఓజీ అనే పదం ట్రెండ్ కదా, అదే పేరు పెట్టింది… మరిక ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి…
ఈసారి ఆమెకు బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ జతకూడాడు… కానీ ఏమాటకామాట… 45 ఏళ్లకు కూడా అదే ఫిట్‌నెస్ మాత్రమే కాదు, అదే ఉత్సాహం ఉంది ఆమెలో… ఐతే ఇక్కడ సమస్య ఏమిటంటే..? ఏనాటి పాటలో ఈ మసక మసక చీకటి బాపతువి… ప్రస్తుత జనరేషన్‌కు అవి తెలియవు… తెలిసిన 50, 60 ఏజ్ బాపతు ప్రేక్షకులకు ఈ రీమిక్సులు జీర్ణం కావు…
కానీ స్మిత మాత్రం నమ్మకంగా ఉంది… ‘‘ఇండిపెండెంట్ మ్యూజిక్ నేనెక్కడ ఆపానో తెలుగులో అది అక్కడే ఆగిపోయి ఉంది… నార్త్ ఇండియాలో ఈ ధోరణి ఇంకా పాపులరే… అందుకే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచే మళ్లీ మొదలుపెడుతున్నా… మార్చి నుంచి వరుసగా లైవ్ షోలు… వచ్చే సంక్రాంతికి ఒక పాట వస్తుంది… ఆంధ్రా, హైదరాబాదే కాదు, దుబయ్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో కూడా లైవ్ షోలు ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చింది స్మిత మొన్న మీడియాతో… మసక మసక రీమిక్స్ పాట లాంచింగు ప్రోగ్రాములో…
గుడ్… ఎప్పుడు ఎలాంటి మ్యూజిక్, ఏ తరహా సాంగ్స్ హిట్టయితాయో చెప్పలేం కదా… మళ్లీ స్మిత మార్క్ తెలుగు పాప్ హిట్టయితే ఇక అందరూ ఆ బాటలోకే ఎగబడతారు… పైగా యూట్యూబ్ ఉండనే ఉందిగా… రాను బొంబయికి రాను అంటూ డాన్సడమే..! కాస్త పాప్ యాడ్ చేసి..!!
అన్నట్టు... సినిమాలు ఎందుకు చేయడం లేదమ్మా అని ఎవరో అడిగితే... మనకు చెప్పేది ఒకటి, దర్శకులు తీరా చూపించేది మరొకటి... అందుకని మానేశాను, ఇక సినిమాలు చేయను అనేసింది... అవును, కృష్ణవంశీ అలా చేయడం వల్లే కదా కమలిని ముఖర్జీ కూడా సినిమాలు మానేసింది...!!
Share this Article