Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నీకూ మోసం చేయడం తెలిస్తే… చేసి నువ్వూ సంపాదించుకో…’’

March 24, 2026 by M S R

.

తెలుగు సీనియర్ నటి జయలలిత ఏదో ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చింది… ఎవడో నిర్మాత అట… అనిల్ గణపతిరాజ్‌కు దాదాపు 4 కోట్లు వడ్డీకి ఇచ్చింది… ఇండస్ట్రీలో ఫైనాన్స్  చేయడం, వడ్డీలు తీసుకోవడం కామన్… కానీ అప్పటికే ఆమె 4 కోట్లను ఒక నిర్మాతకు అప్పు ఇచ్చే స్థితిలో ఉందంటే మంచిగా సంపాదించుకున్నట్టే…

కానీ సదరు నిర్మాత మోసం చేశాడు… వడ్డీ జయమ్మ అని వెక్కిరిస్తూనే ఎగ్గొట్టాడు… సొమ్ము రికవరీ కోసం సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిందట… (నిజానికి ఇలాంటి విషయాల్లో పోలీసులు లీగల్‌గా చేయగలిగేది చాలా తక్కువ… ఆమె తిరుగుతూ ఉంటే ఓసారి ఓ సీనియర్ పోలీస్ అధికారి ‘‘నీకూ మోసం చేయడం తెలిస్తే చేసి నువ్వూ సంపాదించుకో’’ అన్నాడట…

Ads

అవును, ఆయన చెప్పింది నిజమే… దాపరికం లేకుండా చెప్పాడు… కాలం అలాగే ఉంది… మోసమో, అక్రమమో, అవినీతో… నువ్వు ఎంత సంపాదించావు అనేదే ముఖ్యమైపోయింది… ఎలా సంపాదించావు అనేది అప్రస్తుతం అయిపోయింది… ఏమో, ఏ జన్మలో బాకీపడ్డానో వాడికి, అందుకే ఇలా జరిగింది అంటోంది ఆమె ఇప్పుడు… ఎందుకంటే, ఆ సొమ్ము తిరిగి వచ్చే చాన్స్ లేదు కాబట్టి… తత్వం మాట్లాడింది… అంతే…

ఆ ఇంటర్వ్యూలో నమ్మశక్యం అనిపించని (ఏమో నిజమే అయి ఉండవచ్చు కూడా) ఓ ఆసక్తికరమైన అంశం… ఆమెకు ధీరూబాయ్ అంబానీ రెండులగ్జరీ ఫ్లాట్లు కొనిచ్చాడనేది… ఒకటి ముంబైలో, ఒకటి మాంచెస్టర్‌లో… ముంబై వెళ్లినప్పుడు అందులో ఉండేదట, నెలకు 40 వేల కిరాయి వచ్చేదట… అంబానీ ఆమెకు ఆ ఆస్తులు ఎందుకు ఇచ్చాడు, ఈమె ముంబై ఎందుకు వెళ్లేది అనే ఎవరి ఊహకు వాళ్లకు వదిలేస్తే… అంబానీ మరణించాక ‘పరుల సొమ్ము మనకెందుకు’ అనుకుని ఆయన సెక్రటరీకి ఆ ఆస్తి కాగితాలు ఇచ్చేసిందట…

అలా అనుకుని కాదు, బహుశా ఆమె పేరిట ట్రాన్స్‌ఫర్ అయిఉండవు… ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది… ఎప్పుడంటే ముఖేష్ అంబానీ రేంజ్ వేరు… ప్రపంచ ధనికుల్లో ఒకడు… కానీ అప్పట్లో ధీరూబాయ్ చిన్న వ్యాపారి మాత్రమే కదా… ఐనా ఆమెకు అంత విలువైన ఆస్తులు ఎందుకిచ్చాడో…

ఆమెకు శరత్‌బాబుతో ‘ఆత్మీయ అనుబంధం – ప్రణయం చాన్నాళ్లు కొనసాగింది… కలిసి తిరిగారు… ఆయన మరణ సమయంలోనూ ఆమె తోడుగా ఉంది, అంత్యక్రియల్లో కూడా ఓ కుటుంబ సభ్యురాలిగానే పాల్గొంది… దాదాపు ఆయన సహచరిలాగే ఏడుస్తూ కనిపించింది… గుమ్మడిని ఓ తండ్రిలా భావించేది… ఆయన మరణ సమయంలోనూ తోడుగా ఉంది… జీవితంలో చాలా దెబ్బలు తిన్న అనుభవం, ఆమె మాటల్లో కొంత తాత్వికత కనిపిస్తోంది… చాలామంది వాడుకున్నారు ఆమెను… డబ్బు కోసం ఆమెను పెళ్లిచేసుకున్న భర్త కూడా మోసగించాడు చివరకు…

ప్రస్తుతం అరవయ్యేళ్ల వయస్సున్న ఆమె శాస్త్రీయ నృత్యం అభ్యసించింది చిన్నప్పుడే… ప్రదర్శనలు కూడా ఇచ్చేది, కానీ తెలుగు సినిమాలలో మాత్రం ఎక్కువగా బోల్డ్, వ్యాంప్ తరహా పాత్రలే వేసేది… కాదు, నిర్మాతలు అవే ఇచ్చేవారు… క్రమేపీ కేరక్టర్ ఆర్టిస్టుగా మారినా నటనను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేసింది తరువాత… ఆమధ్య టీవీ సీరియల్ ‘ప్రేమ ఎంత మధురం’లో కనిపించింది… ఆ తరువాత ఫుల్ స్టాప్ అనుకుంటా..!!

గ్లామర్ ఇండస్ట్రీలోని ప్రతి చీకటి షేడ్‌కూ ఆమె బాధితురాలే... ఆ దెబ్బల నుంచే ప్రాప్తం వంటి తాత్విక మాటలు పుట్టుకొస్తున్నాయి...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘నీకూ మోసం చేయడం తెలిస్తే… చేసి నువ్వూ సంపాదించుకో…’’
  • అమ్మ రాజీనామా చేస్తే… ఇల్లు కల్లోలమే…! మంచి కాన్సెప్టు మూవీ…!
  • ఇది లొట్టపీసు కేసు కాదు… రేవంత్ వర్సెస్ కేటీఆర్ – తిరగబడ్డ కాలచక్రం!
  • ఎన్నికల సంఘం సర్క్యులర్ మీద బీజేపీ స్టాంప్… ఏం జరుగుతోంది…
  • అమెరికాకు వాచిపోయింది… సగం యుద్ధాన్ని ఇరాన్ గెలిచినట్టే లెక్క…
  • హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్లస్థలాలు… మళ్లీ మొదటికొచ్చింది ఇష్యూ…
  • రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట… రేవంత్ రెడ్డి సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్…
  • అమెరికా ‘గుండెకాయ’కే ఇరాన్ గురి..! పుతిన్ ఆడుతున్న కొత్త ఆట..!!
  • చెప్పేవాడికి వినేవాడు లోకువ… చివరకు ఆ డ్రగ్స్ తండ్రీ నీతిబోధ…
  • సియాచిన్ జవాన్ల ప్రతి శ్వాసలోనూ ఈ జంట ఔదార్యపు పరిమళం

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions