సర్కారువారి పాట మూవీ విక్టరీ పార్టీకి థమన్ ఎందుకు పోలేదు..? బీజీఎం సరిగ్గా లేదనీ, రెండు పాటలు కాపీ ట్యూన్లేననీ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలొచ్చాయి… ఏపాట దేనికి కాపీయో కూడా సోషల్ మీడియా బట్టలిప్పేసింది… ప్రత్యేకించి సూపర్ హిట్ సాంగ్ కళావతి పల్లవి కొత్తగానే ఉన్నా, చరణాలన్నీ తన పాత పాటలకు కాపీయేననీ నెటిజనం విశ్లేషించింది… తనపై జరుగుతున్న కాపీక్యాట్ ప్రచారంతో డిస్టర్బ్ అయినందువల్లే థమన్ సర్కారువారిపాట పార్టీకి పోలేదని ఓ టాక్… నిజంగా థమన్ అంత సెన్సిటివా..? కానే కాదు…
ప్రస్తుతం కమర్షియల్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నాడు థమన్… నిజానికి తన వ్యవహారధోరణి, తత్వాన్ని బట్టి ఆలోచిస్తే తన మీద ఏదో ప్రచారం జరిగితే డిస్టర్బ్ అయ్యే కేరక్టర్ కాదు… పైగా సోషల్ మీడియా తీరూతెన్నూ మొత్తం తెలిసినవాడే… అవసరమైతే సోవాట్ అని తేలికగా తీసుకునే బాపతు… కానీ సర్కారువారిపాట కాపీ ట్యూన్స్‌పై స్పందించడం ఆసక్తికరంగా అనిపించింది… సరే, ఏదో పిచ్చి సమర్థనకు ప్రయత్నించాడు గానీ తను స్పందించడమే ఓ వార్త…
సినిమా కథలు, సీన్లు, పాటలు… అసలు తెలుగులో కాపీ కానిదేముంది..? దొరికితే రెండురోజులు వార్తల్లో ఉంటారు… అంతటి రాజమౌళి తన సినిమాల్లో కాపీ కొట్టిన సీన్లు ఎన్ని లేవు..? త్రివిక్రమ్ కథేమిటి..? ఎందరో…!! విజయం, కీర్తి, డబ్బు అన్నీ కప్పేస్తాయి… థమన్ ఎప్పుడూ పెద్దగా సమర్థనల జోలికి పోడు… కానీ ఈ సినిమాకు స్పందించి ఏవో చెప్పాడు… అదీ నప్పలేదు… మరింత పరువు తీసేలా ఉంది తన స్పందన, సమర్థన తీరు…
Ads
‘‘కాపీ కొట్టానా..? ఏమో… ఫ్లోలో గమనించలేదు… నిజానికి ఏదైనా కాపీకొట్టినట్టు అనిపిస్తే ముందుగా నా టీం అలర్టవుతుంది… 14 మంది టీం… కాపీ కొడితే చెప్పేసే యాప్స్ కూడా ఉన్నాయి… కాపీ అని తెలియలేదు కాబట్టి ఫ్రెష్ వర్క్ అనే ఫీల్‌తోనే పనిచేసుకుంటూ పోయాం… నా ట్యూన్‌నే నేను రిపీట్ చేశాననే విషయాన్ని జనం చెబితేనే తెలిసింది… ఐనా నా ట్యూన్‌నే నేను కాపీ కొట్టాను కదా, ఇబ్బంది లేదులే’’ అంటున్నాడు తను…
- తన సొంత ట్యూన్‌ను రిపీట్ చేసినట్టు అంగీకరిస్తున్నాడు ఇక్కడ… కానీ కంపోజింగ్ సమయంలో తెలియలేదట…
- తన టీం గానీ, తన యాప్స్ గానీ పట్టుకోలేకపోయాయి అంటున్నాడు… అదొక విఫల సమర్థన… (బహుశా ఇతరుల ట్యూన్స్ కాపీ కొడితేనే టీం గానీ, యాప్స్ గానీ రెస్పాండ్ అవుతాయేమో… సొంత ట్యూన్ల రిపిటీషన్ పట్టుకోలేవేమో…)
- రిపిటీషన్ అనేది జనం చెబితే గానీ తెలియదు అనే మాట అబ్సర్డ్…
- అందుకే మరి… ఊరుకున్నంత ఉత్తమం లేదు అంటారు పెద్దలు…
- కాపీ కొట్టడం కూడా ఓ ఆర్ట్… నేను ఆర్టిస్టును అని ఉంటే అయిపోయేది… ఇక ఎవ్వరూ మాట్లాడేవాళ్లు కాదుగా థమన్ భయ్… హహహ…
Share this Article