అనసూయ ఏదో అన్నది… చల్నేదో బాలకిషన్… సుమ ఏదో అన్నది… అరె, చోడ్ దేవోనా భాయ్… శోెభాశెట్టిని కొన్ని సైట్లు, చానెళ్లు టార్గెట్ చేసి కంత్రీ అని, సైకో అని తిట్టేస్తున్నయ్… అబ్బా, ఆ బిగ్‌బాస్ గోల ఇక్కడెందుకు..? అవి కావు గానీ, అప్పుడప్పుడూ తీట రేగి గోక్కునేవి కొన్ని ఉంటయ్… అదే బోయపాటి చేసింది…
తను ఏమన్నాడు..? అదేదో సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ… కంటెంట్ సరిగ్గా కుదరాలి, సీన్ సరిగ్గా రావాలి తప్ప కేవలం బీజీఎంతో పనికాదు అన్నాడు… అది థమన్‌ను ఉద్దేశించి అన్నాడని మీడియా కోడై కూసింది… బహుశా అదే నిజం కావచ్చు, ఎందుకంటే మీడియా రాతల్ని తను ఖండించలేదు, తను థమన్‌ను ఏమీ అనలేదనే క్లారిటీ కూడా ఇవ్వలేదు… కాస్త అణకువగా, వివాదాలకు దూరంగా ఉన్నట్టు కనిపించే బోయపాటి అంత మాట ఓ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌ను పట్టుకుని ఎందుకన్నాడు..?
ఇంకాస్త వివరంగా… తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బోయపాటిని ప్రశ్నిస్తూ.. ‘అఖండకి థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణమైంది. కానీ స్కందకి అది కొంచెం తగ్గిందని నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. దానిపై మీ రియాక్షన్’ అని అడిగారు. బోయపాటి బదులిస్తూ.. ‘స్కంద బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫీడ్ బ్యాక్ గురించి నేను ఒకసారి రివ్యూ చేస్తాను. ఎందుకు అలా జరిగిందంటే…’ అని చెప్పుకొచ్చిన ఈ మాస్ డైరెక్టర్.. ‘అఖండ సినిమాని మ్యూజిక్ లేకుండా చూసినా అదే హై ఉంటుంది. ఆ కథలో అంత దమ్ము ఉంది’ అంటూ… థమన్ చేసిందేమీ లేదనే అర్థమొచ్చేలా మాట్లాడాడు…
Ads
ఒకరకంగా థమన్‌ను తీసిపారేయడమే అది… వీళ్లిద్దరి కలయికలో సరైనోడు, అఖండ, స్కంధ తదితర సినిమాలు వచ్చినట్టున్నయ్… ఏమాటకామాట బోయపాటి ఇలా గోకడం కరెక్టు కాదు… అఖండ సినిమాకు డైలాగులు ఎలా ప్రాణమో, బీజీఎం కూడా అంతే ప్రాణం… బాలయ్య అభిమాని థమన్… అఖండ సినిమాకు ఎలా ఎఫర్ట్ పెట్టామో తన ఇంటర్వ్యూల్లో చెప్పాడు పలుసార్లు…
ఎస్.., థమన్ తన పాత ట్యూన్లే మళ్లీ మళ్లీ ప్రయోగిస్తాడు… ఎవరెవరి ట్యూన్లో కాపీ కొడతాడు… కొన్ని సినిమాలు సూపర్ హిట్ సరే, కానీ చాలా సినిమాల్లో సంగీతం ఫ్లాప్… అన్నీ నిజాలే కావచ్చుగాక… కానీ తను ఇప్పుడు దేవిశ్రీప్రసాద్‌కు దీటుగా పోటీ ఇస్తున్న కంపోజర్… అఫ్‌కోర్స్, కొన్ని సినిమాల్లో మ్యూజిక్ ఫ్లాప్ కావచ్చుగాక… అది సహజం…
అంతెందుకు ఇదే బోయపాటి జయజానకినాయక, వినయవిధేయరామ సినిమాల నాణ్యత మాటేమిటి..? పరమ నాసిరకం కాదా… వినయవిధేయరామ సినిమాను తలుచుకుంటే మెగా అభిమానులే అసహ్యించుకుంటారు… మరి తను థమన్‌ను ఆక్షేపించడం ఏమిటి..? దీనికి థమన్ ఎక్కడో మాట్లాడుతూ ఇచ్చి పడేశాడు… తనకూ టెంపర్ ఉంటుంది కదా మరి… ‘సీన్‌లో దమ్ము లేకపోతే నేనేం చేయగలను..?’ అన్నాడు, స్కంధ అట్టర్ ఫ్లాప్ కదా, దానికి వర్తిస్తుందేమో ఇది…
అంతేకాదు, చనిపోయిన శవాన్ని తీసుకొస్తే ఎలా లేపేది అనీ ఓ వ్యాఖ్య చేశాడు… దానిమీద బోయపాటిని వెనకేసుకొచ్చే సోషల్ మీడియా, సైట్లు, చానెళ్లు ఇక థమన్‌పై పడ్డాయి… నీకు తిండి పెట్టిన సినిమా ఇండస్ట్రీని శవంతో పోలుస్తావా అని తప్పుడు బాష్యాలు, వక్రీకరణలతో దాడికి దిగాయి… అసలు తను అన్న మాటేమిటి..? వీళ్ల రాతలేమిటి..? తను ఇండస్ట్రీని ఏమీ అనలేదు, కంటెంట్ బాగాలేకపోతే బీజీఎం కూడా ఏమీ చేయదు అన్నాడు… అది నిజం కూడా… థమన్ మీద ఎన్ని విమర్శలైనా ఉండనీ, ఈ వివాదంలో మాత్రం థమన్ నోరు జారిందేమీ లేదు… నిజానికి బోయపాటే తొందరపడ్డాడు…!! చివరగా… ఇదే బోయపాటి గతంలో డీఎస్పీ మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు…!!
Share this Article