.
ఒక భాషలో సూపర్ హిట్ సినిమా మరో భాషలో డిజాస్టర్ కావచ్చు… పాన్ ఇండియా పేరిట అనేక మార్కెటింగ్ జిత్తులతో దేశమంతా విడుదల చేసినా సరే, కొన్ని భాషల ప్రేక్షకులు ఎహెపోరా అని తిరస్కరించవచ్చు… ఎందుకంటే..? భాషలవారీగా సినిమా వీక్షణాల అభిరుచులు వేరు కాబట్టి…!
పాన్ ఇండియా ట్రెండ్ కదా ఇప్పుడు… జస్ట్, తక్కువ ఖర్చుతో పలు భాషల్లోకి… ప్రధానంగా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లోకి డబ్బింగ్ చేయించేసి, ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేయడం ఈరోజుల్లో అలవాటైపోయింది…
Ads
చాలా సినిమాలు అలా హిట్టయ్యాయి… కానీ..? అన్నింటికీ ఈ సూత్రం వర్తించదు,.. పర్‌ఫెక్ట్ ఉదాహరణ పుష్ప-2…. పేరుకు 2 వేల కోట్ల వసూళ్లు అని చెబుతున్నారు కదా… ఈలెక్కన బ్లాక్ బస్టర్ కదా…! కానీ కాదు… కేరళలో అల్లు అర్జున్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది… కానీ అక్కడ పుష్ప-2 ఓ డిజాస్టర్… ఎవ్వడూ దేకలేదు…
సేమ్, తమిళం, కన్నడం కూడా… హిట్టయింది హిందీలో… అంతా గుట్కా బ్యాచ్ కదా, అల్లు అర్జున్ పాత్రతో బాగా కనెక్టయినట్టున్నారు… తెలుగులో కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ రాలేదు… తాజా ఉదాహరణ చూద్దాం…
నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్‌ను మూడే భాషల్లో రిలీజ్ చేశారు… తెలుగు, హిందీ, తమిళం… తెలుగు, తమిళం మార్కెట్ పెద్దది కదా… హిందీ సరేసరి… నేషన్ వైడ్… సరే, ఏం జరిగింది..? నాలుగు రోజుల్లో 58 కోట్ల వసూళ్లు అని చెబుతున్నారు… చైతూ స్థాయికి ఇది మంచి ఫిగరే… కానీ తెలుగులో వోకే… హిందీ, తమిళం భాషల్లో ఫ్లాప్…
ఎంత అంటే..? నాలుగు రోజుల్లో తమిళ వెర్షన్ వసూళ్లు జస్ట్, 33 లక్షలు… మీరు చదివింది నిజమే… సేమ్, హిందీలో కూడా 37 లక్షలు… అంటే ఆ రెండు భాషల్లో ఎత్తిపోయినట్టే సినిమా… చైతూ ఆ భాషలకు కొత్త కావచ్చు, కానీ పరిచయం ఉన్న సాయిపల్లవి ఆ సినిమాలో ఉన్నా సరే తమిళం, హిందీల్లో ఎవడూ చూడటం లేదు ఆ సినిమాను…
ఎందుకు..? దీనికి ఇదీ సరైన కారణం అని ఒక్కమాటలో తేల్చిచెప్పలేం… ఏ సినిమా ఏ భాష ప్రేక్షకుడిని ఎందుకు కనెక్ట్ అవుతుందో, హిట్ అవుతుందో చెప్పాలంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి… ఇదీ అంతే…
అంతేకాదు, ఆయా భాషల్లో నటులను తెచ్చి పెట్టుకుంటే ఆయా భాషల మార్కెట్లలో ఫాయిదా ఉంటుందని అనుకోవడమూ వేస్టే… ఉదాహరణకు… కేజీఎఫ్, కాంతారా, కార్తికేయ-2, పుష్ప, బాహుబలి ఎట్సెట్రా… అంతా లోకల్ నటీనటులే కదా…
హిందీ బెల్టులో ప్రజెంట్ ట్రెండ్ పాకిస్థాన్ వ్యతిరేకత, దేశభక్తి అనుకున్నారు కదా తండేల్ నిర్మాతలు… ప్చ్, కానీ ఆ ప్రేక్షకులకు నచ్చలేదు, చాల్లేవోయ్ చెప్పొచ్చావు అని హిందీ ప్రేక్షకులు తిరస్కరించేశారు… అదీ సంగతి..!!
Share this Article