Srihari Mangalampalli… వాల్ మీద చదివిన ఓ పోస్టు… ‘‘కృతజ్ఞతా ప్రకటన… అద్భుత రామ మందిర నిర్మాణానికి కారణమై.. హిందూ సంఘటనకు ప్రేరణ ఇచ్చిన.. రావణ్ … బాబర్.. మీర్ బాకీ.. ఔరంగ జేబు.. సయ్యద్ షాబుద్దీన్.. జాఫర్యాబ్ జిలానీ… నెహ్రూ.. ఇందిర.. రాజీవ్.. డీ రాజా.. సీతారాం ఏచూరి… ప్రకాష్ కారత్… ప్రకాష్ రాజ్… ములాయం సింగ్.. వీ పీ సింగ్… లాలూ ప్రసాద్… స్టాలిన్… ఉదయనిధి… ఫరూక్ అబ్దుల్లా .. మమతా బెనర్జీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు…
పత్రికా రంగానికి చెందిన రాజ్ దీప్… బర్ఖా దత్.. హిందూ పేపర్ ఎన్ రామ్… రామోజీ… ఆర్ కేలకు స్పెషల్ థాంక్స్… ఫేస్ బుక్..ఇ తర సోషల్ మీడియాలో రోజుల తరబడి మేమంతా అలసి పోకుండా టెంపో మెయింటెయిన్ కావడానికి కారణం అయిన… రాముడంటే ఎవరు.. అయోధ్య ఎక్కడుంది… మోడీ అంటే ఎవరూ అని వేదన పడిన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు… ముఖ్యంగా పశ్చిమ యాత్రిక.. హాస్య చతుర … లౌకిక పుత్ర రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు… ఎవరినైనా మరచిపోయానా…. సారీ..’’
స్థూలంగా ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది… బీజేపీని- మోదీని ద్వేషించే ప్రయాసలో, వివేచన కోల్పోయి హిందూయిజాన్ని ద్వేషిస్తూ, హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ… రోజురోజుకూ హిందువుల్లో ఐక్యతకు వాళ్లంతట వాళ్లే బీజేపీ వైపు నెట్టేస్తున్నారు హిందువుల్ని…! లౌకికవాదం అంటే సర్వమత సహనమే తప్ప మైనారిటీలకు దాసోహం అయిపోవడం కాదు… మెజారిటీ మతాన్ని ద్వేషించడం కాదు… ఈ నిజం ప్రజలకు అర్థమవుతోంది… కానీ పైన చెప్పిన సోకాల్డ్ కుహనా సెక్యులరిస్టులకు మాత్రం అర్థం కావడం లేదు… చేజేతులా బీజేపీ బలాన్ని వాళ్లే పెంచుతున్నారు…
Ads
నిన్న హిందూ జాతి మూడ్ మొత్తం అయోధ్య మీద ఉంది… ఊరూరా వేడుకలు జరిగాయి… కానీ ఆ మూడ్ ఆఫ్ ది నేషన్‌కు భిన్నమైన తోవలో విపక్షాలు ప్రయాణించాయి… దీన్ని సగటు హిందువు ఏవగించుకుంటున్నాడు… సరిగ్గా బీజేపీకి కావల్సింది అదే… విపక్షాలు బీజేపీకి చేస్తున్న సాయమూ అదే… అయోధ్యలో గుడి కడుతుంటే మమత ఏం చేసింది..?
పలు మతాలకు చెందిన వాళ్లను ముందు వరుసలో, అవే ఆహార్యాలతో నడిపిస్తూ శాంతి ర్యాలీ జరిపింది… కారణం..? ఏమీ లేదు… జనం దృష్టిని మళ్లించడానికి… ఎంత అజ్ఞాన, మూర్ఖపు వాదనలు చేసిందో తెలుసా..? మోడీ తన ప్రసంగంలో సీత ప్రస్తావన తీసుకురాలేదట, సో, బీజేపీ మహిళా వ్యతిరేకం అట… బెంగాలీలు దుర్గామాతను పూజిస్తారు కాబట్టి తను మహిళా పక్షపాతి అట… ఇదుగో, ఈమెకు అర్జెంటుగా ప్రధాని కావాలని ఉంది…
అటు తమిళనాడులో ఏం జరిగింది..? టీవీల ప్రత్యక్ష ప్రసారాలు వద్దని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది… చివరకు వివాదం హైకోర్టుకూ, సుప్రీం దాకా వెళ్లింది… కోర్టులు చీవాట్లు పెట్టాయి, అబ్బే, అలాగని మేమేమీ ఆదేశించలేదు అని స్టాలిన్ సన్నాయినొక్కులు… ఉదయనిధికే తండ్రి కదా… మరోవైపు రాహుల్ గాంధీ అక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రంలో కావాలని ఓ పంచాయితీ గెలుక్కుని ధర్నాకు దిగాడు… నన్ను గుడిలోకి రానివ్వలేదు అంటూ…
ఢిల్లీలో ఆప్ శ్రేణులు సామూహిక సుందరకాండ పారాయణం చేశాయి… అదే యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఎవరో సోషలిస్ట్ నేత నివాళి కార్యక్రమంలో మునిగాడు… ఉద్దవ్ ఠాక్రే గోదావరి ఒడ్డున మహా హారతిలో పాల్గొన్నాడు… కేరళలో సీపీఎం అసహనంతో ఉడికిపోయింది… వీటిలో స్టాలిన్, సీపీఎం గట్రా వదిలేస్తే మళ్లీ అన్ని పార్టీలకు హిందువులు కావాలి… అందుకే సుందరకాండలు, దుర్గాపూజలు, గోదావరి మహాయాత్రలు ఎట్సెట్రా… కేసీయార్ బిడ్డ కవిత కూడా బీజేపీ రామనామజపానికి విరుగుడుగా కొండగట్టు ఆంజనేయుడిని ముందుపెట్టి క్యాంపెయిన్ చేయాలని అనుకుంది గానీ… శూర్ఫణఖ జన్మభూమి అని గేలిచేసే ఆమె తండ్రి పడనివ్వలేదు…
కానీ అయోధ్య వెళ్లరు… అది బీజేపీ కార్యక్రమమట, అందుకని తరువాత వెళ్తారట… రాముడిని బీజేపీ వైపు నెట్టింది ఎవరు..? ఇదుగో ఈ ధోరణులే… అయోధ్యకు వెళ్లిన సెలబ్రిటీలు, సాధుసంతులందరూ బీజేపీయేనా..? దాన్నొక జాతీయ ఉత్సవంగా చేస్తున్నప్పుడు దాన్ని ద్వేషించడం దేనికి..? అయోధ్యకు వెళ్లి ఉంటే అది బీజేపీ కార్యక్రమంగా ఫోకస్ అయి ఉండేది కాదు కదా… మోడీకి మైలేజీ రాకుండా అడ్డుకునేవాళ్లు కాదా… ఇదంతా పరోక్షంగా బీజేపీ బలం పెంచడం కోసమే కదా… అందుకే ఈ స్టోరీ మొదట్లో చెప్పినట్టు… సగటు కాషాయ కార్యకర్త కృతజ్ఞులై ఉండాల్సింది ఇలాంటి వారికే… వాళ్లే హిందువులను సంఘటితం చేసేది పరోక్షంగా…!!
రాముడి మీదో, హిందువుల మీదో బీజేపీకి పేటెంట్ రైట్స్ ఏమీ లేవు… రాముడు వాళ్లకే ఉపయోగపడాలా..? అలా ఉపయోగపడే చాన్స్ ఇస్తుంది ఎవరు..? మనమే రాముడిని ఓన్ చేసుకుందాం, ఏం, మనం హిందువులం కామా..? ఈ కోణంలో ఆలోచించింది పీవీ మాత్రమే… ఆ దిశలో కొన్ని అడుగులు వేశాడు, ఆలోచనలు చేశాడు కానీ… రాముడు మోడీని ఎంచుకున్నాడు కదా, పీవీని ఎలా నెగ్గనిస్తాడు…!!
Share this Article