Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చావు తరుముకొచ్చింది… అది గొంతులో ఇరుక్కుని మరీ కుట్టి చంపింది…

June 14, 2025 by M S R

.

ఫస్ట్, ఆ వార్త చదివినప్పుడు అస్సలు ఇంట్రస్టింగు అనిపించలేదు… అసలు బాలీవుడ్ నాటి కరిష్మా కపూర్‌నే అందరూ మరిచిపోయారు… ఒకప్పుడు కాస్త పాపులర్… అంతే…

తను మాజీ మొగుడు చనిపోతే అదో వార్తా అనిపించింది… తనెవరికీ తెలియదు… సెలబ్రిటీ కాదు, జస్ట్, కరిష్మా పాత మొగుడు అని తప్ప తనకు వేరే విశేషం ఏముంది అనిపించింది… కానీ..?

Ads

మొదట పోలో ఆడుతుండగా గుండెపోటు వచ్చి మరణించాడని రాశారు చాలామంది… తరువాత తెలిసింది… అది కాదు మరణ కారణం… ఓ తేనెటీగ తెరిచి ఉన్న తన నోట్లోకి దూరింది… తను బయటికి ఊసేయకుండా పొరపాటున మింగాడు…

అది గొంతు దాకా వెళ్లి కసికొద్దీ కుట్టింది… అది కాస్తా ఏదో మెడికల్ టరమ్ గుర్తుచేస్తూ విషమించి, తను ప్రాణాలు కోల్పోయాడు… అహ్మదాబాద్ విమానంలో సీటు విరిగి, ఎక్కడికో ఎగిరిపడి, ఒకాయన చావు నుంచి తప్పించుకోవడం ఎలా విశేషమో… గొంతులో ఇరుక్కున్న తేనెటీగ కుట్టి మరణించడమూ అంతే విశేషం అనిపించింది…

ఎస్, చావు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో తెలియదు అని చెప్పడానికి ఈ రెండూ బలమైన ఉదాహరణలు… అవునూ… కరిష్మా ఈ మాజీ మొగుడి పేరు సంజయ్ కపూర్… అనామకుడేమీ కాదు… దాదాపు 10 వేల కోట్ల ఆస్తిపరుడు…

పెళ్లిళ్లు, బంధాలపై నో కాంప్రమైజ్… మొదట ఫ్యాషన్ డిజైనర్ నందితను 1999లో వివాహం చేసుకున్నాడు! ఆమెకు విడాకులు ఇచ్చి 2003లో కరిష్మాను రెండవ వివాహం చేసుకున్నాడు సంజయ్… ఇద్దరు సంతానం కుమార్తె సమైరా కపూర్, కుమారుడు కియాన్ రాజ్ కపూర్! తరువాత 2016లో విడాకులు తీసుకున్నారు!

ఆ విడాకుల సమయంలో తన ఇద్దరు పిల్లల పేరిట 14 కోట్ల రూపాయల బాండ్స్ కొన్నాడట… ఆ ఇంటరెస్ట్ మొత్తాన్ని ఆ పిల్లలు తప్ప ఇంకెవరూ వాడుకోవడానికి వీల్లేకుండా..! ఆ తరువాతే విడాకులు మంజూరయ్యాయి…

తరువాత ఏం చేశాడు..? విడాకులు వచ్చిన జస్ట్, ఒకే సంవత్సరం తరువాత, అంటే  2017లో మోడల్ ప్రియా సచ్ దేవ్ ను మూడవ వివాహం చేసుకున్నాడు సంజయ్! వారిద్దరికీ ఓ కుమారుడు అజారియస్ కపూర్! అప్పటికే మొదటి భర్తతో విడిపోయిన ప్రియకు సఫీరా అనే కుమార్తె ఉంది!

అందరి బాధ్యతా సంజయ్ దే! ఎలక్ట్రికల్ వాహనాలలో ఆటోమోటివ్ సిస్టమ్స్ తయారుచేసే సోనా కామ్ స్టార్ అనే కంపెనీకి అధినేత సంజయ్! మంచి బిజినెస్ మెన్! అంతకు మించి లండన్ లో పేరు పొందిన అరియస్ పోలో టీమ్ కు కెప్టెన్!

53 ఏళ్ల సంజయ్ 10,300 కోట్లకు అధిపతి! సంజయ్ ఇలా ఆకస్మికంగా మరణించడం అందరినీ కలచివేసింది! ఎస్, చావు ఎవరిని ఎలా ఎప్పుడు వరిస్తుందో ఎవరమూ చెప్పలేం… విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన విశ్వాస్ సోదరుడు మాత్రం అదే ప్రమాదంలో మరణించాడు, తన తరువాత వరుసలో కూర్చున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రీ మరణించాడు…

ఆ విమానం కూలిన హాస్టల్ మెడికో పిల్లల్లో 20 మందీ మరణించారు… అన్నీ అనూహ్యాలే… విధి బలీయం… అంతే… (ఇన్‌పుట్స్ :: Mohammed Rafee)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంత్రి సోదరుడికి అవార్డు..? ఈ హుడావుడి లేట్ ప్రకటన ఏమిటి..?
  • స్వాతి..! ఓ కుంతీపుత్రి కథ… మగాధిపత్యంపై ఓ ధిక్కారపతాక…!!
  • సూప‌ర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!
  • రేవంత్‌రెడ్డి సర్కారు నిజంగానే గద్దర్‌ను అవమానించిందా..?!
  • చావు తరుముకొచ్చింది… అది గొంతులో ఇరుక్కుని మరీ కుట్టి చంపింది…
  • మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… ఓ పాత ఇంట్రస్టింగ్ స్టడీ ఇది…
  • ఆ అవార్డు అంటేనే అక్కినేనికి ఓ పరవశం… ఏంటది..? ఎవరిచ్చారు..?
  • విధి… ఆ సీటొక్కటే విరిగి దూరంగా పడి బతకడం అబ్బురమే…
  • అంతటి ఎన్టీయార్‌కే తప్పలేదు… పాపం కొమ్మినేని ఎంత..?
  • నీలి శివుడా… పాహిమాం… ఈ దిక్కుమాలిన క్రియేటివ్ ఫ్రీడం నుంచి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions